Telugu Cinema Controversy: సినీ రంగం అనేది ఒక క్రియేటివ్ ఫీల్డ్. ఇక్కడ అందరూ ఒకే రకమైన ఏకాభిప్రాయం తో ఉండడం దాదాపుగా అసాధ్యం. ఒక్కోసారి ఇష్టం లేకపోయినా హీరో బలవంతం కారణంగానో , ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయడం వల్లనో తెలియదు కానీ , డైరెక్టర్ వాళ్లకు సరెండర్ అయ్యి సినిమాలు చేయాల్సి వస్తుంది. ఇలా ఇష్టం లేకుండా ఒక డైరెక్టర్ సినిమా చేసినప్పుడు కావాల్సిన ఔట్పుట్ రాదు. అలాంటి సమయం లోనే సెట్స్ లో గొడవలు ఏర్పడుతుంటాయి. రీసెంట్ గా ఒక భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ తెలుగు సినిమా షూటింగ్స్ సెట్స్ లో ఇదే జరిగిందట. టాలీవుడ్ టాప్ 6 హీరోల్లో ఒకరు , తన కెరీర్ లో ఎంతో ప్రస్థితాత్మకంగా తీసుకొని ఒక చిత్రాన్ని మొదలు పెట్టాడు. సగానికి పైగా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి.
అయితే రీసెంట్ గానే ఔట్పుట్ ని చూసుకున్న డైరెక్టర్ చాలా నిరాశకు గురయ్యాడట. ఇప్పటికే సగానికి పైగా షూట్ చేసిన ఔట్పుట్ ని తొలగించాల్సి వచ్చింది. ఆ తర్వాత మళ్లీ ఫ్రెష్ గా షూటింగ్ ని మొదలు పెట్టారు , ఇప్పుడు ఈ ఔట్పుట్ మీద కూడా డైరెక్టర్ సంతృప్తి చెందకపోవడం తో , హీరో కి , ఆ డైరెక్టర్ కి మధ్య అభిప్రాయం బేధాలు ఏర్పడ్డాయట. దీంతో డైరెక్టర్ కి సహనం పోవడం తో , తాను గతం లో తీసిన క్రేజీ బ్లాక్ బస్టర్ కి సీక్వెల్ పనులు మొదలు పెట్టాడట. అంతే కాదు , ప్రస్తుతం ఆ డైరెక్టర్ చేస్తున్న పాన్ ఇండియన్ సినిమాకు సీక్వెల్ అవసరం ఏ మాత్రం లేదట. కానీ ఇండియా వైడ్ గా ప్రస్తుతం సీక్వెల్ కి ఉన్న క్రేజ్ ని చూసి సీక్వెల్ కావాలి అని బలవంతం చేయడం తో ఆ డైరెక్టర్ అది కూడా చేసాడట.
కానీ కథ పర్ఫెక్ట్ గా కుదరడం లేదు , కేవలం మొదటి భాగం తోనే కథ పూర్తి అవుతుంది. ఇలా ఆ స్టార్ హీరో నుండి ఎదురవుతున్న విపరీతమైన ఒత్తిడిని భరించలేకనే ప్రస్తుతానికి ఈ చిత్రాన్ని పక్కన పెట్టేసాడని ఇండస్ట్రీ వర్గాల్లో ఒక రూమర్ తెగ చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఆ సినిమా ఏంటి?, డైరెక్టర్ ఎవరు అనే దానిపై సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. మీరేమని అనుకుంటున్నారు?, ఏ సినిమా అయ్యుంటుంది? కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.