
దుబ్బాకలో టీఆర్ఎస్ గెలుపు కోసం హరీశ్ రావు అహర్నిశలు శ్రమించాడు. కానీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతో మంచోడనిపించుకున్న హరీశ్ రావును కూడా దుబ్బాక ప్రజలు విశ్వసించలేదు. దీంతో ఇప్పడు టీఆర్ఎస్ ఓటమిని హరీశ్ రావుపై నెట్టెస్తున్నారందరు. మంత్రి కూడా ప్రచారంలో దుబ్బాక అభివ్రద్ధి బాధ్యత నాదే అని చెప్పి, ఓడిన తరువాత ఓటమికి నాదే బాధ్యత అని ప్రకటించాడు.
Also Read: దుబ్బాక ఎన్నికతో చంద్రబాబు కదలిక..!
ఈ తరుణంలో కేసీఆర్ ముందే ప్లాన్ వేసి హరీశ్ రావును బలిపశువును చేశాడని కొందరు నాయకులు గుసగుసలు పెట్టుకుంటున్నారు. అంతకుముందు సిద్ధిపేట జిల్లాలో జరిగిన ప్రతీ ఎన్నికలోనూ హరీశ్ రావుకే బాధ్యతలు అప్పగించారు కేసీఆర్. అయితే దుబ్బాకలో నోటిఫికేషన్ రాకముందు నుంచే టీఆర్ఎస్ ప్రభుత్వం దుబ్బాకను పట్టించుకోలేదన్న ఆరోపణలను ఎదుర్కొంది. ఈ తరుణంలో కేసీఆర్ వెళ్లి ప్రచారం చేసి ఓడిపోతే విలువ ఉండదని ముందే ఊహించనట్లు తెలుస్తోంది. దీంతో ఒకవేళ దుబ్బాకలో గెలిస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు పనిచేశాయని, ఓడిపోతే హరీశ్రావు ప్రజలను ఆకట్టుకోలేదనే మలుపు తిప్పవచ్చని అనుకున్నట్లు తెలుస్తోంది.
Also Read: రఘునందన్ పై కేసీఆర్ బ్రహ్మస్త్రం పనిచేయలేదా..?
2018 ఎన్నికల తరువాత కేబినేట్ విస్తరణలో కొన్ని నెలలపాటు హరీశ్ రావును మంత్రి వర్గంలో చేర్చుకోలేదు. దీంతో పార్టీలోని కొందరి నాయకుల నుంచి తీవ్రంగా విమర్శలు వచ్చాయి. అంతేకాకుండా సిద్ధిపేట జిల్లాలోని కొన్ని చోట్ల పార్టీకి ఎదురు దెబ్బలు తగిలాయి. దీంతో పరిస్థితిని గమనించిన కేసీఆర్ వెంటనే కేబీనెట్ ను విస్తరించి హరీశ్ రావుకు ఆర్థిక శాఖను అప్పగించారు.
తాజగా కేబినేట్ విస్తరణ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే కుటుంబ పాలన అని పేరు తెచ్చుకున్నకేసీఆర్ కుటుంబ సభ్యులందరూ మంత్రి పదవుల్లో ఉన్నారు. తాజాగా ఎమ్మెల్సీగా ఎన్నికైన కవితకు మంత్రి పది లేదు. అందువల్ల కవితకు మంత్రి పదవి ఇవ్వాలంటే ఎవరి తొలగించాలన్నఆలోచనలో కేసీఆర్ ఉన్నాడట. ఇదివరకు మంత్రి పదవి ఊడే వార్ల లిస్టులో గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు తదితరుల పేర్లు విపించాయి.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్
ఏదో ఒక కారణంతో మంత్రి పదవిని తప్పించాలనే ఉద్దేశంలో హరీశ్ రావును దుబ్బాక ఎన్నికల బాధ్యతలను అప్పగించారని చర్చ మొదలైంది. దుబ్బాకలో ఓడిపోతామని ముందే తెలిసిన కేసీఆర్ హరీశ్ రావుకే అప్పగించడంపై చర్చ జరుగుతోంది. దీంతో భవిష్యత్తులో హరీశ్ రావుకు మంత్రి పదవి ఉంటుందోలేదోనని అనుకుంటున్నారు.
Comments are closed.