Homeఎంటర్టైన్మెంట్Irumudi Nakshatra: పాపం ఆంధ్రజ్యోతి.. ఇరుముడి నక్షత్ర విషయంలో అడ్డంగా బుక్కయింది..

Irumudi Nakshatra: పాపం ఆంధ్రజ్యోతి.. ఇరుముడి నక్షత్ర విషయంలో అడ్డంగా బుక్కయింది..

Irumudi Nakshatra: సినిమాలకు సంబంధించి చాలా వరకు ఇంటర్వ్యూలకు జర్నలిస్టులే సొంత భాష్యం అద్ది రాస్తారట. ఎందుకంటే సినిమా ప్రమోషన్ కు ఇంటర్వ్యూలు అవసరం. పైగా సినిమా జర్నలిస్టులకు గట్టిగానే కవర్లు లభిస్తుంటాయి. కాబట్టి సినిమా జర్నలిస్టులు తమ సొంత జ్ఞానంతో ఆ సినిమాలను గట్టిగానే కవర్ చేస్తారు. నేటి డిజిటల్ మీడియా కాలంలో కూడా.. ఇప్పటికీ కొన్ని ప్రధాన పత్రికల సినీ జర్నలిస్టులకు గట్టిగానే కవర్లు లభిస్తున్నాయి. అందువల్లే ఆ జర్నలిస్టులు వాస్తవంతో సంబంధం లేకుండా.. […]

Irumudi Nakshatra: సినిమాలకు సంబంధించి చాలా వరకు ఇంటర్వ్యూలకు జర్నలిస్టులే సొంత భాష్యం అద్ది రాస్తారట. ఎందుకంటే సినిమా ప్రమోషన్ కు ఇంటర్వ్యూలు అవసరం. పైగా సినిమా జర్నలిస్టులకు గట్టిగానే కవర్లు లభిస్తుంటాయి. కాబట్టి సినిమా జర్నలిస్టులు తమ సొంత జ్ఞానంతో ఆ సినిమాలను గట్టిగానే కవర్ చేస్తారు. నేటి డిజిటల్ మీడియా కాలంలో కూడా.. ఇప్పటికీ కొన్ని ప్రధాన పత్రికల సినీ జర్నలిస్టులకు గట్టిగానే కవర్లు లభిస్తున్నాయి. అందువల్లే ఆ జర్నలిస్టులు వాస్తవంతో సంబంధం లేకుండా.. క్షేత్రస్థాయి పరిస్థితితో అవసరం లేకుండా.. అసలు ఏ మాత్రం మాట్లాడకుండా ఇంటర్వ్యూలు రాసేస్తుంటారు.

వెనుకటికి సినిమాల హీరోలకు సంబంధించి ఇంటర్వ్యూలను స్టీరియో ఫోనిక్ లో రికార్డ్ చేసి.. ఆ తర్వాత రాసేవారు. అప్పట్లో ఎటువంటి వివాదాస్పద ప్రశ్నలు అడిగే వారు కాదు. ఒకవేళ అడిగినా వాటిని ఇంటర్వ్యూలో ప్రజెంట్ చేయకుండా ఉండేవారు. ఒకరకంగా మీరు మంచివారు.. మేము మంచి వారం.. వెరసీ మనిద్దరం మంచివాళ్ళం అన్నట్టుగా సినీ జర్నలిస్టుల ధోరణి ఉండేది. ఇప్పుడు కూడా అదే కొనసాగుతోంది కాకపోతే సినీ జర్నలిస్టులో ఇప్పుడు మరింత మంచితనాన్ని ప్రదర్శిస్తున్నారు. అందువల్లే సినిమాలు విడుదలైనప్పుడు నిర్మాతలకు లాభం కలగడానికి మరింత గొప్పగా ఇంటర్వ్యూలను రాస్తున్నారు. కవర్ ఎలాగూ ముడుతుంది కాబట్టి.. గట్టిగా నీకు కవర్ చేస్తుంటారు.

కొన్ని అగ్ర పత్రికలలో సినీ జర్నలిస్టులకు టార్గెట్లు ఉంటాయి. రిలీజ్ అయిన సినిమాలకు సంబంధించి యాడ్స్ తీసుకురావాలి. అంతేకాదు కొన్ని సందర్భాలలో బలవంతంగా డబ్బులు తీసుకొచ్చి కంపెనీకి ఇవ్వాలి. అందువల్లే అలాంటి పత్రికలలో సినీ జర్నలిస్టులకు విపరీతమైన స్వేచ్ఛ ఉంటుంది. పైగా వారు ఏది రాస్తే అది మాత్రమే పబ్లిష్ చేయాలి. అందులో మేనేజ్మెంట్ వేలు పెట్టకూడదు. పెద్ద తలకాయలు కనీసం ప్రశ్నించకూడదు.

ముందుగానే చెప్పినట్టు సినీ జర్నలిస్టులు ఇంటర్వ్యూలు సొంతంగానే రాస్తారు. కొన్ని సందర్భాలలో వారు రాసే ప్రశ్నలు జనాలలో నవ్వు తెప్పిస్తుంటాయి. అంతేకాదు ఆ పత్రిక పరువును తీసేస్తుంటాయి. అటువంటిదే ఆంధ్రజ్యోతి పత్రికకు ఎదురయింది. ఆంద్రజ్యోతి పత్రికలో ఆదివారం ఇరుముడి సినిమాలో నటించిన నక్షత్ర ఇంటర్వ్యూ పబ్లిష్ అయింది ఈ ఇంటర్వ్యూ ప్రారంభం నుంచి చివరి వరకు ఒక టెంపోలో సాగింది. కాని చివరి ప్రశ్న రాయకుండా ఉంటే బాగుండేది. ఎందుకంటే ఆ ప్రశ్న ఆంధ్రజ్యోతి విలువను మొత్తం దిగజార్చింది. మీ అమ్మానాన్నల్లో ఎవరంటే నీకు ఇష్టమని నక్షత్రను ఆంధ్రజ్యోతి అడిగింది. దానికి నక్షత్ర నాకు ఇద్దరు ఇష్టమే.. కాకపోతే నాన్న కంటే అమ్మంటేనే మరింత ఇష్టమని చెప్పిందని ఆంధ్రజ్యోతి రాస్కొచ్చింది. కానీ నక్షత్రకు చిన్నతనంలో తండ్రి చనిపోయాడు. ఆమెను తల్లి.. మేనమామ సాకుతున్నారు. ఈ విషయం ఆంధ్రజ్యోతి ప్రతినిధికి తెలియలేదా.. సెల్ఫ్ కుక్ ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు.. ఆ మాత్రం తెలుసుకోవాలి కదా.. ఇవన్నీ బిగినర్స్ మిస్టేక్స్.. పాపం ఆంధ్రజ్యోతి..

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper