Homeఎంటర్టైన్మెంట్వైరల్ అవుతున్న ప్రభాస్ మరో ఫోటో !

వైరల్ అవుతున్న ప్రభాస్ మరో ఫోటో !

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నేషనల్ స్టార్ గా మారక, షోషల్ మీడియాని తన స్టార్ డమ్ తో షేక్ చేస్తున్నాడు. కాగా ఇప్పుడు ప్రభాస్ కి చెందిన మరో కొత్త ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రాధే శ్యామ్ డ్రెస్సింగ్ లోనే మెస్రాటి లగ్జరీ కారు పక్కన వెరీ స్టైలిష్ గా కనిపిస్తోన్న ప్రభాస్ సరికొత్త ఫోటో.. సోషల్ మీడియాలో అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం […]

Prabhas Viral Pics

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నేషనల్ స్టార్ గా మారక, షోషల్ మీడియాని తన స్టార్ డమ్ తో షేక్ చేస్తున్నాడు. కాగా ఇప్పుడు ప్రభాస్ కి చెందిన మరో కొత్త ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రాధే శ్యామ్ డ్రెస్సింగ్ లోనే మెస్రాటి లగ్జరీ కారు పక్కన వెరీ స్టైలిష్ గా కనిపిస్తోన్న ప్రభాస్ సరికొత్త ఫోటో.. సోషల్ మీడియాలో అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “రాధే శ్యామ్” ఆల్ మోస్ట్ ముగింపు దశకు వచ్చింది. తాజాగా ప్లాన్ చేసిన ఇటలీ షెడ్యూల్ ను మేకర్స్ విజయవంతంగా పూర్తి చేసుకొని ఇండియాకు తిరిగివస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

అయితే ఇటలీలో షూటింగ్ జరిపినా కొద్దిమంది క్రూతోనే షూట్ చేశారు. దాంతో ఆనుకున్న విధంగా షూట్ జరగలేదట. అక్కడ కర్ఫ్యూ మూలంగా రోజుల్లో కొన్ని గంటలు మాత్రమే షూటింగ్ జరుపుకుందట. దీంతో ప్రభాస్ బృందం ఆ కొద్ది గంటల్లోనే కీలకమైన షాట్స్ తీసుకుని తిరిగి ఇండియా వచ్చేస్తోంది. మొత్తానికి ఇటలీ వెళ్లినా ప్రభాస్ సినిమాకి కరోనా కష్టాలు తప్పలేదు అన్నమాట. ఇక పెద్దగా ఫేమ్ లేని రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయకిగా నటిస్తోంది.

Also Read: కరోనాకు ‘నో’.. తికమకపెడుతున్న సెలబ్రెటీలు..!

అన్నట్టు ఈ సినిమాని తెలుగు-హిందీ – తమిళ- కన్నడ భాషా చిత్రంగా తెర‌కెక్కించి అటు పై దేశంలోని మిగిలిన అన్ని భాష‌ల్లోనూ.. జపాన్, చైనా, రష్యా లాంటి దేశాల్లో కూడా భారీగా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. విదేశాల్లోనూ భారీగా రిలీజ్ చేయడం అనేది ఈ మధ్య ఇండియన్ సినిమాలకు చిన్న విషయమే అయినా.. పెద్దగా అంచనాలు లేని ఈ సినిమా కూడా అలాగే రిలీజ్ చేయడం అంటే.. నిజంగా విశేషమే. మరి గోపికృష్ణ మూవీస్, యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘రాధే శ్యామ్’ చివరకు నిర్మాతలకు ఎలాంటి రిజల్ట్ ను ఇస్తోందో చూడాలి.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper