
గన్ ఫౌండ్రీలోని ఎస్బీఐ కార్యాలయం అవరణలో కాల్పుల ఘటన కలకలం రేపింది. ఓ సెక్యూరిటీ గార్డు జరిపిన కాల్పుల్లో ఒప్పంద ఉద్యోగికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన బ్యాంకు సిబ్బంది గాయపడిన ఉద్యోగిని ఆసుపత్రికి తరలించారు. పరసర్పర వాగ్వాదంతో విచక్షణ కోల్పోయిన సెక్యూరిటీ గార్డు కాల్పులకు తెగబడినట్లు సమాచారం. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.