Homeఎంటర్టైన్మెంట్పాపం సూపర్ హిట్ ఇచ్చినా.. ఇదేం ఖర్మో !

పాపం సూపర్ హిట్ ఇచ్చినా.. ఇదేం ఖర్మో !

irector vamsi paidipally

సూపర్ స్టార్ మహేష్ బాబుతో ‘మహర్షి’ లాంటి సూపర్ హిట్ సినిమా తీసిన తరువాత కూడా, పాపం ఛాన్స్ కోసం స్టార్ హీరోల చుట్టూ అలిసిపోయేలా తిరుగుతున్నాడు డైరెక్టర్ వంశీ పైడిపల్లి. ఓ దశలో ప్రభాస్, వంశీకి ఓకే చెప్పాడు అనే రూమర్ కూడా వినిపించింది. కానీ ప్రభాస్ వరుస సినిమాల బిజీతో వంశీతో వెంటనే సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేకపోయాడు. మరోపక్క హిట్స్ కొట్టిన స్టార్ డైరెక్టర్ అని కూడా చూడకుండా వంశీ పైడిపల్లికి మొహం చాటేశాడు మహేష్. నిజానికి మహేష్ నే పిలిచి మరీ వంశీకి ఛాన్స్ ఇచ్చాడు. కానీ వంశీ చెప్పిన కథ నచ్చక పరుశురాంకి ఓకే చెప్పి మహేష్ అటు వెళ్ళిపోయాడు.

Also Read..మహేశ్ బాబు నుండి పరుశురామ్ కి క్లారిటీ !

ఇక అప్పటినుండి వంశీ ఎందుకో సినిమా అంత త్వరగా సెట్ అవ్వట్లేదు. అందరి స్టార్ హీరోలు ఇప్పటికే వేరే సినిమాలతో బిజీగా ఉండటం కూడా ఒక కారణం కావొచ్చు. ఏదీ ఏమైనా వంశీకి మాత్రం అసలు టైం కలిసిరాలేదు. ఎంతో కష్టపడి రామ్ చరణ్ ను ఒప్పించినా ఇప్పుడు ఆ సినిమా కూడా డౌట్ గానే మిగిలిపోయింది. సినీ వర్గాల సమాచారం ప్రకారం రామ్ చరణ్ తన తరువాత సినిమాని దర్శకుడు సురేందర్ రెడ్డితో ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. సురేందర్ రెడ్డి చెప్పిన కథ చరణ్ కు బాగా నచ్చిందట. అందుకే ముందుగా సురేందర్ రెడ్డి సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లాలని చరణ్ ప్లాన్ లో ఉన్నాడు.

Also Read..ఆర్ఆర్ఆర్ కు ముందే రాంచరణ్ సరికొత్త రికార్డు..!

మొతానికి వంశీ తన తదుపరి చిత్రాన్ని చరణ్ తో చేయాలని ముమ్మరంగా ప్రయత్నాలు చేసినా.. చరణ్ మాత్రం వంశీకి సినిమా ఇవ్వలేదు. పైడిపల్లి చెప్పిన కథ రామ్ చరణ్ కు నచ్చకపోవడం అందుకు కారణం అని బయటకు వచ్చిన వార్త. నిజానికి మహేష్, వంశీ సినిమాని పక్కన పెట్టెయ్యడానికి కూడా కథేనట మెయిన్ రీజన్. ఇక చేసేదేం లేక వంశీ మిగిలిన స్టార్ హీరోల చుట్టూ కథ పట్టుకుని మళ్లీ తిరగాల్సిందేనా. వంశీ లాస్ట్ మూవీ ‘మహర్షి’ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ల వర్షం కురిపించడంతో పాటు హిందీ డబ్బింగ్ వర్షన్ కూడా మంచి హిట్ అయింది. అయినా వంశీకి మాత్రం ఆ హిట్ ఏ రకంగానూ ఉపయోగపడకుండా పోవడం బాధాకరమనే అనుకోవాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper