Homeఎంటర్టైన్మెంట్Pawan Kalyan Health: మరోసారి తీవ్రమైన అస్వస్థతకు గురైన పవన్ కళ్యాణ్.. రాజమండ్రి హాస్పిటల్ కి...

Pawan Kalyan Health: మరోసారి తీవ్రమైన అస్వస్థతకు గురైన పవన్ కళ్యాణ్.. రాజమండ్రి హాస్పిటల్ కి తరలింపు..

Pawan Kalyan Health: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి తీవ్రమైన అస్వస్థతకు గురయ్యారు. జ్వరం తీవ్ర రూపం దాల్చడం తో , నేడు సాయంత్రం లోక్ భావం లో నిర్వహించే ‘ఎట్ హోమ్’ కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నారు. ప్రతీ ఏడాది స్వతంత్ర దినోత్సవం రోజున గవర్నర్ భావం లో ‘ఎట్ హోమ్’ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. గడిచిన రెండేళ్లలో పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమానికి మిస్ అవ్వలేదు. తన సతీమణి అన్నా […]

Pawan Kalyan Health: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి తీవ్రమైన అస్వస్థతకు గురయ్యారు. జ్వరం తీవ్ర రూపం దాల్చడం తో , నేడు సాయంత్రం లోక్ భావం లో నిర్వహించే ‘ఎట్ హోమ్’ కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నారు. ప్రతీ ఏడాది స్వతంత్ర దినోత్సవం రోజున గవర్నర్ భావం లో ‘ఎట్ హోమ్’ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. గడిచిన రెండేళ్లలో పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమానికి మిస్ అవ్వలేదు. తన సతీమణి అన్నా కొణిదెల తో కలిసి పాల్గొనేవారు. సీఎం చంద్రబాబు , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు కలిసి గవర్నర్ తో విందు చేస్తున్న విజువల్స్ ని చూసి అభిమానులు మురిసిపోయేవారు. ఈ ఏడాది కూడా అలాంటి విజువల్స్ బయటకు వస్తాయని ఆశగా ఎదురు చూశారు. కానీ అకస్మాత్తుగా ఆయనకు తీవ్ర జ్వరం రావడం తో హైదరాబాద్ కి వెనుతిరగాల్సి వస్తోంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే నేడు ఉదయం కాకినాడ లో నిర్వహించిన 80 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ , రాజమహేంద్రవరం అటవీశాఖ ఆద్వర్యం లో ఏర్పాటు చేసిన సెంట్రల్‌ క్రాఫ్ట్‌ వుడ్‌ బ్యాంక్‌ను ప్రారంభించారు. ఆ సమయం లో ఆయనకు జ్వరం తీవ్ర రూపం దాల్చింది. దీన్ని ఆ కార్యక్రమాన్ని మధ్యలోనే ముగించుకున్న ఆయన , రాజమహేంద్రవరం లోని హాస్పిటల్ కి వెళ్లారు. అక్కడ వైద్యులు పలు పరీక్షలు నిర్వహించారు. అక్కడ కొంతసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత హైదరాబాద్ కి బయలుదేరి వెళ్తారు. రీసెంట్ గానే పవన్ కళ్యాణ్ తన కుడి భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అనంతరం ఆయన ఆ కుడి భుజానికి చేయించుకోవాల్సిన ఫిజియో థెరఫీ గురించి వైద్య నిపుణుల సలహాలు సూచనలు స్వీకరించబోతున్నట్టు సమాచారం. అయితే పవన్ కళ్యాణ్ ఇలా వరుసగా అనారోగ్యానికి గురి అవ్వడం పై సోషల్ మీడియా లో ఆయన అభిమానులు తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

చెయ్యి బాగాలేనప్పుడు డాక్టర్ల సూచనల మేరకు విశ్రాంతి తీసుకోవడం మంచిది , కానీ పవన్ కళ్యాణ్ విధుల్లో పాల్గొనడం వల్ల , ఇలా ఊరికే అస్వస్థతకు గురి కావాల్సి వస్తోంది. పూర్తి స్థాయిలో కోలుకున్న తర్వాతనే విధుల్లోకి రావాలని సూచిస్తున్నారు. మరోపక్క పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి పై వైసీపీ నాయకులూ ఎలాంటి తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి , మన తోటి రాజకీయ నాయకుడు అని కూడా లేదు , ఆరోగ్యం బాగాలేని సమయం లో కూడా సెటైర్లు వేస్తుంటారు అంటూ పవన్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper