Kasi Viswanath: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళుతుంది. యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరో వరుస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న క్రమంలో కొంతమంది మాత్రం సినిమాలను చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుడటం విశేషం…ఇక ఇప్పటికే సీనియర్ హీరోలు సైతం వాళ్ళ సత్తాను చాటుతున్నారు… ఇక ఇదిలా ఉంటే ప్రముఖ దర్శకుడు అయిన కాశీ విశ్వనాథ్ సినిమా ఇండస్ట్రీ గురించి కొన్ని కామెంట్స్ చేశాడు. ముఖ్యంగా ఫ్యాక్షన్, సోషల్ మెసేజ్ ఉన్న సినిమాలను అలాగే ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ లను సినిమా ఇండస్ట్రీకి తీసుకువచ్చింది చిరంజీవి, బాలకృష్ణ కాదని అది కేవలం వెంకటేష్ వల్లనే సాధ్యమైంది అంటూ ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. నిజానికి వెంకటేష్ ‘ప్రేమించుకుందాం రా’ అనే సినిమా చేసిన తర్వాతే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫ్యాక్షన్ సినిమాలు స్టార్ట్ అయ్యాయి.
ఆ తర్వాతే సమరసింహారెడ్డి, నరసింహ నాయుడు ఇంద్ర లాంటి మూవీస్ వచ్చాయి. అంతకు ముందు వరకు ఫ్యాక్షన్ సినిమాలు లేవని అన్ని తీసుకొచ్చిన ఘనత వెంకటేష్ కి దక్కుతుందని చెప్పాడు. అలాగే గణేష్ సినిమాలో సోషల్ మెసేజ్ ని ఇచ్చారు.
తర్వాతే తెలుగులో చాలావరకు సోషల్ మెసేజ్ ఉన్న సినిమాలు వచ్చాయని ఠాగూర్ సినిమా సైతం గణేష్ సినిమా తర్వాతే వచ్చింది. ఇక వీటితో పాటుగా వెంకటేష్ హీరోగా చేసిన కలిసుందాం రా సినిమా వచ్చిన తర్వాతనే ఫ్యామిలీ సినిమాలకు క్రేజ్ పెరిగిందని ఫ్యామిలీ సినిమాలు తీయాలంటే కలిసుందాం రా సినిమాని ప్రతి ఒక్కరు గుర్తు చేసుకుంటారని ఆయన చెప్పడం విశేషం…
మొత్తానికైతే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం కొనసాగుతున్న జానర్స్ అన్నీ కూడా వెంకటేష్ తీసుకొచ్చినవే అంటూ ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి… ఇక ప్రస్తుతం కాశీ విశ్వనాథ్ డైరెక్షన్ ను పక్కన పెట్టి యాక్టర్ గా పలు సినిమాల్లో నటిస్తున్నాడు…