Bigg Boss 10 Telugu: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లోకి రోహిత్ ఏ ముహూర్తం లో అడుగుపెట్టాడో తెలియదు కానీ , అడుగడుగునా ఆయన్ని టార్గెట్ చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది బిగ్ బాస్ టీం. మెంటల్ గా ఎంతో స్ట్రాంగ్ గా ఉండే రోహిత్ , వీకెండ్ ఎపిసోడ్ లో అన్యాయం గా నాగార్జున చేత టార్గెట్ కి గురై మానసికంగా కృంగిపోయాడు. ఎంతటి క్లిష్టమైన పరిస్థితి ఎదురైనా ధైర్యాన్ని కోల్పోకుండా నిలబడే రోహిత్, మొట్టమొదటిసారి వెక్కి వెక్కి ఏడ్చాడు. ఆ తర్వాత కూడా మనోధైర్యాన్ని కూడగట్టుకొని , గేమ్ ఆడేందుకు సిద్ధం అవ్వగా, మరోసారి ఆయనకు బిగ్ బాస్ టీం వెన్నుపోటు పొడిచింది. ప్రతీసారి రోహిత్ కే ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కావడం లేదంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాదు , ఆడియన్స్ ని కూడా చులకన గా చూస్తున్నారు బిగ్ బాస్ టీం.
ఈ వారం మొత్తం ‘పవర్ ఆఫ్ పీపుల్’ అనే కాన్సెప్ట్ మీద బిగ్ బాస్ హౌస్ నడుస్తుందని , కెప్టెన్సీ కంటెండర్స్ ని ప్రేక్షకుల ఓటింగ్ ద్వారా ఎంచుకోబోతున్నామని, బిగ్ బాస్ హిస్టరీ లో ఇప్పటి వరకు ఎప్పుడూ ఇలా జరగలేదని చెప్పుకొచ్చారు. ఆడియన్స్ ఓటింగ్ తో రోహిత్ , త్రిగున్ , ముకేశ్ , షాలిని, ఝాన్సీ, అమన్ , దేబ్జాని, ఆటో రామ్ ప్రసాద్ వంటి వారు ఎంపిక అయ్యినట్టు బిగ్ బాస్ ప్రకటిస్తాడు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది , వీళ్ళ మధ్యనే కెప్టెన్సీ టాస్క్ ని నిర్వహించొచ్చు కదా?, కానీ అలా చెయ్యలేదు , మళ్లీ వీళ్ళలో ఎవరు కెప్టెన్సీ టాస్క్ ఆడాలి అనే దానిపై హౌస్ మేట్స్ ఓట్లను కూడా తీసుకునే మెలిక పెట్టాడు బిగ్ బాస్. హౌస్ మేట్స్ ఓట్లు తీసుకుంటే , కచ్చితంగా రోహిత్ ఈ టాస్క్ నుండి తప్పుకుంటాడు. ఎందుకంటే వాళ్లంతా రోహిత్ కి యాంటీ గా ఉన్నారు కాబట్టి.
ఆడియన్స్ వైపు నుండి అత్యధిక ఓట్లు దక్కించుకున్న కంటెస్టెంట్ రోహిత్ . కానీ అతన్ని మాత్రం కెప్టెన్సీ టాస్క్ నుండి తప్పించేందుకే హౌస్ లో ఈ ప్రక్రియ ని ప్రవేశ పెట్టాడు బిగ్ బాస్. ఇంతటి అన్యాయాన్ని బిగ్ బాస్ హిస్టరీ లో ఇప్పటి వరకు చూడలేదు అని చెప్పొచ్చు. మీ ఇష్టమైన వాళ్ళను కంటెండర్స్ ని చేసుకోక, అనవసరం ఎందుకు ఆడియన్స్ ఓటింగ్ తీసుకోవడం?, ప్రతీసారీ వాళ్ళని ఎర్రోళ్లను చేయడం ఎందుకు? అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఒకవేళ రోహిత్ ని నిజంగా కెప్టెన్సీ టాస్క్ నుండి తొలగిస్తే మాత్రం , ఆడియన్స్ వైపు నుండి కోపం మామూలు రేంజ్ లో రాదనే చెప్పాలి. అంతే కాకుండా రోహిత్ గ్రాఫ్ మరింత పైకి వెళ్లే అవకాశం ఉంది.
బిగ్ బాస్ టీం రోహిత్ ని తొక్కేందుకు చాలా గట్టి ప్రయత్నాలే చేస్తూ వస్తోంది. కానీ గోడకు కొట్టిన బంతి లాగా, రోహిత్ ఆడియన్స్ దృష్టిలో ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు. ఇలాంటి సమయం లో రోహిత్ వెంట షాలిని , శ్రేష్టి వంటి స్నేహితులు లేకపోతే, ఆయన పరిస్థితి ఎవ్వరూ ఊహించనంత దారుణంగా ఉండేది. వీళ్లిద్దరు రోహిత్ ఎమోషనల్ గా బాగా కృంగిపోయినప్పుడు , ఆయన వద్దనే ఉంటున్నారు , ధైర్యం చెప్తున్నారు. వీళ్ళ స్నేహాన్ని చూస్తే , ప్రతీ మనిషి జీవితం లో ఇలాంటి స్నేహితులు ఉంటే చాలా బాగుంటుంది అని అనిపిస్తోంది. మరోవైపు రోహిత్ , షాలిని మధ్య ఉన్న ఎమోషనల్ బాండ్ కి ఆటో రామ్ ప్రసాద్ , దేబ్జాని వంటి వారు ప్రేమ అనే పేరు పెట్టేసారు. చూసేవాళ్లకు కూడా అది నిజమే అని అనిపిస్తోంది. ఒకవేళ అదే నిజమైతే ఇద్దరి గేమ్ పై తీవ్రమైన ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది.
ఓటింగ్ లో రోహిత్ అందరికంటే అత్యధిక మార్జిన్ ఆధిక్యం తో ముందుకు దూసుకుపోతుండగా , షాలిని కూడా మంచి ఓటింగ్ తో మూడవ స్థానం లో కొనసాగుతుంది. రాబోయే రోజుల్లో ఈమె గ్రాఫ్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఇద్దరి గేమ్ ప్రస్తుతం పీక్ రేంజ్ లో ఉంది , ఇలాంటి సమయం లో లవ్ ట్రాక్ పెట్ట్టుకుంటే చాలా నష్టపోతారని అంటున్నారు విశ్లేషకులు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏమి జరగబోతుంది అనేది. ఇదంతా పక్కన పెడితే , రోహిత్ కి జరుగుతున్నా అన్యాయం గురించి మీ అభిప్రాయం ఏంటి?, ఒకవేళ రోహిత్ , త్రిగున్, ముకేశ్ , ఆటో రామ్ ప్రసాద్ మధ్య కెప్టెన్సీ టాస్క్ జరిగితే, ఎవరు గెలవాలని మీరంతా కోరుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి.