Arjun – Srisatya : బిగ్ బాస్ ప్రతి సీజన్ కి ఓ ప్రేమ జంట వెలుగులోకి వస్తుంది. సీజన్ 3 నుండి ఈ ట్రెండ్ నడుస్తుంది. రాహుల్ సిప్లిగంజ్-పునర్నవి, అఖిల్ సార్థక్-మోనాల్ గజ్జర్, అభిజీత్-అలేఖ్య హారిక, షణ్ముఖ్-సిరి బిగ్ బాస్ షో వేదికగా రొమాన్స్ పంచారు. ప్రేమికులుగా జనాల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక సీజన్ 6లో సైతం కొందరు లవ్ బర్డ్స్ గా అవతరించారు. ఇనయా సుల్తానా కంటెస్టెంట్ సూర్య అంటే క్రష్ అని చెప్పారు. నాన్ స్టాప్ రొమాన్స్ పంచారు. సూర్య త్వరగా ఎలిమినేట్ కావడంతో వీరి లవ్ స్టోరీకి బ్రేక్ పడింది. ఇక ఎఫైర్స్ వార్తల్లోకి ఎక్కిన మరొక బ్యూటీ శ్రీసత్య.

అర్జున్ కళ్యాణ్ గేమ్ వదిలేసి శ్రీసత్య జపం చేశాడు. హౌస్లో ఉన్నన్ని రోజులూ శ్రీసత్య చుట్టూ తిరిగాడు. టైటిల్ కోసం కాకుండా శ్రీసత్యను ఇంప్రెస్ చేయడానికి వచ్చినట్లయ్యింది. నాపై హోప్స్ పెట్టుకోకు అని చెబుతూనే అర్జున్ ని శ్రీసత్య తెలివిగా వాడేసింది. తాను గేమ్ లో ముందుకు వెళ్లేందుకు అతన్ని ఉపయోగించుకుంది. శ్రీసత్య నామస్మరణ చేస్తున్న అర్జున్ కళ్యాణ్ ని ఆడియన్స్ త్వరగా బయటకు పంపేశారు. వెళుతూ వెళుతూ అసలు షోకి వచ్చింది నీ కోసమే అంటూ పచ్చి నిజం బయటపెట్టాడు. పాపం కన్నీరు పెట్టుకున్నాడు.
ట్విస్ట్ ఏంటంటే… అర్జున్ ఎలిమినేట్ అయ్యాక శ్రీహాన్ కి శ్రీసత్య దగ్గరైంది. స్నేహం పేరుతో అతడితో రొమాన్స్ చేసింది. రేవంత్, ఇనయా వీరి వ్యవహారం పై కొన్ని సందర్భాల్లో ఓపెన్ అయ్యారు కూడా. శ్రీసత్య దెబ్బకు శ్రీహాన్ గేమ్ కూడా డిస్టర్బ్ అయ్యింది. సిరి హౌస్లోకి ఎంట్రీ ఇచ్చి శ్రీహాన్ ని సెట్ చేసింది. ఇదంతా బయటుండి అర్జున్ గమనిస్తున్నాడు. అయినా అతడికి శ్రీసత్య మీద ఇష్టం కొంచెం కూడా తగ్గలేదు. ఇది తాజాగా రుజువైంది.
బీబీ జోడీ పేరుతో మాజీ కంటెస్టెంట్స్ పార్టిసిపెంట్స్ గా డాన్స్ రియాలిటీ షో స్టార్ట్ చేశారు. ఈ షోలో అర్జున్-వాసంతి జంటగా పోటీ చేస్తున్నారు. ఇక శ్రీసత్య-మెహబూబ్ ఒక జోడిగా ఉన్నారు. ఈ బీబీ జోడీలు స్టార్ మా పరివార్ షోకి వచ్చారు. ఈ క్రమంలో వేరు వేరు టీముల్లో ఉన్న శ్రీసత్య-అర్జున్ మధ్య చూపులు కలిశాయి. మెహబూబ్ తో డాన్స్ చేస్తున్న శ్రీసత్యను చూసి అర్జున్ కుళ్ళుకున్నాడు. అలాగే ఆమెను చూస్తుండిపోయారు. అర్జున్ బాధను గమనించిన యాంకర్ శ్రీముఖి ఇద్దరి మధ్య చిన్న పోటీ పెట్టింది. ఒకరికి కళ్ళలోకి మరొకరు చూసుకోవాలని చెప్పింది. చాలా రొమాంటిక్ గా చూపులు కలిపిన శ్రీసత్య-అర్జున్ కళ్ళతోనే ఏదో మాట్లాడుకున్నారు. దీనికి సంబంధించిన స్టార్ మా పరివార్ ప్రోమో వైరల్ అవుతుంది.