Homeబిజినెస్50MP సెల్ఫీ కెమెరా, 8,000mAh బ్యాటరీ.. మొబైన్ ఫోన్ మార్కెట్లో ఈ ఒప్పో ఫోన్ సంచలనం

50MP సెల్ఫీ కెమెరా, 8,000mAh బ్యాటరీ.. మొబైన్ ఫోన్ మార్కెట్లో ఈ ఒప్పో ఫోన్ సంచలనం

Oppo F35 Pro 5G : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Oppo భారత్‌లో తన F సిరీస్‌కు చెందిన కొత్త స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది. భారత్‌లో Oppo F సిరీస్ ప్రారంభమై 10 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా Oppo F35 Pro 5G, Oppo F35 5G మోడళ్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ రెండు ఫోన్లలోనూ 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అలాగే 8,000mAh భారీ బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్ […]

Oppo F35 Pro 5G : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Oppo భారత్‌లో తన F సిరీస్‌కు చెందిన కొత్త స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది. భారత్‌లో Oppo F సిరీస్ ప్రారంభమై 10 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా Oppo F35 Pro 5G, Oppo F35 5G మోడళ్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ రెండు ఫోన్లలోనూ 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అలాగే 8,000mAh భారీ బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ధరలు ఇవే..

భారత్‌లో Oppo F35 5G ధర 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్‌కు రూ.38,999 నుంచి ప్రారంభమవుతుంది. 8GB RAM + 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ.42,999గా ఉంది. ఇక Oppo F35 Pro 5G ధర 6GB + 128GB వేరియంట్‌కు రూ.45,999 నుంచి ప్రారంభమవుతుంది. 8GB + 128GB మోడల్ రూ.49,999 కాగా, 8GB + 256GB టాప్ వేరియంట్ ధర రూ.54,999గా ఉంది.

ఈ ఫోన్లపై 10 శాతం ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్‌తో పాటు 10 శాతం ఎక్స్‌చేంజ్ బోనస్‌ను కంపెనీ అందిస్తోంది. ఈ నెలలోనే Flipkart, Amazon, Oppo ఆన్‌లైన్ స్టోర్‌తో పాటు ఇతర రిటైల్ ఛానళ్ల ద్వారా విక్రయాలు ప్రారంభం కానున్నాయి.

డిస్‌ప్లే, ప్రాసెసర్

Oppo F35 Pro 5Gలో 6.78 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే ఉంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్, 1,800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. మరోవైపు Oppo F35 5Gలో 6.57 అంగుళాల Full HD+ AMOLED స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్, 1,400 నిట్స్ వరకు బ్రైట్‌నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్ విషయానికి వస్తే Pro మోడల్‌లో MediaTek Dimensity 7360 Max చిప్‌సెట్‌ను, స్టాండర్డ్ మోడల్‌లో MediaTek Dimensity 6360 Max చిప్‌సెట్‌ను అందించారు. Proలో UFS 3.1 స్టోరేజ్ ఉండగా, F35 5Gలో UFS 2.2 స్టోరేజ్ ఉంది.

కెమెరాలపై ప్రత్యేక ఫోకస్

Oppo F35 సిరీస్‌లో కెమెరాలకు కంపెనీ ప్రాధాన్యత ఇచ్చింది. రెండు ఫోన్లలోనూ 50MP ప్రధాన రియర్ కెమెరా ఉంది. F35 Pro 5Gలో 8MP అల్ట్రావైడ్ కెమెరాతో పాటు డ్యూయల్-యాక్సిస్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) లభిస్తుంది. F35 5Gలో 2MP మోనోక్రోమ్ కెమెరాను అందించారు.

సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం రెండు మోడళ్లలోనూ 50MP ఫ్రంట్ కెమెరా ఉంది. Pro మోడల్ 4K/30fps వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ చేస్తుండగా, స్టాండర్డ్ మోడల్ 2.5K వరకు వీడియో రికార్డ్ చేయగలదు.

8,000mAh బ్యాటరీ

రెండు ఫోన్లలోనూ 8,000mAh భారీ బ్యాటరీ ఉండటం మరో ప్రధాన ప్రత్యేకత. 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. అదనంగా 5G, 4G LTE, Wi-Fi 6, Bluetooth 5.4, USB Type-C వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.

భద్రత కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ సదుపాయాలను అందించారు. అంతేకాకుండా రెండు ఫోన్లకు IP66, IP68, IP69, IP69K రేటింగ్స్ ఉండటంతో దుమ్ము, నీటి నుంచి మెరుగైన రక్షణ లభిస్తుంది. Oppo F35 Pro 5G Sunset Orange, Twilight Brown, Wave Blue రంగుల్లో.. Oppo F35 5G Mist Pink, Titanium Grey, Wave Blue కలర్ ఆప్షన్లలో లభించనున్నాయి.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Oktelugu Epaper