Bigg Boss 10 Telugu: బిగ్ బాస్ హౌస్ లో జరిగే లవ్ ట్రాక్స్ కి ఆడియన్స్ కనెక్ట్ అవ్వడం ఎప్పుడో మానేశారు. ఎందుకంటే ఇదొక రియాలిటీ షో , అన్నీ రియల్ గా ఉండాలి , రియల్ ఎమోషన్స్ ని బయటపెట్టాలి. హౌస్ లో ఉన్నన్ని రోజులు బాగా ఉంటారు, కానీ బయటకు వెళ్లిన తర్వాత ఎవరి దారి వారిదే అన్నట్టుగా వ్యవహరిస్తుంటారు. ఉదాహరణకు సిరి , షణ్ముఖ్ లను తీసుకోవచ్చు. హౌస్ లో ఉన్నప్పుడు వీళ్లిద్దరి మధ్య జరిగిన రొమాన్స్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సగం బిగ్ బాస్ లో లవ్ ట్రాక్స్ పై ఆడియన్స్ కి విసుగుపెట్టేలా చేసింది వీళ్లిద్దరే అని అందరూ అంటుంటారు. హౌస్ లో అంత క్లోజ్ గా ఉన్నటువంటి వీళ్ళు , బయటకు వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా కలవలేదు.
ఇక గత సీజన్ లో బాగా వైరల్ అయినటువంటి రీతూ చౌదరి , డిమోన్ పవన్ జంట కూడా ఇంతే. హౌస్ లో ఉన్నన్ని రోజులు వీళ్లిద్దరు లవర్స్ లాగానే ఉండేవారు. భార్య భర్తలు లాగా గొడవలు పడుతూ ఉండేవారు. వీళ్ళ మధ్య ఉన్నది నిజమైన బాండింగ్ అని అంతా అనుకున్నారు. బయటకు వచ్చిన తర్వాత ఒక 9 నెలలు బాగానే ఉన్నారు కానీ , ఈమధ్యనే గొడవలు వచ్చి విడిపోయారు. ఇలా ఆడియన్స్ బాగా నమ్మిన లవ్ ట్రాక్స్ అన్ని కావాలని చేసినవే, నిజమైనవి కాదు అని తెలిసిన తర్వాత ఎవరైనా లవ్ ట్రాక్ నడిపితే చిర్రెత్తిపోయే పరిస్థితి వచ్చేసారు ఆడియన్స్.
ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో షాలిని, రోహిత్ మధ్య లవ్ ట్రాక్ ని చిరాకు పడుతున్నారు ఆడియన్స్ . నిన్నటి ఎపిసోడ్ లో షాలిని రోహిత్ కి ప్రపోజ్ కూడా చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. కొంతమంది వీళ్ళ లవ్ ని సపోర్ట్ చేస్తుంటే , ఎక్కువ శాతం మంది మాత్రం చిరాకు పడుతున్నారు. అయితే షాలిని , రోహిత్ మ్యూచువల్ ఫ్యాన్స్ మాత్రం వీళ్ళ లవ్ ని సపోర్ట్ చేయడమే కాదు , AI ని ఉపయోగించి బిగ్ బాస్ హౌస్ లో వీళ్లిద్దరికీ పెళ్లి జరిగినట్టు ఒక వీడియో ని క్రియేట్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా ల బాగా వైరల్ అయ్యింది. వీళ్లిద్దరి పెళ్ళికి పూజారి మరెవరో కాదు , త్రిగున్. చూసేందుకు చాలా ఫన్నీ గా అనిపిస్తున్న ఈ వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.
View this post on Instagram