Homeఎంటర్టైన్మెంట్Dhee Double Impact: 'ఢీ' సరికొత్త సీజన్ వచ్చేసింది.. జడ్జీలు ఎవరో తెలుసా? కలలో కూడా...

Dhee Double Impact: ‘ఢీ’ సరికొత్త సీజన్ వచ్చేసింది.. జడ్జీలు ఎవరో తెలుసా? కలలో కూడా ఊహించి ఉండరు!

Dhee Double Impact: ఈటీవీ లో అత్యధిక టీఆర్ఫీ రేటింగ్స్ ని సొంతం చేసుకుంటూ ముందుకు దూసుకెళ్లిన బిగ్గెస్ట్ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’. ఒక డ్యాన్స్ షో 20 సీజన్స్ ని పూర్తి చేసుకోవడమంటే సాధారణమైన విషయం కాదు. ఇప్పటి వరకు హిస్టరీ లో ఏ డ్యాన్స్ షో కూడా ఇన్ని సీజన్స్ ని జరుపుకోలేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి బిగ్గెస్ట్ డ్యాన్స్ షో అర్థాంతరంగా ఆగిపోయింది అనే బాధ అభిమానుల్లో ఉంది. […]

Dhee Double Impact: ఈటీవీ లో అత్యధిక టీఆర్ఫీ రేటింగ్స్ ని సొంతం చేసుకుంటూ ముందుకు దూసుకెళ్లిన బిగ్గెస్ట్ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’. ఒక డ్యాన్స్ షో 20 సీజన్స్ ని పూర్తి చేసుకోవడమంటే సాధారణమైన విషయం కాదు. ఇప్పటి వరకు హిస్టరీ లో ఏ డ్యాన్స్ షో కూడా ఇన్ని సీజన్స్ ని జరుపుకోలేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి బిగ్గెస్ట్ డ్యాన్స్ షో అర్థాంతరంగా ఆగిపోయింది అనే బాధ అభిమానుల్లో ఉంది. చిన్న బ్రేక్ మాత్రమే అని యాంకర్ నందు చెప్పినప్పటికీ, ఇక ఈ షో ముందుకు వెళ్లడం కష్టమే , అభిమానులను శాంతింపజేయడానికి అలా చెప్పారు అని అంతా అనుకున్నారు. కానీ అతి తక్కువ సమయం లోనే కొత్త సీజన్ ని మొదలు పెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది మల్లె మాల ఎంటర్టైన్మెంట్స్ సంస్థ. ఈ సీజన్ కి ‘ఢీ – డబుల్ ఇంప్యాక్ట్’ అనే టైటిల్ ని ఖరారు చేశారు.

ఈ షో లో కంటెస్టెంట్స్ గా ఎవరెవరు ఉండబోతున్నారు? , అసలు ఈ సీజన్ థీమ్ ఏంటి? వంటి వివరాలు బయటకు రాలేదు కానీ , ఈ షో కి జడ్జీలుగా జానీ మాస్టర్ , ప్రముఖ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఉండబోతున్నట్టు సమాచారం. జానీ మాస్టర్ గతం లో ‘ఢీ’ షో కి జడ్జీగా వ్యవహరించాడు. కానీ ఆయన అరెస్ట్ అయ్యాక ‘ఢీ ‘ షో లోకి ఎంట్రీ ఇవ్వలేదు. కానీ ఇప్పుడు చాలా కాలం తర్వాత ఆయన ఈ షో లోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇక అనుపమ పరమేశ్వరన్ విషయానికి వస్తే, ఈమె ప్రస్తుతం సౌత్ లోనే మోస్ట్ డిమాండ్ ఉన్న హీరోయిన్స్ లో ఒకరు. యూత్ లో ఈమెకు ఉన్నటువంటి ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అలాంటి హీరోయిన్ మొట్టమొదటిసారి బుల్లితెర షో కి జడ్జీగా వ్యవహరించడానికి ఒప్పుకుంది.

ఇప్పటి వరకు ఈ షోలో పూర్ణ , ప్రియమణి, హన్సిక, శ్రద్దా దాస్ , రెజీనా కాసాండ్రా వంటి వారికి జడ్జీలుగా వ్యవహరించారు. వీళ్లంతా ఫేడ్ అవుట్ కి దగ్గర్లో ఉన్న హీరోయిన్లు. కానీ అనుపమ పరమేశ్వరన్ ఈ జనరేషన్ లో మంచి ఫార్మ్ మీదున్న హీరోయిన్, అలాంటి హీరోయిన్ ని జడ్జీగా తీసుకొస్తున్నారంటే , రెమ్యూనరేషన్ ఏ రేంజ్ లో ఇచ్చి ఉంటారో అని సోషల్ మీడియాలో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే ఈ సీజన్ లో శేఖర్ మాస్టర్ కూడా ఒక జడ్జీగా వచ్చే అవకాశం ఉందని , అదే విధంగా యాంకర్లు గా సుడిగాలి సుధీర్ లేదా ప్రదీప్ వ్యవహరించే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇక హైపర్ ఆది ఎప్పటి లాగానే ఈ సీజన్ లో కూడా కొనసాగుతాడట.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper