Homeఎంటర్టైన్మెంట్Aadarsha Kutumbam: ఆదర్శ కుటుంబం మళ్లీ వాయిదా.. నాగ వంశీ మాటలకు సమాధానం కావాల్సిందే..

Aadarsha Kutumbam: ఆదర్శ కుటుంబం మళ్లీ వాయిదా.. నాగ వంశీ మాటలకు సమాధానం కావాల్సిందే..

Aadarsha Kutumbam:వెంకటేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ అంటే ప్రేక్షకుల్లో సహజంగానే భారీగా అంచనాలు ఉంటాయి. అందులోనూ ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47లాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ పై అంచనాలు మరింత ఎక్కువగా పెరిగిపోయాయి . కానీ సినిమా విడుదల నిమిషంలో మాత్రం మొదటి నుంచి గందరగోళమే కనిపిస్తోంది. ముందుగా అక్టోబర్ 2 న విడుదల చేస్తామని ప్రకటించారు. ఆ తర్వాత అక్టోబర్ 9కి మార్చారు. ఇప్పుడు అక్టోబర్ 9 కూడా సాధ్యం కాదని చెప్తున్నారు. దీంతో ఈ సినిమా […]

Aadarsha Kutumbam:వెంకటేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ అంటే ప్రేక్షకుల్లో సహజంగానే భారీగా అంచనాలు ఉంటాయి. అందులోనూ ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47లాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ పై అంచనాలు మరింత ఎక్కువగా పెరిగిపోయాయి . కానీ సినిమా విడుదల నిమిషంలో మాత్రం మొదటి నుంచి గందరగోళమే కనిపిస్తోంది. ముందుగా అక్టోబర్ 2 న విడుదల చేస్తామని ప్రకటించారు. ఆ తర్వాత అక్టోబర్ 9కి మార్చారు. ఇప్పుడు అక్టోబర్ 9 కూడా సాధ్యం కాదని చెప్తున్నారు. దీంతో ఈ సినిమా విడుదల ఉంటుందా.. లేదా అనేది పెద్ద చర్చగా మారింది.

వాస్తవానికి ఈ సినిమా వాయిదా కాదు.. వాయిదా గురించి నిర్మాత నాగవంశీ ఇచ్చిన వరుస క్లారిటీలు ఇప్పుడు చర్చకు దారితీస్తున్నాయి. అక్టోబర్ 1 విడుదలపై ఊహాగానులు పెరిగిన నేపథ్యంలో నిర్మాత నాగ వంశీ సోషల్ మీడియా వేదికగా చాలా స్పష్టంగా స్పందించారు. విడుదల సమయంలో తమపై అనుమానాలు ఉండవచ్చని.. కానీ ఈసారి ఎటువంటి సందేహాలు అవసరం లేదని చెప్పారు. అక్టోబర్ 9న సినిమా విడుదల కావడం ఖాయమని అన్నారు. అంతేకాదు అక్టోబర్ 6న ట్రైలర్ లాంచ్ అక్టోబర్ 7న 2 తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలవుతాయని కూడా చెప్పారు. ప్రీమియర్స్ ఉండవని.. నేరుగా రెగ్యులర్ షోలతోనే ప్రేక్షకుల ముందుకు వస్తామని వెల్లడించారు. అలా ప్రకటన చేసిన కొద్ది రోజులకే మల్లి సినిమా వాయిదా పడుతోంది అనే వార్తలు రావడం ఇప్పుడు అసలు ప్రశ్నలకు దారి తీస్తోంది.

ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం సినిమాలోని కొన్ని పోస్ట్ ప్రొడక్షన్ పనులు.. ముఖ్యంగా రి రికార్డింగ్/ సౌండ్ కు సంబంధించిన పనులు ఇంకా పూర్తికాలేదని ప్రచారం జరుగుతుంది. అయితే ఇవి అధికారికంగా నిర్మాతలు వెల్లడించిన కారణాలు కావు. కొన్ని మీడియా సంస్థలు వచ్చిన కథనాలు మాత్రమే ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నాయి. ఒకవైపు సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.. అనే నమ్మకాన్ని టీం కలిగిస్తోంది. మరోవైపు విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్ది పోస్ట్ ప్రొడక్షన్ పనుల పేరుతో కొత్త సందేహాలు వస్తున్నాయి. ఇదే ఇప్పుడు ప్రేక్షకుల ఒక రకమైన కన్ఫ్యూజన్ కు కారణం.

ఒక సినిమా బాధపడితే నిర్మాతకు చాలా ఇబ్బంది ఎదురవుతుంది. ముఖ్యంగా పెద్ద సినిమాలకు చివరి నిమిషంలో టెక్నికల్ పనుల వల్ల విడుదల తేదీలు మారిపోతూ ఉంటాయి. తెలుగు చిత్ర పరిశ్రమలో ఇది కొత్త కాకపోయినాప్పటికీ.. వరుసగా తేదీలు మారుతూ.. ఆ తర్వాత ఇక మార్పు ఉండదు అని నిర్మాత స్వయంగా క్లారిటీ ఇవ్వటం.. ఆ తర్వాత మళ్లీ వాయిదా వార్తలు రావడం మాత్రం సినిమా టీం కమ్యూనికేషన్ పై ప్రశ్నలు వ్యక్తం అయ్యేలా చేస్తుంది. ఇప్పటికే ఆదర్శ కుటుంబం విడుదల విషయంలో ప్రేక్షకులు పలుమార్లు తేదీలు ఉన్నారు. మొదట సమ్మర్ రిలీజ్ గురించి ప్రచారం జరిగింది. ఆ తర్వాత అక్టోబర్ రెండవ తేదీని ప్రకటించారు. అది అక్టోబర్ 9కి మారింది.. ఇప్పుడు అక్టోబర్ 9 పై కూడా నిర్మాత స్వయంగా క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు అదే తేదీ పై మల్లి ఒక రకమైన సందిగ్ధం ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రేక్షకుల్లో సహజంగానే ఒక ప్రశ్న వస్తుంది. నిజంగా సినిమా ఎప్పుడు విడుదలవుతుంది..

ప్రస్తుతం కొన్ని మీడియా సంస్థల కథనాలలో అక్టోబర్ 30వ తేదీని కొత్త విడుదల తేదిగా పరిశీలిస్తున్నారని చెబుతున్నాయి. అయితే ఈ తేదీపై ఇంతవరకు అధికారిక ప్రకటన రాలేదు. కాబట్టి దానిని ఖరారైన తేదీగా చెప్పడం సబబు కాదు. అయితే అక్టోబర్ 9 నుంచి ఈ సినిమా తప్పుకుంటే నిర్మాతలు మరో తేదీని ప్రకటించే ముందు పూర్తి క్లారిటీతో రావాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే కేవలం రిలీజ్ డేట్ మార్పు కాదు.. సినిమాపై ప్రేక్షకులను నమ్మకాన్ని కూడా నిలబెట్టుకునే అంశం..

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper