Homeఎంటర్టైన్మెంట్Anna Konidela : ‘జీవితం ఇప్పటికే చాలా సంక్లిష్టంగా ఉంది’.. అన్నా కొణిదెల సంచలన పోస్టు.....

Anna Konidela : ‘జీవితం ఇప్పటికే చాలా సంక్లిష్టంగా ఉంది’.. అన్నా కొణిదెల సంచలన పోస్టు.. వైరల్

Anna Konidela : జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ భార్య అన్నా కొణిదెల సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. కొన్ని సార్లు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫొటోలు, విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఆమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన కొన్ని ఫొటోలు, వాటితో పాటు రాసిన మాటలు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇంతకీ ఈమె ఏం రాశారంటే? తాజాగా అన్నా కొణిదెల తన రోజువారీ జీవితం ఎలా […]

Anna Konidela : జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ భార్య అన్నా కొణిదెల సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. కొన్ని సార్లు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫొటోలు, విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఆమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన కొన్ని ఫొటోలు, వాటితో పాటు రాసిన మాటలు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇంతకీ ఈమె ఏం రాశారంటే?

తాజాగా అన్నా కొణిదెల తన రోజువారీ జీవితం ఎలా సాగుతోందో చెబుతూ కొన్ని ఫొటోలను పంచుకున్నారు. ‘బరువులు ఎత్తడం, అందంగా తయారవ్వడం, కాఫీ తాగడం, రమ్మీకబ్ ఆడటం, కుక్కలను ముద్దు చేయడం, అప్పుడప్పుడు ఫొటో తీసుకోవడం” అంటూ తన రోజువారీ కార్యకలాపాలను సరదాగా వివరించారు.

అంతేకాదు.. ఈ రోజు ఎలాంటి లోతైన ఆలోచనలు లేవంటూ ఆమె పేర్కొన్నారు. ‘జీవితం ఇప్పటికే చాలా సంక్లిష్టంగా ఉంది’ అనే భావనతో తన పోస్టుకు క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం తన జీవితంలోని చిన్న చిన్న ఆనందాలను ఆస్వాదిస్తూ, సాధారణమైన విషయాల్లోనే సంతోషాన్ని వెతుక్కుంటున్నట్లుగా ఆమె పోస్ట్ కనిపిస్తోంది.

అన్నా కొణిదెల షేర్ చేసిన ఫొటోల్లో ఆమె వ్యక్తిగత జీవనశైలికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన క్షణాలు కనిపిస్తున్నాయి. వ్యాయామం చేయడం, కాఫీ ఆస్వాదించడం, పెంపుడు కుక్కలతో సమయం గడపడం వంటి అంశాలను ఆమె తన పోస్టులో ప్రస్తావించడం ద్వారా తన రోజువారీ జీవితంలోని సాధారణ క్షణాలను అభిమానులతో పంచుకున్నారు.

సాధారణంగా తన వ్యక్తిగత జీవితాన్ని పెద్దగా బయటకు తీసుకురారు. అయితే అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఫొటోలు, చిన్నచిన్న పోస్టులు చేయడం ద్వారా అభిమానులతో టచ్‌లో ఉంటారు. ఆమె పోస్టులకు పవన్ కల్యాణ్ అభిమానులతో పాటు సోషల్ మీడియా యూజర్ల నుంచి కూడా స్పందన వస్తుంటుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper