Senior Heroes: సినిమా ఇండస్ట్రీలో ఎవరికైతే ఎక్కువ మార్కెట్ ఉంటుందో వాళ్లకి మాత్రమే రెమ్యునరేషన్స్ ఎక్కువగా చెల్లిస్తుంటారు. అలాగే ఒక హీరో సినిమాకి ఎంత బడ్జెట్ పెట్టాలి అనేది కూడా తన మార్కెట్ డిసైడ్ చేస్తుంది. ఇలాంటి క్రమంలోనే సీనియర్ హీరోలైన చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి హీరోలు ఈ మధ్యకాలంలో డిఫరెంట్ సినిమాలను చేస్తూ వాళ్ళ మార్కెట్ ను పెంచుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ లు యంగ్ హీరోలు, స్టార్ హీరోలకు సైతం పోటీని ఇస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు.
నాగార్జున సైతం గత సంవత్సరం విలన్ గా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రను పోషించినప్పటికి ఇప్పుడు తన వందో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం ‘కింగ్ 100’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా గ్లింప్స్ నిన్న రిలీజ్ అయింది. దానికి మంచి పేరు వచ్చింది.
ఇక ఏది ఏమైనా కూడా నాగార్జున మరోసారి ఒక డిఫరెంట్ సినిమా చేయబోతున్నాడు అనే పెరైతే తీసుకొచ్చుకున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా నాగార్జున ఏరేంజ్ సక్సెస్ ని సాధిస్తాడు. ప్రస్తుతం నాగార్జున చేస్తున్న సినిమాలు ప్రేక్షకులను ఎలా మెప్పించబోతున్నాయి. తను ఫీచర్లో మరిన్ని డిఫరెంట్ ప్రాజెక్టులు చేయబోతున్నాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. మొత్తానికైతే సీనియర్ హీరోలు రూటు మార్చి డిఫరెంట్ సబ్జెక్టులను సెలెక్ట్ చేసుకుంటూ కలెక్షన్ల వర్షం కురిపించే ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసమే వాళ్ళు తమ ఏజ్ కు తగ్గ పాత్రలను సెలెక్ట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.
ఇంతకు ముందు యంగ్ హీరోల మాదిరిగా రొటీన్ సినిమాలను చేశారు. కానీ ఇప్పుడు కథ ను బేస్ చేసుకుని తమ క్యారెక్టరైజేషన్ ను నమ్ముకొని ముందుకు సాగుతున్నారు. అందుకే వీళ్లకు సక్సెసు లైతే వరిస్తున్నాయి. మరి యంగ్ హీరోలు, స్టార్ హీరోలతో సైతం పోటీ పడగలిగే కెపాసిటి తమకు ఉందని సీనియర్ హీరోలు ఎప్పటికప్పుడు తమ సినిమాల ద్వారానే ప్రూవ్ చేస్తున్నారు…