Ali Comedian: కొంతమందికి స్మశానం చూస్తేనే భయం వేస్తుంది, మనం నడిచే దారిలో స్మశానం ఉందంటే కనీసం అటు వైపుకి వెళ్ళడానికి కూడా ఇష్టపడము. ఎందుకంటే దెయ్యాలు , ఆత్మలు ఆ స్మశానం లో తిరుగుతూ ఉంటాయనే అని నమ్మే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ ఇలాంటి పట్టింపులు ఏమి లేని వాళ్ళు , ధైర్యం గా స్మశానం లోకి వెళ్తుంటారు, కొంతమంది అయితే అక్కడికి వెళ్లి క్రేజీ పనులు కూడా చేస్తుంటారు. అలాంటి క్రేజీ పని ఒకటి చేసాడట ప్రముఖ కమెడియన్ అలీ. గతం లో ఈయన ‘బిల్లా’ అనే చిత్రం చేసిన సంగతి తెలిసిందే. ప్రభాస్ కి స్నేహితుడిగా కనిపించిన ఈయన , దాదాపుగా సినిమా మొత్తం ఉంటాడు. ఈ చిత్రాన్ని కృష్ణంరాజు నిర్మించడమే కాకుండా , ఒక కీలక పాత్ర పోషించాడు కూడా. ఈ సినిమా అప్పట్లో ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే.
ఈ చిత్రం లో ఒక సన్నివేశం లో కృష్ణం రాజు , అలీ స్మశానం లో ఉంటారు గుర్తుందా ?, అది నిజమైన స్మశానమే అని అలీ గతం లో జరిగిన ఒక ఈవెంట్ లో చెప్పుకొచ్చాడు. ఈ ఈవెంట్ లో ఆయన మాట్లాడుతూ ‘బిల్లా మూవీ షూటింగ్ స్మశానం లో కృష్ణం రాజు గారితో కలిసి చేస్తున్నాను. షాట్ మధ్య లో బ్రేక్ వచ్చింది. కృష్ణం రాజు గారు నాతో మాట్లాడుతూ ఏరా అలీ..కీమా బిర్యాని వచ్చింది తింటావా అని అడిగారు. ఈ స్మశానం లో ఈ శవాల మధ్య కీమా బిర్యానీ తినడం ఏంటండీ అని అన్నాను. వాళ్లకు తినే అదృష్టం ఇప్పుడు లేదురా , కనీసం మానమైన తిందాం పద అన్నాడు. చక్కగా ఆరోజు స్మశానం లో కూర్చొని కీమా బిర్యానీ తిన్నాము’ అంటూ చెప్పుకొచ్చాడు అలీ.
కృష్ణం రాజు , ప్రభాస్ మంచి భోజన ప్రియులు అనే సంగతి అందరికీ తెలిసిందే. భోజనం చేయడమే కాదు , వడ్డించడం లో కూడా వీళ్లకు సాటి ఇండస్ట్రీ లో ఎవ్వరూ లేరు. కృష్ణం రాజు తన ప్రొడక్షన్ లో సినిమా జరిగినన్ని రోజులు , తన సినిమా కోసం పని చేసే ప్రతీ స్టాఫ్ మెంబెర్ కి అద్భుతమైన భోజనం పెట్టించేవాడట. వెజ్ , నాన్ వెజ్ లో ఎన్ని రకాలు ఉంటాయో , అన్ని రకాలు వడ్డించేవాడట. ఆయన లాగా భోజనం పెట్టే నిర్మాత ఇండస్ట్రీ లో ఎవ్వరూ ఉండరని సెలబ్రిటీలు అంటుంటారు. అలీ ఈ సంఘటన గురించి చెప్పిన తర్వాత ఆయన ఎంత భోజన ప్రియుడో అర్థం అవుతుంది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram