Pathaan Collections : వరుస ఫ్లాప్స్ తో ఇక అసలు మనం కోలుకుంటామా..? సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ డామినేషన్ ఉంటుందా.. బాలీవుడ్ పని ఇక అయిపోయినట్టేనా అని బాలీవుడ్ ట్రేడ్ మొత్తం అనుకుంటున్నా సమయంలో వాళ్ళ పాలిట దేవుడిలాగా మారిపోయాడు షారుఖ్ ఖాన్.. తాజాగా ఆయన హీరోగా నటించిన ‘పఠాన్’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద అనితర సాధ్యమైన రికార్డ్స్ ని నెలకొల్పింది.. ముఖ్యంగా ఓవర్సీస్ లో ఈ చిత్రం ధాటికి #RRR మూవీ లైఫ్ టైం కలెక్షన్స్ కేవలం నాలుగు రోజుల్లోనే మటాష్ అయ్యింది.

ఇక అమెరికాలో అయితే #RRR చిత్రం క్లోసింగ్ లో 13 మిలియన్ డాలర్లు వసూలు చేస్తే పఠాన్ చిత్రం కేవలం 5 రోజుల్లోనే 10 మిలియన్ డాలర్స్ వసూలు చేసింది.. ఇక ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద కూడా ఈ సినిమా ఒక సునామీనే అని చెప్పాలి..ఇప్పటి వరకు టాప్ 5 మూవీస్ గా కొనసాగుతున్న సినిమాల క్లోసింగ్ కలెక్షన్స్ అన్నిటినీ ఈ చిత్రం నాలుగు రోజుల్లోనే దాటేసింది అంటే ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్ అనేది అర్థం చేసుకోవచ్చు.
మొదటి రోజు సుమారుగా 108 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసిన ఈ సినిమా, రెండవ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ గ్రాస్ వసూళ్లను రాబట్టి కేవలం రెండు రోజుల్లోనే 250 కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టిన ఏకైక బాలీవుడ్ సినిమాగా సరికొత్త చరిత్ర సృష్టించింది.. రోజుకో వంద కోట్ల రూపాయిల చొప్పున 5 రోజులకు గాను 542 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.. ఇది మామూలు రికార్డు కాదనే చెప్పాలి.. సోమవారం రోజు కూడా ఈ చిత్రం పాతిక కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లను సాధించే అవకాశం ఉందని చెప్తున్నారు బాలీవుడ్ ట్రేడ్ పండితులు.
పరిస్థితి చూస్తూ ఉంటే ఈ చిత్రం చాలా తేలికగా వెయ్యి కోట్ల రూపాయిల మార్కుని అందుకుంటుంది అని అంటున్నారు ట్రేడ్ పండితులు..ఇప్పటి వరకు మన ఇండియన్ సినిమా హిస్టరీ లో కేవలం సౌత్ సినిమాలైనా బాహబలి 2 , KGF చాప్టర్ 2 మరియు #RRR సినిమాలే వెయ్యి కోట్ల రూపాయిల మార్కుని అందుకుంది..ఇప్పుడు ఆ జాబితాలోకి పఠాన్ కూడా చేరబోతోంది.