Homeఎంటర్టైన్మెంట్Anupama Parameswaran: రహస్యంగా పెళ్లి చేసుకున్న అనుపమ పరమేశ్వరన్.. సంచలనం రేపుతున్న ఫోటోలు!

Anupama Parameswaran: రహస్యంగా పెళ్లి చేసుకున్న అనుపమ పరమేశ్వరన్.. సంచలనం రేపుతున్న ఫోటోలు!

Anupama Parameswaran: తెలుగు , తమిళం, మలయాళం భాషల్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో హీరోయిన్ గా నటించి , తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్న నటి అనుపమ పరమేశ్వరన్. అందం తో పాటు తన నటనతో కూడా ప్రేక్షకులను మంత్రం ముగ్దులను చేసే కెపాసిటీ అనుపమ పరమేశ్వరన్ సొంతం. అందుకే ఈమెకు యూత్ ఆడియన్స్ లో అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఈమె పేరు ఎత్తితే చాలు , యూత్ […]

Anupama Parameswaran: తెలుగు , తమిళం, మలయాళం భాషల్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో హీరోయిన్ గా నటించి , తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్న నటి అనుపమ పరమేశ్వరన్. అందం తో పాటు తన నటనతో కూడా ప్రేక్షకులను మంత్రం ముగ్దులను చేసే కెపాసిటీ అనుపమ పరమేశ్వరన్ సొంతం. అందుకే ఈమెకు యూత్ ఆడియన్స్ లో అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఈమె పేరు ఎత్తితే చాలు , యూత్ మెలికలు తిరిగిపోతుంటారు. అయితే అనుపమ పరమేశ్వరన్ రీసెంట్ గానే ప్రముఖ తమిళ హీరో ధృవ్ విక్రమ్ తో లవ్ బ్రేకప్ చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ అంశం పై సోషల్ మీడియా లో ఆమె అప్లోడ్ చేసిన కొన్ని పోస్టులు పెద్ద ప్రకంపనలే సృష్టించాయి. అయితే లేటెస్ట్ గా ఈమెకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యాయి.

ఈ ఫొటోల్లో అనుపమ పరమేశ్వరన్ పెళ్లి బట్టల్లో కూర్చొని , పెళ్లి కొడుకు నెట్టి మీద జీలకర్ర బెల్లం పెట్టడం వంటివి చూసి , నెటిజెన్స్ ఈమెకు సైలెంట్ గా వివాహం జరిగిపోయిందని అనుకున్నారు. మీడియా లో కూడా ఈ ఫోటోలను ఆధారంగా తీసుకొని, అనుపమ కి రహస్యంగా పెళ్లి ఐపోయిందంటూ ప్రచారం చేశారు. అయితే అందులో ఎలాంటి నిజం లేదట. రీసెంట్ గానే అనుపమ పరమేశ్వరన్ ఒక యాడ్ వీడియో లో నటించిందట. ఆ యాడ్ కి సంబంధించిన మేకింగ్ ఫొటోలే ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయని , అంతకు మించి వేరే ఏ విషయం లేదని ఆమె పీఆర్ టీం క్లారిటీ ఇవ్వడం తో అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. బ్రేకప్ తర్వాత అనుపమ తన పూర్తి ఫోకస్ ని సినిమాల మీదనే పెట్టింది.

ఇక ఆమె కెరీర్ విషయానికి వస్తే ఇప్పటి వరకు వెండితెర మీద మాత్రమే కనిపించిన అనుపమ పరమేశ్వరన్, మొదటిసారి బుల్లితెర పై కనిపించబోతుంది. త్వరలోనే ప్రారంభం కాబోతున్న ‘ఢీ 21’ డ్యాన్స్ రియాలిటీ షో లో అనుపమ పరమేశ్వరన్ ఒక జడ్జీగా వ్యవహరించబోతుంది. ఆమెతో పాటు జానీ మాస్టర్ కూడా మరో జడ్జిగా వ్యవహరించనున్నాడు. ప్రదీప్ ఈ షో కి హోస్ట్ గా వ్యవరిస్తాడట. ఈ నెల 18 నుండి ఈ సరికొత్త సీజన్ ఈటీవీ లో టెలికాస్ట్ కాబోతుంది. ఈ సీజన్ పై ప్రేక్షకుల్లో అంచనాలు భారీ రేంజ్ లో ఉన్నాయి , మరి ఆ అంచనాలను ఈ షో అందుకుంటుందా లేదా అనేది చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper