Pawan Kalyan: 2024 ఎన్నికల సమయం లో తాడేపల్లిగూడెం లో నిర్వహించిన కూటమి సభ కూటమి పార్టీల అభిమానులకు ఒక మధుర జ్ఞాపకం అని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ ఎంతో ఆవేశంతో వైసీపీ పార్టీ ని పాతాళంలోకి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు , నా పార్టీ జనసేన కాదు అని పెద్ద సవాల్ విసరడం వంటివి మనం అంత తేలికగా మనం మర్చిపోగలమా చెప్పండి. అప్పట్లో ఈ సవాల్ ని వైసీపీ వాళ్ళు చాలా కామెడీ గా తీసుకున్నారు. కానీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత వాళ్లకు మబ్బులు వీడిపోయాయి. పవన్ కళ్యాణ్ చెప్పిందే చేసాడు కదా అని అప్పుడు బాధపడ్డారు. అయితే అది కేవలం టీజర్ మాత్రమే.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు గ్రామాల్లో వైసీపీ ని ఖాళీ చేసే వ్యూహాన్ని రచించాడు పవన్ కళ్యాణ్. ఇప్పటికే గ్రామాల్లో వేల సంఖ్యలో వైసీపీ క్యాడర్ జనసేన పార్టీ కి షిఫ్ట్ అవుతూ వస్తోంది. గ్రామీణ ఎన్నికలు మొదలయ్యేలోపు వైసీపీ క్యాడర్ మొత్తాన్ని జనసేన కి షిఫ్ట్ అయ్యేలా మాస్టర్ ప్లాన్ వేసాడు పవన్ కళ్యాణ్. ఇదే కనుక జరిగితే జగన్ కి చావుదెబ్బ నే అని చెప్పొచ్చు. మాజీ సీఎం జగన్ తాను గతం లో చేసిన తప్పులు , పొరపాట్లను సరిదిద్దుకొని , ముందుకు వెళ్తే ఈరోజు ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. తాను ఇప్పటికీ అద్భుతమైన పాలన ని అందించానని , దొంగ ఈవీఎం లు వాడి కూటమి పార్టీలు అధికారం లోకి వచ్చాయనే ఊహల్లోనే జగన్ మరియు ఆయన అనుచరులు ఉన్నారు. ఇలాంటి ఊహల్లో ఉన్నంత కాలం టీడీపీ , జనసేన పార్టీ లకు తిరుగు ఉండదు అనే చెప్పాలి.
విజయనగరం జిల్లాలో వైసీపీ పార్టీ పరిస్థితి ఎలా తయారైందో చూస్తూనే ఉన్నాం. మన కళ్ల ముందే ఆ పార్టీ కుప్పకూలిపోయింది. వైసీపీ క్యాడర్ మొత్తం ఇప్పుడు టీడీపీ సొంతమైంది. అతి త్వరలోనే బొత్స సత్యనారాయణ జనసేన పార్టీ లో చేరే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. అదే కనుక జరిగితే విజయనగరం జిల్లాలో వైసీపీ పార్టీ పునాదులతో సహా కొట్టుకుపోయినట్టే అని చెప్పొచ్చు. ఇదే తరహా ఆపరేషన్ ని టీడీపీ , జనసేన అన్ని జిల్లాల్లోనూ చేస్తోంది. ముఖ్యంగా జనసేన పార్టీ లో స్పేస్ ఎక్కువ ఉండడం తో వైసీపీ బడా లీడర్లు చేరుతున్నారు. అనుకున్నది అనుకున్నట్టు చేస్తే వచ్చే ఏడాది లో పాదయాత్ర చేస్తానన్న జగన్ కి చుక్కలు కనిపిస్తాయి. ఎందుకంటే అత్యధిక శాతం వైసీపీ క్యాడర్ టీడీపీ , జనసేన పార్టీల్లో ఉంటాయి , పాదయాత్ర కి కావాల్సినంత డబ్బు పెట్టే నాయకులు కూడా ఉండరు. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.