Homeఎంటర్టైన్మెంట్Rangamarthanda: కృష్ణవంశీ సినిమాకు చిరంజీవి వాయిస్​ ఓవర్​!

Rangamarthanda: కృష్ణవంశీ సినిమాకు చిరంజీవి వాయిస్​ ఓవర్​!

Rangamarthanda: ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న చిత్రం రంగమార్తాండ. మరాఠీలో ఘన విజయం సాధించిన నటసామ్రాట్​కు రీమేక్​గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఆ సినిమాలో నానా పటేకర్​ చేసిన పాత్రలో తెలుగులో ప్రకాశ్​రాజ్​ కనిపించంనుండటం విశేషం. మరోవైపు సంగీత సామ్రాట్​ ఇళయరాజా స్వరాలు అందిస్తుండటంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పటికే షూటింగ్​ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్​ ప్రొడక్షన్​ వర్క్స్​లో నడుస్తోంది. అయితే, ఈ సినిమా గురించి ఓ అప్​డేట్​ వినిపిస్తోంది. మెగాస్టార్​ […]

Rangamarthanda: ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న చిత్రం రంగమార్తాండ. మరాఠీలో ఘన విజయం సాధించిన నటసామ్రాట్​కు రీమేక్​గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఆ సినిమాలో నానా పటేకర్​ చేసిన పాత్రలో తెలుగులో ప్రకాశ్​రాజ్​ కనిపించంనుండటం విశేషం. మరోవైపు సంగీత సామ్రాట్​ ఇళయరాజా స్వరాలు అందిస్తుండటంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పటికే షూటింగ్​ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్​ ప్రొడక్షన్​ వర్క్స్​లో నడుస్తోంది. అయితే, ఈ సినిమా గురించి ఓ అప్​డేట్​ వినిపిస్తోంది. మెగాస్టార్​ చిరంజీవి ఈ చిత్రానికి వాయిస్​ఓవర్​ అందించనున్నారు. ఈ విషయాన్ని కృష్ణవంశీ స్వయంగా సోషల్​మీడియా ద్వారా ప్రకటించారు. దీనికి సంబంధించిన ఓ ఫొటోను కూడా పోస్ట్​ చేశారు.

రమ్యకృష్ణ, బ్రహ్మానందం, అనసూయ, రాహుల్ సిప్లిగంజ్, శివానీ రాజశేఖర్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. డిసెంబరులో ఈ చిత్రం లాంచనాలు పూర్తి చేసుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముందని సిని వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుతం మెగాస్టార్​ చిరంజీవి నటించిన ఆచార్య చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. మరోవైపు, గాడ్​ఫాదర్​ సినిమా సెట్స్​పై ముస్తాబవుతోంది. వీటితో పాటు దర్శకులు మెహర్‌ రమేశ్, బాబీ లతోనూ చిరు సినిమాలు చేయాల్సి ఉంది.అయితే వీటిలో ముందుగా బాబీ చిత్రమే ప్రారంభం కానున్నట్లు తెలిసింది. దీన్ని చిరు, దీపావళి సందర్భంగా నవంబరు 6న మొదలుపెట్టనున్నట్లు సమాచారం.

ఇందుకోసం ఇప్పటికే సన్నాహాలు మొదలైనట్లు తెలుస్తోంది. శక్తిమంతమైన మాస్‌ మసాలా కథాంశంతో ఈ సినిమా రూపొందనున్నట్లు తెలిసింది. ఆ మధ్య చిరు పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ప్రీలుక్‌తో ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఈ చిత్రం కోసం ‘వాల్తేరు వాసు’తో పాటు పలు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలందిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది.

Also Read: Naga Shourya: నేనే కాదు.. చిరంజీవి కూడా.. నాగశౌర్య సంచలన వ్యాఖ్యలు

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper