Fauzi Latest Poster : రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో విపరీతమైన అంచనాలను ఏర్పాటు చేసుకున్న చిత్రాల్లో ఒకటి ‘ఫౌజీ’. హను రాఘవపూడి దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమా పై మొదట్లో పెద్దగా అంచనాలు ఉండేవి కాదు. ఎందుకంటే ఈ చిత్రాన్ని ఒక లవ్ స్టోరీ అని ముందుగా అంతా అనుకున్నారు. ప్రభాస్ లాంటి యాక్షన్ హీరో కి ఈ లవ్ స్టోరీస్ సరిపడవు అని అనేక సార్లు రుజువు అయ్యింది. మళ్లీ అదే తరహా సినిమా అని చెప్పడం తో అభిమానులు కూడా తమ ఫోకస్ ని పూర్తి స్థాయిలో ‘స్పిరిట్ ‘ మూవీ కి షిఫ్ట్ చేశారు. కానీ ఎప్పుడైతే ‘ఫౌజీ’ నుండి ఫస్ట్ లుక్ వచ్చిందో , అప్పటి నుండి ఈ సినిమా పై అంచనాలు ఎవ్వరూ ఊహించని రేంజ్ కి వెళ్లిపోయాయి.
యుద్ధ రంగం లో శత్రు సైన్యాన్ని చీల్చి చెండాడి , స్టైల్ గా వాళ్ళ శవాలపై కూర్చున్న ప్రభాస్ స్టిల్ ని చూసి అభిమానులు మాత్రమే కాదు , నెటిజెన్స్ కూడా మెంటలెక్కిపోయారు. మరో వెయ్యి కోట్ల గ్రాస్ సినిమాని ప్రభాస్ అందించబోతున్నాడు అంటూ సోషల్ మీడియా లో అభిమానులు ఆనందించారు. ఇకపోతే నేడు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా , ఈ మూవీ మేకర్స్ శుభాకాంక్షలు తెలుపుతూ , మరో పోస్టర్ ని విడుదల చేశారు. ఈ పోస్టర్ లో ప్రభాస్ ముఖాన్ని చూపించలేదు , కానీ ఆయన రెండు చేతుల్లో తుపాకులు పట్టుకొని , రక్తం తో నిండిన శరీరం తో , చాలా వయొలెంట్ గా కనిపించడం అభిమానులకు గూస్ బంప్స్ ని రప్పిస్తోంది. ఇదే పోస్టర్ లో ఒక ముసలాయన చేతి కర్ర పట్టుకొని వెనక్కి తిరిగి నడిచి వెళ్తుంటాడు. ఈ పోస్టర్ ని చూసిన తర్వాత తమదైన శైలిలో విశ్లేషిస్తున్నారు నెటిజెన్స్.
శాంతి తో స్వాతంత్ర సమరం లో పోరాడిన గాంధీ ఒక వైపు , విప్లవం తో స్వాతంత్ర పోరాటం చేసిన సుభాష్ చంద్రబోస్ మరోవైపు అంటూ ఈ పోస్టర్ ని చూసి కామెంట్స్ చేస్తున్నారు. మేకర్స్ కూడా ఆ అర్థం వచ్చేట్టు గానే ఈ పోస్టర్ ని డిజైన్ చేసినట్టుగా అనిపిస్తోంది. ఇకపోతే మేకర్స్ ఈ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్ 3 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కానీ షూటింగ్ పూర్తి అయ్యేందుకు మరో 50 రోజుల సమయం పట్టేలా ఉంది. మరి అనుకున్న సమయానికి షూటింగ్ అవుతుందా లేదా?, ఒకవేళ పోస్ట్ ఫోన్ అయితే నెట్ ఫ్లిక్స్ సంస్థ 20 శాతం కొత్త విధించే అవకాశాలు ఉన్నాయి , చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.