Sreemukhi: తెలుగు బుల్లితెర పై యాంకర్ సుమ తర్వాత అంతటి క్రేజ్ ని , డిమాండ్ ని సొంతం చేసుకున్నది ఎవరూ అంటే , మన అందరికీ గుర్తుకొచ్చే పేరు శ్రీముఖి. తన చలాకీ తనంతో , అద్భుతమైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులకు తిరుగులేని ఎంటర్టైన్మెంట్ ని అందించడం లో ఈమెకు దరిదాపుల్లో కూడా మరో యాంకర్ లేదు అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. ఈటీవీ , స్టార్ మా చానెల్స్ లో ఎన్నో ఎంటర్టైన్మెంట్ షోస్ కి యాంకర్ గా వ్యవహరిస్తూ వస్తున్న ఈమెకు సోషల్ మీడియా లో కూడా మంచి క్రేజ్ ఉంది. ఈమెకు సంబంధించిన ఏ అప్డేట్ వచ్చినా కామెంట్స్ లో శ్రీముఖి గురించి చాలా గొప్పగా మాట్లాడుతూ ఉంటారు నెటిజెన్స్.అలాంటి నెటిజెన్స్ మొదటిసారి శ్రీముఖి పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
అందుకు కారణం ‘అగ్నిపరీక్ష 2’ షో. నిన్న అర్థ రాత్రి నుండి మొదటి ఎపిసోడ్ జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. నేడు రాత్రి స్టార్ మా ఛానల్ లో 10 గంటలకు టెలికాస్ట్ అవ్వనుంది. అయితే ఈ ఎపిసోడ్ లో శ్రీముఖి ‘రన్నింగ్ రాజా’ అనే కంటెస్టెంట్ పై చాలా చిరాకుతో మాట్లాడడం నెటిజెన్స్ కి నచ్చలేదు. తనని ఇమిటేట్ చేస్తూ ఆ కంటెస్టెంట్ చేసిన యాక్ట్ , ఆమెకు నచ్చలేదు. దీంతో ‘నువ్వు బయటకు వెళ్తావా?, లేదా నన్ను వెళ్ళిపోమంటావా? ‘ అని అనడం, దగ్గరకు వస్తే చెంప పగలగొడుతాను అని వార్నింగ్ ఇవ్వడం వంటివి చూసిన నెటిజెన్స్ సామాన్యులు అంటే అంత చులకన ఎందుకు?.. వాళ్ళు కూడా మీ స్థాయి నుండే వచ్చారు కదా, శ్రీముఖి చాలా ఓవర్ యాక్షన్ చేస్తుంది అంటూ మండిపడుతున్నారు నెటిజెన్స్. అయితే ఆ కంటెస్టెంట్ ప్రవర్తన కూడా సరిగా లేదని, అందుకే శ్రీముఖి అలా ఫైర్ అయ్యిందని అంటున్నారు మరికొంతమంది నెటిజెన్స్.
ఒక్కసారి దగ్గరకి రావొద్దు అని చెప్పిన తర్వాత , పదే పదే ఆ కంటెస్టెంట్ దగ్గరకు రావడంతో కంట్రోల్ తప్పిన శ్రీముఖి అలాంటి రియాక్షన్ ఇచ్చిందని అంటున్నారు. కానీ అతన్ని చూస్తుంటే పక్కా పల్లెటూరి వ్యక్తి లాగా ఉన్నాడు. వాళ్ళ మాట తీరు కాస్త ఇలాగే ఉంటుంది. ఇది శ్రీముఖి కి తెలియనిది కాదు, అయినప్పటికీ ఈ స్థాయిలో రియాక్ట్ అయ్యిందంటే , ఆమెకు అతను నచ్చకపోవడం వల్లే అని స్పష్టం అవుతోంది. శ్రీముఖి తనకు ఇష్టమైన వాళ్ళను గతం లో గట్టిగా కౌగిలించుకోవడం , ముద్దు పెట్టుకోవడం వంటివి చేసేది, అప్పుడు వాళ్ళు కూడా దగ్గరకు రాకు , దూరం గా పో అనుంటే శ్రీముఖి ఎంత బాధ పడి ఉండేది?, ఇప్పుడు ఆ వ్యక్తి కూడా అలాగే బాధ పడి ఉంటాడు కదా, మనుషులు అంటే లెక్కలేదా అంటూ శ్రీముఖి పై ఎక్కువ శాతం మంది నెటిజెన్స్ మండిపడుతున్నారు.