Homeఎంటర్టైన్మెంట్Pawan Kalyan : వెన్నుపోటు పొడిచిన స్నేహితుడిని మరోసారి దగ్గరకి తీసుకున్న పవన్ కళ్యాణ్

Pawan Kalyan : వెన్నుపోటు పొడిచిన స్నేహితుడిని మరోసారి దగ్గరకి తీసుకున్న పవన్ కళ్యాణ్

Pawan Kalyan : అతి మంచితనం ఒక్కోసారి హానికరం అని పెద్దలు చెప్తూ ఉంటారు..ఈ సూక్తి కూడా పవన్ కళ్యాణ్ కి సరిగ్గా సరిపోతుంది..ఆయనే చాలాసార్లు చెప్పాడు.. నాలో ఉన్న బలహీనత క్షమా గుణం అని..రీసెంట్ గా జరుగుతున్నా సంఘటనలు చూస్తూ ఉంటే ఇంత మంచితనం అవసరమా.. చివరికి ఏమి మిగులుతుంది అనే భావన అందరిలో కలుగుతుంది.. స్నేహితుడిని అంటూ సోల్ మెట్ ని అంటూ చెప్పుకొని చెప్పుకొని తిరిగే వాళ్ళందరూ ఈరోజు పవన్ కళ్యాణ్ ని రాజకీయంగా ఒంటరిని చేసారు.

ఒంటరి చేసినా పర్లేదు కానీ ఆయనని 24 గంటలు దూషిస్తూ ఉండే ప్రత్యర్థి పార్టీల్లో చేరి వారితో కలిసి చురకలు అంటించడం వంటి ఘటనలు మనం ఎన్నో చూసాము..వారిలో  ఓ కమెడియన్  ఒకడైతే, ప్రముఖ రచయిత కోన వెంకట్ ఇంకొకరు.. తాజాగా కోన వెంకట్ ని మాత్రం దగ్గరకి తీసాడు.

ఇక అసలు విషయానికి వస్తే.. ఈరోజు పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం #OG ప్రారంభమైంది.  ఈ చిత్రం ప్రారంభోత్సవానికి ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులందరూ హాజరయ్యారు.. వారిలో కోన వెంకట్ కూడా ఒకరు.. అతనితో పవన్ కళ్యాణ్ నవ్వుతు క్లోజ్ గా మాట్లాడడం చూసి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు..కోన వెంకట్ అప్పట్లో చాలా ఇంటర్వ్యూస్ లో పవన్ కళ్యాణ్ నా ప్రాణ స్నేహితుడు అని చెప్పుకున్నాడు.. కానీ రాజకీయంగా వస్తే మాత్రం వైసీపీ పార్టీ లో చేరాడు.

పవన్ కళ్యాణ్ మీద విమర్శలు కూడా చేసాడు.. అంతే కాదు అప్పట్లో కత్తి మహేష్ కి పవన్ కళ్యాణ్ ని తిట్టే స్క్రిప్ట్ ని వెనక నుండి నడిపించిన వాళ్లలో కోనవెంకట్ కూడా ఒకరని ఆరోపణలు వెల్లువెత్తాయి… అలాంటి వారితో పవన్ కళ్యాణ్ మళ్ళీ స్నేహం ఎక్కడ చేస్తాడో అని అభిమానులు భయపడిపోతున్నారు.. అతి మంచితనం చూపించకు అన్నా అంటూ పవన్ కళ్యాణ్ ని ట్యాగ్ చేసి తాజాగా బతిమిలాడుకుంటున్నారు ఫ్యాన్స్. మరి కోనవెంకట్ చేసిన దాంట్లో నిజం ఎంత? లేదో కానీ పవన్ ఫ్యాన్స్ మాత్రం ఇప్పుడే ఇదే విషయంపై సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular