Homeటాప్ స్టోరీస్Redmi Note 15 SE 5G: ఫీచర్ల విషయంలో ఈ ఫోన్ చాలా హాట్ గురూ.....

Redmi Note 15 SE 5G: ఫీచర్ల విషయంలో ఈ ఫోన్ చాలా హాట్ గురూ.. ధర ఎంత అంటే..

Redmi Note 15 SE 5G: మన దేశ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో రెడ్ మీ బ్రాండ్ కు తిరుగులేని స్థాయి ఉంది. ఈ నేపథ్యంలో స్మార్ట్ఫోన్ మార్కెట్ కు కీలకమైన శక్తిగా ఉన్న మధ్యతరగతి వాళ్లను లక్ష్యంగా చేసుకొని రెడ్ మీ కొత్త బ్రాండ్ ఫోన్ తీసుకొచ్చింది. తిరుగులేని ఫీచర్లతో ఈ ఫోన్ చాలా హాట్ గురూ అంటూ అనేలా దీనిని రూపొందించింది. ఫీచర్లు ఎలా ఉన్నాయి అంటే ఇందులో 120 Hz carved AMOLED […]

Redmi Note 15 SE 5G: మన దేశ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో రెడ్ మీ బ్రాండ్ కు తిరుగులేని స్థాయి ఉంది. ఈ నేపథ్యంలో స్మార్ట్ఫోన్ మార్కెట్ కు కీలకమైన శక్తిగా ఉన్న మధ్యతరగతి వాళ్లను లక్ష్యంగా చేసుకొని రెడ్ మీ కొత్త బ్రాండ్ ఫోన్ తీసుకొచ్చింది. తిరుగులేని ఫీచర్లతో ఈ ఫోన్ చాలా హాట్ గురూ అంటూ అనేలా దీనిని రూపొందించింది.

ఫీచర్లు ఎలా ఉన్నాయి అంటే

ఇందులో 120 Hz carved AMOLED display, Snapdragon 6 Gen ప్రాసెసర్, 5800 mAh బ్యాటరీ, 45 W ఫాస్ట్ ఛార్జింగ్ వంటివి ఉన్నాయి. ఈ ఫోన్లో crimson reserve అనే వేరియంట్ కు vegon leather ఫినిషింగ్ ఇచ్చారు. దీంతో ప్రీమియం లుక్ ఇందులో అదిరిపోయింది..6 GB RAM , 128 GB స్టోరేజ్ వేరియంట్ ధర ఏకంగా 25,999 గా ఉండడం విశేషం.

డిస్ ప్లే ప్రకారం చూసుకుంటే

Redmi note 15 SE 5G లో 6.77 అంగుళాల FHD + covered AMOLED డిస్ ప్లే ఉంది. ఇది 1080 *2392 పిక్సెల్స్ రిజల్యూషన్ ను కలిగి ఉంటుంది. స్క్రీన్ 120 Hz రీ ఫ్రెష్ రేట్, 240 Hz టచ్ షాంప్లింగ్ రేట్ ను సపోర్ట్ చేస్తూ ఉంటుంది. డిస్ ప్లే పరంగా గరిష్టంగా 3200 nits పీక్ బ్రైట్ నెస్ ను అందిస్తుంది. అలాగే 12 – బిట్ కలర్ డెప్త్, DCI – P3 p వైడ్ కలర్ గామట్ వంటి ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి. 100 గంట ముఖ్యంగా 3840 Hz, Circadian friendly గా ఉంటుంది. ఫికర్ ఫ్రీ సర్టిఫికేషన్ కూడా దీనికి ఉంటుంది .

పనితీరు అదరహో

ఈ మోడల్ ఫోన్ లో Qualcomm Snapdragon 6 Gen 3 చిప్ సెట్ ఇందులో ఉంటుంది. 4 nm ప్రాసెస్ ఆధారంగా ఇది పనిచేస్తుంటుంది. ఇందులో 4 cortex A-78 కోర్లు ప్రత్యేకంగా ఉంటాయి. ఇవి 2.4 GHz వరకు పనిచేస్తుంటాయి. 4 Cortex – A55 కోర్లు 1.8 GHz వరకు పనిచేస్తూ ఉంటాయి. ఇక ఇందులో గ్రాఫిక్స్ కోసం Aderno 710 GPU ప్రత్యేకంగా ఉంటుంది. యాప్స్ పని తీరును.. సోషల్ మీడియా వినియోగాన్ని.. వీడియో స్ట్రీమింగ్.. మల్టీ టాస్కింగ్.. మోడరేట్ గేమింగ్ వంటి వాటికి ఇది సరిపోతుంది.

RAM సామర్థ్యం

ఇందులో 6 GB LPDDR4X RAM + 128 GB +UFS 2.2 స్టోరేజ్ ఇందులో ఉంటుంది. అదనంగా కావాలి అనుకుంటే మైక్రో ఎస్ డి కార్డు ఏర్పాటు చేసుకొని దానిని 1 టిబి వరకు పెంచుకోవచ్చు. అయితే దీనిని హైబ్రిడ్ స్లాట్ గా రూపొందించారు.

కెమెరా విషయంలో

కెమెరాకు సంబంధించి ఫోటోగ్రఫీ కోసం ప్రత్యేకంగా ఫోన్ వెనుక భాగంలో డిఎల్ కెమెరా సెట్ అప్ ఏర్పాటు చేశారు. ఇందులో 50 మెగా పిక్సెల్ ప్రధాన కెమెరా ఉంటుంది. 2 మెగా పిక్సల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది.f/1.8 అపర్చర్ ఇందులో ఉంటుంది.. PDAF, LED ఫ్లాష్, HDR, panorama, 4K video recording ఇందులో అందుబాటులో ఉంటాయి. సెల్ఫీలు తీసుకోవడానికి.. వీడియో కాల్స్ మాట్లాడడానికి ఫోన్ ముందు భాగంలో 20 మెగాపిక్సల్ కెమెరా ఉంటుంది. అయితే ఈ ఫోన్లో కెమెరా విభాగంలో ఒక పరిమితిని తీసుకొచ్చారు. అల్ట్రావైడ్ కెమెరాను ఇందులో ఏర్పాటు చేయలేదు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper