Rich People Investment: చాలామంది డబ్బులు సంపాదిస్తారు. కానీ వాటిని రెట్టింపు చేయడంలో తడబడుతూ ఉంటారు. ఒక మధ్య తరగతి వ్యక్తి తనకు వచ్చిన ఆదాయంలో మిగిలిన దానిని బ్యాంకులో డిపాజిట్ చేసి.. దానిపై వచ్చే కొంత వాటితో సంతృప్తి పడతాడు. కానీ ఒక ధనవంతుడితో సమానంగా డబ్బులు సంపాదించలేడు. ఎందుకంటే ధనవంతుల ఆలోచనలు వేరే విధంగా ఉంటాయి. సాధారణంగా ధనవంతులు ఎలాంటి పెట్టుబడులు పెడతారో తెలుసా..? వారు మాత్రమే అత్యధిక ధనవంతులుగా ఎందుకు మారుతున్నారో తెలుసా?
మనకు వచ్చిన సంపాదనలో ఖర్చులు పోనూ కచ్చితంగా పొదుపు చేయాలి. అలా ఇప్పుడు పొదుపు చేస్తేనే భవిష్యత్తులో అత్యవసరాలు లేదా ఇతర అవసరాలకు డబ్బు అందుబాటులో ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చే ఆదాయం భవిష్యత్తులో వచ్చే అవకాశాలు ఉండవు. ఇలాంటప్పుడు వడ్డీ రూపంలో లేదా రెంటల్ రూపంలో డబ్బులు వచ్చే మార్గాలను వెతుక్కోవాలి. అందుకోసం ప్లాట్ బిజినెస్ చాలా అనుకూలంగా ఉంటుంది.
గతంలో సినీ పరిశ్రమకు చెందిన చాలామంది రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెట్టారు. వారు ఇప్పుడు అనుకున్న సినిమాలు చేయలేకపోయినా.. ఆ ఫ్లాట్ల ద్వారా అధిక ఆదాయాన్ని పొందుతున్నారు. అసలు ఇలా ప్లాట్ ద్వారా ఎలా ఆదాయాన్ని పొందవచ్చు? ఎందుకు ఫ్లాట్ ద్వారా ఆదాయం వస్తుంది?
ఉదాహరణకు ఒక వ్యక్తి హైదరాబాదులో ఉద్యోగం చేస్తున్నాడని అనుకుందాం. అతనికి వచ్చే ఆదాయంలో పొదుపు చేయాలని అనుకుంటే.. సాధారణ డిపాజిట్లు లేదా.. బ్యాంకు సేవింగ్కు బదులు హైదరాబాద్ కు సమీప దూరంగా ఉన్నా ఫ్లాట్స్ కొనుగోలు చేయవచ్చు. ఈ ఫ్లాట్స్ భవిష్యత్తులో డిమాండ్ ను పొందే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే నగరం విస్తీర్ణం రోజు రోజుకు పెరిగే అవకాశం ఉంటుంది. ఒకప్పుడు వ్యవసాయ క్షేత్రాలు.. పల్లెటూరి వాతావరణన్ని కల్పించిన కోకాపేట ఇప్పుడు రిచెస్ట్ ఏరియాగా మారిపోయింది. అలాగే హైదరాబాద్ చుట్టుపక్కల కూడా మరింతగా అభివృద్ధి చెంది అవకాశం ఉంటుంది.
ఇవే కాకుండా హైదరాబాద్ నగరంలోని కొన్ని షాపింగ్ కాంప్లెక్స్ లో షట్టర్స్ లేదా ఫ్లాట్స్ ను విక్రయిస్తూ ఉంటారు. అయితే ఈ షెటర్స్ లేదా ప్లాట్స్ ను లోన్ ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు. వీటి ద్వారా నెల నెల రెంటు వస్తూ ఉంటుంది. వచ్చిన రెంటుతో కాస్త డబ్బులు కలిపి లోన్ పూర్తి చేస్తే భవిష్యత్తులో ఆ శేఖర్ మిగిలిన అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో దీనిని విక్రయించినా కావలసిన డబ్బులు పొందవచ్చు.
ఈ విధంగా ప్లాట్స్ లేదా సిటీలోని షెటర్స్ కొనుగోలు చేయడం ద్వారా అధిక ఆదాయాన్ని పొందవచ్చు. అయితే వీటిని కొనుగోలు చేసేటప్పుడు సరైన పత్రాలు, లొకేషన్స్, నిబంధనలో అన్ని సరిచూసుకోవాలి. ఎందుకంటే కొందరు మోసపూరిత అమ్మకాలు చేయవచ్చు.