Amazon: ఏదైనా వస్తువు కొనుగోలు చేయాలంటే నేరుగా షాప్ లోకి వెళ్లడం ద్వారా సమయం వృధా కావడంతో పాటు ధర ఎక్కువగా చర్చించాల్సి వస్తుంది అని కొందరి భావన. దీంతో చాలామంది ఆన్లైన్ షాపింగ్ చేస్తుంటారు. ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు అయినా అమెజాన్, ఫ్లిప్కార్ట్ ద్వారా కావాల్సిన వస్తువులను కూర్చున్న చోటికి తెప్పించుకుంటున్నారు. అయితే వీటిలో అమెజాన్ లో ఉన్న మూడు సీక్రెట్స్ గురించి తెలిస్తే డబ్బులు మరింత సేవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ సీక్రెట్స్ లో ఏమున్నాయి? వాటి వల్ల డబ్బులు ఎలా సేవ్ అవుతాయి?
Amazon warehouse:
అమెజాన్ వెబ్సైట్ ఓపెన్ చేసేటప్పుడు పైన ఉన్న పదాన్ని కంపోజ్ చేయండి. ఇప్పుడు కొన్ని ప్రొడక్ట్స్ కనిపిస్తాయి. ఇవి ఎక్కువగా ఎలక్ట్రానిక్ సంబంధించినవి ఉంటాయి. చాలామంది మొబైల్ కు సంబంధించిన వస్తువులు లేదా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు కొనాలని అనుకుంటారు. అయితే ఆమెజాన్ సాధారణ వెబ్సైట్లో కంటే ఇందులో కొనుగోలు చేయడం వల్ల ఎక్కువగా డబ్బులు సేవ్ అవుతాయి. ఎందుకంటే ఇందులో చిన్నచిన్న డిఫెక్ట్ ఉన్న వస్తువులను అందుబాటులో వస్తారు. వీటిపై భారీగా డిస్కౌంట్ ఇచ్చి విక్రయిస్తుంటారు. దీనివల్ల దాదాపు కొత్త వస్తువులనే తక్కువ ధరకు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.
Amazon outlet:
దుస్తులు, ఇతర ధరించే వస్తువులు కొనాలని అనుకునే వారికి ఈ పేజీ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎందుకంటే అమెజాన్ వెబ్సైట్లో పై పదాన్ని కంపోజ్ చేయడం వల్ల దాదాపు 60 నుంచి 70 శాతం డిస్కౌంట్ కలిగే వస్తువులు కనిపిస్తాయి. ఇవి ఎక్కువగా బ్రాండెడ్ కు చెందినవే ఉంటాయి. దీనివల్ల కూడా అదనంగా డబ్బులు సేవ్ చేసుకోవచ్చు.
Amazon coupon:
ఇక చివరిగా ఈ పదాన్ని ఆమెజాన్ వెబ్సైట్లో టైప్ చేయడం వల్ల కొన్ని రకాల ప్రోడక్ట్ పై కూపన్స్ వస్తుంటాయి. మీకు నచ్చిన వస్తువును ఏదైనా కొనుగోలు చేస్తే దాని పక్కన కూపన్ అనేదానికి టిక్ చేయడం వల్ల ఆ కూపన్ యాడ్ అయిపోతుంది. దీంతో ఆ వస్తువు ప్రైస్ పేజీకి వచ్చేసరికి ఆ కూపన్ లో ఉన్న డిస్కౌంట్ లభిస్తుంది. దీని ద్వారా కూడా భారీగా డిస్కౌంట్ పొందే అవకాశం ఉంటుంది.
ఇలా ఈ మూడు కోడ్స్ ద్వారా తక్కువ ధరకే వస్తువులు కొనుగోలు చేయడంతో పాటు.. భారీగా డిస్కౌంట్ పొందే అవకాశాలు ఉంటాయి. ఇకనుంచి ఆమెజాన్ లో వస్తువులు కొనుగోలు చేస్తే వీటిని ఉపయోగించుకోవచ్చు.