Homeఎంటర్టైన్మెంట్Heroine ileana: ఇలియానా అసలు ఏమైంది? ఇప్పుడు ఆమె పరిస్థితి ఎలా ఉందో చూస్తే కన్నీళ్లు...

Heroine ileana: ఇలియానా అసలు ఏమైంది? ఇప్పుడు ఆమె పరిస్థితి ఎలా ఉందో చూస్తే కన్నీళ్లు ఆగవు!

Heroine ileana: ఒకప్పుడు సౌత్ ఇండియా లో ఇలియానా క్రేజ్ ఎలా ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. యూత్ ఆడియన్స్ హీరోయిన్ అంటే ఇలియానా లాగా ఉండాలి అని అనుకునేవాళ్లు. అంతే కాదు ఆరోజుల్లో కోటి రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ అందుకున్న మొట్టమొదటి హీరోయిన్ గా ఇలియానా సరికొత్త చరిత్ర సృష్టించింది. అలాంటి ఇలియానా , రెమ్యూనరేషన్స్ కోసం ఆశపడి , తన కెరీర్ ని సర్వ నాశనం చేసుకుందంటే నమ్ముతారా?.. కానీ అదే నిజం. రెమ్యూనరేషన్స్ […]

Heroine ileana: ఒకప్పుడు సౌత్ ఇండియా లో ఇలియానా క్రేజ్ ఎలా ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. యూత్ ఆడియన్స్ హీరోయిన్ అంటే ఇలియానా లాగా ఉండాలి అని అనుకునేవాళ్లు. అంతే కాదు ఆరోజుల్లో కోటి రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ అందుకున్న మొట్టమొదటి హీరోయిన్ గా ఇలియానా సరికొత్త చరిత్ర సృష్టించింది. అలాంటి ఇలియానా , రెమ్యూనరేషన్స్ కోసం ఆశపడి , తన కెరీర్ ని సర్వ నాశనం చేసుకుందంటే నమ్ముతారా?.. కానీ అదే నిజం. రెమ్యూనరేషన్స్ కి ఆశపడి బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి , అక్కడ సరైన అవకాశాలు రాక కెరీర్ ని సర్దేయాల్సి వచ్చింది. ప్రతీ సినిమాకు ఈమె సౌత్ లో కోటి రూపాయిల రెమ్యూనరేషన్ ని డిమాండ్ చేసేది. సినిమా పరిధి బట్టీ రెమ్యూనరేషన్ ఇవ్వగలరు నిర్మాతలు , మీడియం రేంజ్ బడ్జెట్ సినిమాలకు ఆమె అడిగినంత ఇచ్చేవారు కాదు.

అందుకే బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ అడపదడపా పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది కానీ , ఒక్కటి కూడా సక్సెస్ అవ్వలేదు. దీంతో ఆమెకు అవకాశాలు ఇవ్వడం మానేశారు బాలీవుడ్ మేకర్స్. ఒకవేళ బాలీవుడ్ లోకి వెళ్లకుండా , టాలీవుడ్ లో బడ్జెట్ కి తగ్గట్టుగా రెమ్యూనరేషన్స్ ని అందుకుంటూ సినిమాలు చేస్తూ వెళ్లుంటే , ఆమె రేంజ్ ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉండేదని, సమంత , నయనతార, త్రిష వంటి హీరోయిన్స్ ప్రస్తుతం ఏ స్థాయిలో కొనసాగుతున్నారో , ఇలియానా కూడా అదే స్థాయిలో కొనసాగుతూ ఉండేదని , బంగారం లాంటి కెరీర్ ని నాశనం చేసుకుందంటూ సోషల్ మీడియా లో ఆమె అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఇలియానా ఎక్కడ ఉంది?, ఇంతకు ముందు సోషల్ మీడియా లో యాక్టీవ్ గా ఉండేది , ఇప్పుడు అది కూడా లేదు , అదృశ్యమైపోయింది అంటూ ఆమె అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఇలియానా 2023 వ సంవత్సరం లో , మైఖేల్ ధోలాన్ అనే అతన్ని ప్రేమిమ్చి పెళ్లాడింది. వీళ్లిద్దరికీ 2025 వ సంవత్సరం లో ఒక కొడుకు కూడా పుట్టాడు. అతని పేరు కీను రెఫ్ ధోలాన్. ఇన్ స్టాగ్రామ్ లో తన క్యూట్ ఫామిలీ కి సంబంధించిన ఫోటోలను , వీడియోలను ఇలియానా అప్లోడ్ చేసింది. ప్రస్తుతం ఈమె విదేశాల్లో స్థిరపడింది. సినిమాలకు దూరంగా ఉంటూ , తన చిన్న కుటుంబం తో సంతోషంగా జీవిస్తోంది. కానీ ఇలియానా లాంటి అందమైన టాలెంటెడ్ హీరోయిన్ , ఇలా ఇంటికే పరిమితం అవ్వడం ఆమె అభిమానులకు నచ్చడం లేదు. ఎలా ఉండాల్సిన హీరోయిన్, ఇలా అయిపోయిందేంటి అని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు ఫ్యాన్స్. రీసెంట్ గానే కొంతమంది దర్శక నిర్మాతలు ఆమెని సంప్రదించి కాల్ షీట్స్ కోరగా , తనకు సినిమాల మీద ఆసక్తి పోయిందని చెప్పిందట ఇలియానా. 2019 వ సంవత్సరం వరకు ఇలియానా చాలా యాక్టీవ్ గా బాలీవుడ్ సినిమాల్లో నటిస్తూ వచ్చింది.

కానీ ఆ తర్వాత అప్పుడప్పుడు మాత్రమే సినిమాలు చేసేది. 2021 వ సంవత్సరం లో ‘బిగ్ బుల్’ అనే చిత్రం లో హీరోయిన్ గా నటించిన ఇలియానా, ఆ తర్వాత 2024 వ సంవత్సరం లో ‘తేరా క్యా హోగా లవ్లీ’, ‘డో ఆర్ డో ప్యార్’ వంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత సినిమాలకు దూరమై , తన కుటుంబం తో కలిసి విదేశాలకు వెళ్ళిపోయింది. అలా మన టాలీవుడ్ లో ‘దేవదాసు’ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తో మొదలైన ఇలియానా కెరీర్, ఒక డిజాస్టర్ ఫ్లాప్ తో ముగిసిపోయింది. మన టాలీవుడ్ లో ఈమె బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ అందరితో కలిసి సినిమాలు చేసింది. ఒక్క రామ్ చరణ్ తో తప్ప. ‘దేవదాసు’ తర్వాత ఈమె సూపర్ స్టార్ మహేష్ బాబు తో చేసిన పోకిరి చిత్రం ఎంతటి సెన్సేషనల్ ఇండస్ట్రీ హిట్ అనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆ తర్వాత ఎన్టీఆర్ తో రాఖీ , శక్తి వంటి సినిమాలు చేసింది. ఈ రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.

ఇక పవన్ కళ్యాణ్ తో ఈమె కలిసి చేసిన ‘జల్సా’ చిత్రం కల్ట్ క్లాసిక్ గా యూత్ ఆడియన్స్ లో ముద్ర వేసుకోవడమే కాకుండా , కమర్షియల్ గా కూడా ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది. ఇక ఆ తర్వాత ప్రభాస్ తో ‘మున్నా’, అల్లు అర్జున్ తో ‘జులాయి’ వంటి చిత్రాలు చేసింది. మున్నా చిత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యింది కానీ , జులాయి చిత్రం మాత్రం అల్లు అర్జున్ కెరీర్ ని మరో లెవెల్ కి తీసుకెళ్లింది. రవితేజ తో కలిసి ఈమె ఖతర్నాక్, కిక్, దేవుడు చేసిన మనుషులు,అమర్ అక్బర్ ఆంటోనీ వంటి సినిమాలు చేసింది. వీటిలో కిక్ చిత్రం ఎంతటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చిందో అందరికీ తెలిసిందే. తెలుగు ఆడియన్స్ కి ఈమె చివరిగా కనిపించిన చిత్రం అమర్ అక్బర్ ఆంటోనీ. ఇదే ఆమె చివరి తెలుగు చిత్రం అవుతుందని ఆమె అభిమానులు కలలో కూడా ఊహించలేదు. మరి అకస్మాత్తుగా ఇలియానా ఇలా సినిమాలకు దూరం అవ్వడం పై మీ అభిప్రాయం ఏంటి?, ఆమె మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్నారా?, మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపం లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper