HomeNewsPawan Kalyan: గొడవలు.. గొడ్డలి పోట్లు.. మా గొంతులు కట్టలు తెగుతాయి.. పవన్ ఓజీ స్పీచ్...

Pawan Kalyan: గొడవలు.. గొడ్డలి పోట్లు.. మా గొంతులు కట్టలు తెగుతాయి.. పవన్ ఓజీ స్పీచ్ గూస్ బంప్స్ అంతే

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సమయానికి తగ్గట్టుగా మాట్లాడుతుంటారు. ఎక్కడ తగ్గాలో ఆయనకు తెలుసు. ఎక్కడ నెగ్గాలో కూడా ఆయనకు తెలుసు. అందువల్లే విర్రవీగిన వైసీపీని 2024 ఎన్నికల్లో నేల నాకించారు. నిన్ను అడుగుదాకా తొక్కేస్తానని జగన్మోహన్ రెడ్డికి హెచ్చరికలు పంపించారు. అదే స్థాయిలో ఆయన పని చేశారు. కూటమి కట్టడంలో కీలకపాత్ర పోషించారు. వైసీపీని కుకటి వేళ్ల దగ్గర నుంచి పెకిలించారు. ఏపీ డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ విలక్షణమైన పాత్ర పోషిస్తున్నారు. కూటమిలో ఉన్నప్పటికీ.. […]

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సమయానికి తగ్గట్టుగా మాట్లాడుతుంటారు. ఎక్కడ తగ్గాలో ఆయనకు తెలుసు. ఎక్కడ నెగ్గాలో కూడా ఆయనకు తెలుసు. అందువల్లే విర్రవీగిన వైసీపీని 2024 ఎన్నికల్లో నేల నాకించారు. నిన్ను అడుగుదాకా తొక్కేస్తానని జగన్మోహన్ రెడ్డికి హెచ్చరికలు పంపించారు. అదే స్థాయిలో ఆయన పని చేశారు. కూటమి కట్టడంలో కీలకపాత్ర పోషించారు. వైసీపీని కుకటి వేళ్ల దగ్గర నుంచి పెకిలించారు.

ఏపీ డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ విలక్షణమైన పాత్ర పోషిస్తున్నారు. కూటమిలో ఉన్నప్పటికీ.. ప్రజావ్యతిరేక చర్యలకు పాల్పడే ఈ ఒక్కరిని కూడా వదిలిపెట్టడం లేదు. చివరికి టిడిపికి దగ్గరగా ఉన్న వ్యక్తులను కూడా ఆయన సహించడం లేదు. జనసేనలో లైన్ దాటిన వ్యక్తుల తోకలు కట్ చేస్తున్నారు. మొత్తంగా చూస్తే పవన్ కళ్యాణ్ నిజాయితీ.. నిర్మొహమాటంగా పనిచేసుకుంటూ వెళ్తున్నారు. తద్వారా రాజకీయాలలో ఉన్నత విలువలను నెలకొల్పుతున్నారు.

ప్రొద్దుటూరులో జరిగిన సభలో పవన్ కళ్యాణ్ మరొకసారి తన నైజాన్ని బయటపెట్టుకున్నారు. ఇటీవల కాలంలో వైసిపి రప్పా రప్పా అంటూ నినాదాలు చేస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తొలిసారి నోరు విప్పారు. వాస్తవానికి ఆయన ఎన్నికల సమయంలోనే ఆవేశంగా మాట్లాడారు. ఆ తర్వాత ప్రతి సందర్భంలోనూ అభివృద్ధి గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. పర్యావరణ వనరులను సంరక్షించుకోవాలని వివరిస్తున్నారు. గొడవలు గొడ్డలి పోట్లు కాకుండా అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్లాలని సూచిస్తున్నారు. ప్రత్యర్థి గురించి మాట్లాడాలని కార్యకర్తలు ప్రతి సందర్భంలో కోరినప్పుడు ఆయన స్పందించడం లేదు. కానీ ప్రొద్దుటూరు సభలో మాత్రం చాలా విలక్షణగా మాట్లాడారు.

ఎన్నికల సమయంలో తన స్పందన వేరే విధంగా ఉంటుందని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ప్రత్యర్థులు హద్దులు దాటిపోతే మా గొంతులు కూడా కట్టలు తెగుతాయని వివరించారు. ఇది శాంతి సమయమని.. ప్రజలకు అభివృద్ధిని.. సంక్షేమాన్ని అందించాల్సిన తరుణమని.. అందువల్లే రాయలసీమ పౌరుషానికి తగ్గట్టుగా మాట్లాడటం లేదని ప్రొద్దుటూరు సభలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.. గొడవలు.. గొడ్డలి పోట్లు అంటే.. అప్పుడు మా గొంతులు కట్టలు తెగుతాయని పవన్ కళ్యాణ్ ఆవేశంగా వ్యాఖ్యానించారు. మొత్తంగా పవన్ కళ్యాణ్ లో ఎటువంటి ఆవేశాన్ని చూడాలి అనుకుంటున్నారో.. దానిని లైవ్ లో చూడటంతో అభిమానులకు హద్దులు లేకుండా పోయాయి.. దీనికి తోడు స్థానిక ఎన్నికల్లో జనసేన కార్యకర్తలను విపరీతంగా ఉత్సాహం ఉరకలెత్తుతోంది. పవన్ కళ్యాణ్ ప్రత్యర్థి పార్టీ మీద తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేయడంతో.. స్థానిక ఎన్నికల్లో ఇక తమకు తిరుగులేదని జనసేన నాయకులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే అనేకచోట్ల పోటీ చేసేందుకు జనసేన నాయకులు ముందుకు వచ్చారు. కూటమిలో ఉన్న నేపథ్యంలో జనసేన ఆచితూచి అడుగులు వేస్తోంది. 2024 ఎన్నికల్లో ఏవిధంగానైతే 100% స్ట్రైక్ రేట్ కొనసాగించారో.. స్థానిక ఎన్నికల్లో కూడా అదే శాతాన్ని కొనసాగించాలని జనసేన కృత నిశ్చయంతో ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper