Homeఎంటర్టైన్మెంట్Rakul Preet Singh: నాకు ప్రాపర్టీని గిఫ్ట్ గా ఇవ్వలేదు.. ఎట్టకేలకు ఓపెన్ అయిన రకుల్...

Rakul Preet Singh: నాకు ప్రాపర్టీని గిఫ్ట్ గా ఇవ్వలేదు.. ఎట్టకేలకు ఓపెన్ అయిన రకుల్ ప్రీత్ సింగ్

Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్.. ఒకప్పుడు టాలీవుడ్ లో సంచలనం నటిగా పేరు తెచ్చుకున్నారు.. మహేష్ బాబు.. జూనియర్ ఎన్టీఆర్.. రామ్ చరణ్.. అల్లు అర్జున్ వంటి వారితో ఆమె స్క్రీన్ పంచుకున్నారు. అనేక విజయవంతమైన సినిమాలలో ఆమె నటించారు. అయితే ఇప్పుడు ఆమె తెలుగు చిత్ర పరిశ్రమకు దూరంగా ఉంటున్నారు. హిందీలో మాత్రం నటిస్తున్నారు. ఇటీవల కాలంలో ఆమె వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. రకుల్ కు నిర్మాణ సంస్థ ఉంది. దానిద్వారా చిత్ర […]

Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్.. ఒకప్పుడు టాలీవుడ్ లో సంచలనం నటిగా పేరు తెచ్చుకున్నారు.. మహేష్ బాబు.. జూనియర్ ఎన్టీఆర్.. రామ్ చరణ్.. అల్లు అర్జున్ వంటి వారితో ఆమె స్క్రీన్ పంచుకున్నారు. అనేక విజయవంతమైన సినిమాలలో ఆమె నటించారు. అయితే ఇప్పుడు ఆమె తెలుగు చిత్ర పరిశ్రమకు దూరంగా ఉంటున్నారు. హిందీలో మాత్రం నటిస్తున్నారు. ఇటీవల కాలంలో ఆమె వార్తల్లో వ్యక్తిగా నిలిచారు.

రకుల్ కు నిర్మాణ సంస్థ ఉంది. దానిద్వారా చిత్ర నిర్మాణంలో ఆమె కొనసాగుతున్నారు. రకుల్ బంధువులు కూడా సినీరంగంలో ఉన్నారు. ఇటీవల రకుల్ కార్యాలయం.. ఇంట్లో ఐటీ దాడులు జరిగినట్టు వార్తలు వచ్చాయి. కీలక పత్రాలను.. దస్త్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే అక్రమ చెల్లింపుల వ్యవహారంలోనే ఈ దాడులు జరిగినట్టు మీడియాలో వార్తలు వచ్చాయి. దాడులు జరిగిన తర్వాత రకుల్ స్పందించలేదు. ఇప్పుడు తొలిసారిగా ఆమె నోరు విప్పారు. అనేక ప్రశ్నలు ఆమెను చుట్టుముడుతున్న నేపథ్యంలో సమాధానాలు ఇచ్చేశారు.

ఐటీ రైడ్స్ విషయంలో తన పేరును ప్రస్తావించడం పట్ల రకుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సోదాలు తనకు సంబంధించినవి కావని స్పష్టం చేశారు. కష్టపడి పైకి వచ్చానని.. 20 ఏళ్ల వయసు నుంచి తాను నటిస్తున్నానని.. అప్పటినుంచి తాను పన్ను చెల్లిస్తున్నానని.. వ్యక్తిగతంగా లేదా నిర్మాణ సంస్థ ద్వారా తాను ఇలాంటి అక్రమ విదేశీ చెల్లింపుల్లో ఇన్వాల్వ్ కాలేదని.. ఎటువంటి బినామీ ఆస్తులు కూడా లేవని రకుల్ క్లారిటీ ఇచ్చారు. తనకు ఎవరూ ప్రాపర్టీలు బహుమతిగా ఇవ్వలేదని.. అలాంటివి తీసుకునే ఉద్దేశం కూడా తనకు లేదని రకుల్ వ్యాఖ్యానించారు. మొత్తానికి తనమీద వస్తున్న విమర్శలకు రకుల్ మొహమాటం లేకుండా సమాధానం చెప్పారు. మీడియాలో అడ్డగోలుగా వస్తున్న కథనాలు తన ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఉండడంతో మొత్తానికి రకుల్ నిశ్శబ్దాన్ని వీడి.. అనేక ప్రశ్నలకు క్లారిటీ ఇచ్చారు.

ఇప్పటివరకు రకుల్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అయ్యారు. ఆమె మీద దారుణంగా విమర్శలు వచ్చాయి. కొంతమంది ఆమెకు వేరే వేరే సంబంధాలు కూడా అంటగట్టారు. ఎన్నడూ కూడా ఆమె ఈ విషయాల మీద నోరు విప్పలేదు. కానీ తొలిసారిగా తన మీద వస్తున్న విమర్శలకు.. ఆరోపణలకు గట్టిగా సమాధానం చెప్పారు. ద్వారా తాను ఏంటో మరొకసారి నిరూపించుకున్నారు. మరి ఇప్పుడు రకుల్ మీద వస్తున్న ఆరోపణలు ఆగిపోతాయా.. విమర్శలు చేస్తున్నవారు సైలెంట్ అయిపోతారా.. వారు అలానే వ్యవహరిస్తే రకుల్ ఎటువంటి చర్యలు తీసుకుంటారు.. ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper