Harish Rao: ఏదోరకంగా రేవంత్ ప్రభుత్వం మీద బురద చల్లాలి. చివరికి కోర్టులను కూడా వాడుకోవాలి. ఇదంతా సరైనది కాదు.. సక్రమమైన పద్ధతి కాదు.. అని తెలిసినప్పటికీ కూడా గులాబీ పార్టీ నేతలు ఊరుకోరు.. కేటీఆర్ నుంచి హరీష్ రావు వరకు అంతా ఇదే ధోరణి. మిగతా వ్యవస్థలు లాగా న్యాయస్థానాలు ఉండవు కదా..
తెలంగాణ సర్వోన్నత న్యాయస్థానం హరీష్ రావు వ్యవహార చేరిని పూర్తిగా తప్పు పట్టింది. వాస్తవానికి దీనిని జనంలోకి కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్లలేదు. తీసుకెళ్లే సోయి కూడా ఆ పార్టీకి లేదు. ఆ పార్టీది.. ఆ పార్టీ సోషల్ మీడియా పర్యవేక్షించే వారిది అదొక దురవస్థ. దాని గురించి చెప్పుకోవడం టైం వేస్ట్ వ్యవహారం. ఇంతకీ హరీష్ రావును హైకోర్టు ఎందుకు తప్పు పట్టింది. ఎక్కడ ఆయనకు చివాట్లు పెట్టింది.. ఒకసారి లోతులోకి వెళ్తే..
ఇన్పుట్ సబ్సిడీ.. రుణమాఫీ కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసిందని.. పరిపాలనపరమైన అనుమతులు ఇచ్చిందని.. ఆ తర్వాత కూడా నిధులను పూర్తిస్థాయిలో విడుదల చేయలేదని మాజీ మంత్రి హరీష్ రావు.. ఎమ్మెల్యే పాయల్ శంకర్ వేరువేరుగా ప్రజాప్రయోజన వ్యాజ్యాలను హైకోర్టులో దాఖలు చేశారు. వీటి మీద హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ మోహియుద్దీన్ తో కూడిన ధర్మాసనం విచారించడానికి ఒప్పుకోలేదు. దీనికి సంబంధించి విస్పష్టమైన ఉత్తర్వులను జారీ చేసింది. ఆ ప్రజాప్రయోజన వ్యాజ్యంలో..”ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం పంట రుణమాఫీ పథకం లో భాగంగా రైతుల ఖాతాల్లో రుణమాఫీ మొత్తం ప్రభుత్వం జమ చేయలేదు రుణమాఫీ కోసం 31 వేల కోట్లను ప్రతిపాదించింది. ఇందులో 20000 కోట్లు మాత్రమే రిలీజ్ చేసింది.. ఇంకా 11 వేల కోట్లు ఇవ్వాల్సి ఉందని” హరీష్ రావు తన పిటిషన్ లో పేర్కొన్నారు.
ఈపిడిషన్లో విచారించడానికి హైకోర్టు ఒప్పుకోలేదు. ప్రభుత్వ విధానాలను.. నిధుల కేటాయింపులను తాము పర్యవేక్షించలేమని.. దానిని కోర్టు భర్తీ చేయలేదని బెంచ్ క్లారిటీ ఇచ్చింది.. రైతులకు సంబంధించిన పంట రుణాల మాఫీ అనేది ప్రభుత్వ పరిధిలో ఉన్న అంశం అని.. ప్రభుత్వ విధానాలను పర్యవేక్షించడం కోర్టు బాధ్యత కాదని స్పష్టం చేసింది. ఒక ముఖ్యమంత్రి ఒక నిర్ణయం తీసుకొని…. దానికి చట్టబద్ధత కల్పించకపోతే అప్పుడు తాము అందులోకి ప్రవేశిస్తామని.. దానిని పరిశీలిస్తామని కోర్టు స్పష్టం చేసింది.”రుణాల మాఫికి సంబంధించి జరిగిన అమలు విధానంపై గతంలో పిటిషనర్ పిల్ దాఖలు చేశారు. అధికారులను కలిసి వినతి పత్రం సమర్పించారు. 8 వారాల తర్వాత మళ్లీ మమ్మల్ని ఆశ్రయించేందుకు అనుమతి ఇచ్చాం. కానీ 8 వారాల గడువు పూర్తిగాకముందే జూన్ 22న పిటీషనర్ పిల్ దాఖలు చేశారు.. ఇది సరైన విధానం కాదని” హైకోర్టు అభిప్రాయపడింది. గతంలో కురిసిన భారీ వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులకు 231 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ చెల్లించాలని పిల్ దాఖలైంది. దానిపై కూడా విచరించడానికి హైకోర్టు ఒప్పుకోలేదు. ఈ పిటిషన్ ను పాయల్ శంకర్ వేశారు.. దీన్ని పరిశీలించిన కోర్టు.. ఈ కేసు విచారణ సంబంధించిన వాస్తవ వివరాలను తమ ముందు ఉంచాలని పేర్కొంది. చివరికి ఈ పిల్ విచారణ సాధ్యం కాదని.. నంబర్ కేటాయించడానికి కూడా హైకోర్టు ఒప్పుకోలేదు.