Homeఎంటర్టైన్మెంట్హుజురాబాద్ లో ఆడియోల గోల

హుజురాబాద్ లో ఆడియోల గోల

Huzurabad Audio call leakహుజురాబాద్ లో సంచలనాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేసిన కౌశిక్ రెడ్డి మరో ఆడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. దీంతో కాంగ్రెస్ లో ఆందోళనకర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పార్టీ అధ్యక్షుడే ఓడిపోతామని చెబుతుంటే ఏం చేయాలని నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు తిరుపతికి ఫోన్ చేశారు.

ఆ ఆడియో బయటకొచ్చింది. తాజాగా లీకైన ఆడియో కలకలం రేపుతోంది. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కౌశిక్ రెడ్డి హుజురాబాద్ మండలం కొత్తపల్లికి చెందిన కాంగ్రెస్ నాయకుడు తిరుపతికి ఫోన్ చేశారు. తాను ఏ తప్పు చేయలేదంటూ కాంగ్రెస్ నాయకులకు ఫోన్ చేసి మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో తనను గెలిపించాలని కోరారు.

ఉప ఎన్నిక దగ్గర పడుతున్న నేపథ్యంలో బీజేపీ టీఆర్ఎస్ నాయకులు విస్తృతంగా ప్రచారం చేస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ మాత్రం వెనుకబడిపోవడం వల్లే ఇలా చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు కష్టపడ్డామన్నారు. కానీ సుఖపడే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పారు. మీరు సహకరిస్తే బాగుంటుందని పేర్కొన్నారు. తాను స్వయంగా వచ్చి కలుస్తానని చెప్పారు.

రాష్ర్ట పార్టీ అధ్యక్షుడే మనం ఓడిపోతున్నామని చెప్పడం సహించేదిగా లేదన్నారు. అందుకే అలా చేయాల్సి వచ్చిందని అన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ నేతలు రోజు తిరుగుతూ ప్రచారం చేస్తున్నారన్నారు. ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రచారం చేయడం లేదని పేర్కొన్నారు. ప్రచారం చేస్తామని చెప్పినా ఎవరు సహకరించలేదని అన్నారు. అందుకే పార్టీ కోసం పని చేయాలని సూచించినా పట్టించుకోకపోవడం విడ్డూరమన్నారు.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

India vs Zimbabwe : ఆరు ఓటముల తర్వాత.. అయ్యర్ పొలంలో మొలకలు.. కానీ ఇది సరిపోదు..

India vs Zimbabwe : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలోను వైట్ వాష్.. బ్యాటింగ్ బలంగా లేదు. బౌలింగ్ గొప్పగా లేదు.. ఫీల్డింగ్ చెప్పుకొనే స్థాయిలో లేదు. ఆటగాళ్లు ఏమైనా...
Modi Gen Z Video

Dharmendra Pradhan : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. నరేంద్ర మోడీ తదుపరి ఏం చేయబోతున్నారు..

Dharmendra Pradhan : సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రధాన్ రాజీనామా చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనలకు తలవంచి.. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ప్రధానమంత్రి నరేంద్ర...

Narendra Modi : కొత్త విద్యాశాఖ మంత్రి ఇతనే అనూహ్యంగా మోడీ మనస్సు ఇతడి మీదికే ఎందుకంటే..

Narendra Modi : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కొత్త విద్యాశాఖ మంత్రి ఎవరు అనే చర్చ మొదలైంది. వాస్తవానికి ధర్మేంద్ర రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న తర్వాత.. నరేంద్ర మోడీ వెంటనే...
Trump Warning Iran Deal

Donald Trump : ఈయూ జరిమానాలపై కన్నెర్రజేసిన ట్రంప్‌.. అమెరికా కంపెనీల రక్షణకు చర్యలు!

Donald Trump : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఏడాది కాలంపాటు అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని తరలించడం, అమెరికా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సరుకులపై...
KTR And Harish Rao In Bigg Boss

Harish Rao : బిజెపిలోకి హరీష్ రావు.. కేటీఆర్ ఏమన్నారంటే..

Harish Rao : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏదో ఒక సందర్భంలో మీడియాలో బలంగా ప్రచారానికి.. నాయకుల మధ్య చర్చకు కారణమయ్యే అంశం ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీలో హరీష్...
Oktelugu Epaper