Homeటాప్ స్టోరీస్Tesla self driving cyber cab: స్టీరింగ్ లేదు.. డ్రైవర్ అవసరం లేదు..

Tesla self driving cyber cab: స్టీరింగ్ లేదు.. డ్రైవర్ అవసరం లేదు..

Tesla self driving cyber cab:విద్యుత్ వాహనాల తయారీలో టెస్లా కంపెనీకి తిరుగులేదు. ఈ కంపెనీ ప్రీమియం సెగ్మెంట్లో అద్భుతమైన మోడల్స్ తీసుకొచ్చింది. తీసుకొస్తూనే ఉంది. తాజాగా టెస్లా సైబర్ క్యాబ్ (Tesla cyber cab) ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఈ క్యాబ్ డ్రైవర్ లేకుండానే దూసుకుపోతుంది. ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరవేర్చుతుంది. ఈ కారులో ఎటువంటి స్టీరింగ్ వీల్ ఉండదు. బ్రేకులు ఉండవు. యాక్సెలరేటర్ ఉండదు. ఫెడల్స్ వంటివి కనిపించవు. సైట్ మిర్రర్లు కూడా ఉండవు. […]

Tesla self driving cyber cab:విద్యుత్ వాహనాల తయారీలో టెస్లా కంపెనీకి తిరుగులేదు. ఈ కంపెనీ ప్రీమియం సెగ్మెంట్లో అద్భుతమైన మోడల్స్ తీసుకొచ్చింది. తీసుకొస్తూనే ఉంది. తాజాగా టెస్లా సైబర్ క్యాబ్ (Tesla cyber cab) ను మార్కెట్లో ప్రవేశపెట్టింది.

ఈ క్యాబ్ డ్రైవర్ లేకుండానే దూసుకుపోతుంది. ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరవేర్చుతుంది. ఈ కారులో ఎటువంటి స్టీరింగ్ వీల్ ఉండదు. బ్రేకులు ఉండవు. యాక్సెలరేటర్ ఉండదు. ఫెడల్స్ వంటివి కనిపించవు. సైట్ మిర్రర్లు కూడా ఉండవు. కార్ మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్.. అత్యంత ఆధునికమైన ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ (full self driving) ఆధారంగా ముందుకు సాగుతూ ఉంటుంది.

ఇందులో సీటింగ్ సామర్థ్యం కేవలం ఇద్దరు ప్రయాణికులకు మాత్రమే అవకాశం ఉంటుంది. కారు లోపలి భాగం విశాలంగా ఉంటుంది. 22 ఇంచుల భారీ స్క్రీన్ ఇందులో ఏర్పాటు చేశారు. అందువల్ల అత్యంత సౌకర్యవంతంగా ఉంటుంది.

ఈ కార్ తలుపులు ప్రయాణికులు రాగానే ఆటోమేటిక్ గా తెరుచుకుంటాయి. ప్రయాణికులు లోపలికి వెళ్ళగానే మూసుకుంటాయి.. టెస్లా రోబో టాక్సీ యాప్ ద్వారా కూడా డోర్స్.. బ్యాక్ ట్రంక్ ను నియంత్రించవచ్చు..

టెస్లా తన పైలెట్ ప్రాజెక్టు లో భాగంగా ఈ మోడల్ తయారుచేసింది. ఆ తర్వాత అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఉన్న ఆస్టిన్ నగరంలో సైబర్ క్యాబ్ సేవలను అధికారికంగా అందుబాటులో తీసుకొచ్చింది. టెస్లా రోబో టాక్సీ యాప్ డౌన్లోడ్ చేసుకుని.. వెళ్లాల్సిన లొకేషన్ ఎంటర్ చేయాలి. ప్రస్తుతం ఇది ఆస్టిన్ నగరంలోని కొన్ని ప్రాంతాలకు మాత్రమే అందుబాటులో ఉంది. స్క్రీన్ పై కనిపించే ధర.. వెయిటింగ్ పిరియడ్ ను చూసుకొని రైడ్ ను ఓకే చేసుకోవాలి.. సైబర్ క్యాబ్ లోకి వెళ్ళగానే ఈ ఆపలేదా కారుపై ఉంటే బటన్ నొక్కి తలుపులను తెరవవచ్చు. లోపల కూర్చుని సీట్ బెల్ట్ పెట్టుకున్న తర్వాత..యాప్ లో స్టార్ట్ రైట్ పై టాప్ చేయాలి. ఆ తర్వాత జర్నీ మొదలవుతుంది.

ప్రస్తుతం ఆస్టిన్ నగరంలో ఈ సేవలు మొదలయ్యాయి. ఉబెర్ వంటి సంప్రదాయ సంస్థల కంటే సుమారు 54 శాతం తక్కువ ధరకు టెస్లా ప్రయాణ సదుపాయాన్ని అందిస్తోంది. 15 నిమిషాల ప్రయాణానికి ఉబెర్ 21 డాలర్లు చార్జ్ చేస్తుంటే.. టెస్లా సైబర్ క్యాబ్లో మాత్రం కేవలం 9.65 డాలర్లు మాత్రమే వసూలు చేస్తున్నారు. వచ్చే రోజుల్లో ప్రయాణ ఖర్చును కిలోమీటర్ కు 0.30 డాలర్ కంటే తగ్గించాలని టెస్లా లక్ష్యంగా పెట్టుకుంది. ఒకవేళ ఈ కారు కొనుగోలు చేయాలనుకుంటే దీనిని 25 వేల నుంచి 30 వేల డాలర్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper