Toll Plaza: సొంత కారు ఉన్నవారికి దగ్గర్లో టోల్ ప్లాజా ఉంటే చాలా ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. ఎందుకంటే రకరకాల పనుల ద్వారా కార్లో రాకపోకలు సాగిస్తే అధిక చార్జీలు పడుతూ ఉంటాయి. అయితే fastag ద్వారా డబ్బులు చెల్లిస్తున్న కూడా.. ఈ బ్యాలెన్స్ నెలా పూర్తికాకముందే క్లోజ్ అయిపోతుంది. అయితే ఈ ఫైనాన్షియల్ సమస్యను అధిగమించేందుకు కొత్తగా లోకల్ పాస్ ను అందుబాటులోకి తెచ్చారు. దీని ద్వారా ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు.. రాకపోకలు సాగించిన కూడా అధిక చార్జీలు భరించాల్సిన అవసరం ఉండదు. మరి దీనిని ఎలా పొందాలి? ఎవరు దీనికి అర్హులు?
టోల్ ప్లాజా ద్వారా అధిక చార్జీలు చెల్లించే వారికి ఫాస్టాగ్ లోకల్ పాస్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దీనిని పొందిన వారు రూ.340 చెల్లిస్తే చాలు.. 30 రోజులపాటు ఎన్నిసార్లైనా రాకపోకలు చెల్లించవచ్చు. అయితే ఇది కలిగిన వారు కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ఈ లోకల్ పాస్ కేవలం వ్యక్తిగత వాహనాలకు మాత్రమే పనిచేస్తుంది. అంతేకాకుండా టోల్ ప్లాజా కు 20 కిలోమీటర్ల లోపు దూరం ఉన్న వారికి మాత్రమే వర్తిస్తుంది. దీంతో తక్కువ దూరంలో ఉన్నవారికి పదేపదే చార్జీలు చెల్లించాల్సిన అవసరం ఉండదు.
అయితే ఈ లోకల్ పాస్ ను ఆన్లైన్లోనే పొందవచ్చు. రాజ్కుమార్ యాత్ర యాప్ లేదా IHMCL అనే పోర్టల్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే రాజు మార్క్ యాత్ర యాప్ ఓపెన్ చేసిన తర్వాత లోకల్ పాస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసిన తర్వాత కొన్ని రూల్స్ ను చూపిస్తుంది. ఈ నిబంధనలో భాగంగా లోకల్ పాస్ తీసుకునే వ్యక్తి వాహనం తన పేరు మీదనే ఉండాలి. ఆధార్ కార్డు, ఆర్సి లో ఉన్న పేరు సమానంగా ఉండాలి. అలాగే తర్వాతి పేజీలో ఇంటి వద్ద ఉన్న ప్రదేశం పేరును సర్చ్ చేయాలి. ఆ తర్వాత వాహనానికి సంబంధించిన నెంబర్ ను ఎంట్రీ చేయాలి. ఇప్పుడు డిజి లాకర్ ద్వారా డాక్యుమెంట్ను లింక్ చేయాలి. దీంతో ఆటోమేటిక్గా సెర్చ్ చేసి లింక్ అవుతుంది.
ఇప్పుడు లోకల్ ఫాస్ట్ ఓపెన్ చేయగానే ఇంటి నుంచి టోల్ ప్లాజా ఎంత దూరం ఉందో చూపిస్తుంది. దీని ద్వారా ఈ పాస్ ను పొందే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత పదేపదే చార్జీలు చెల్లించాల్సిన అవసరం ఉండదు. అయితే దీనిని ప్రతినెల రెన్యువల్ చేసుకుంటూ వెళ్లాలి. ఇది రెగ్యులర్ ఉన్న fastag కు యాడ్ అయిపోతుంది. అయితే మరో విషయం ఏంటంటే రాజ్ మార్క్ యాత్ర యాప్ ఓపెన్ కాని పక్షంలో నేరుగా టోల్ ప్లాజా వద్ద కూడా లోకల్ పాస్ తీసుకునే అవకాశం ఉంటుంది.