Homeఅంతర్జాతీయంAirbus A380 : ఏ380.. ప్రపంచంలోని అతిపెద్ద ప్యాసింజర్‌ విమానం వెనుక కథ ఇదీ

Airbus A380 : ఏ380.. ప్రపంచంలోని అతిపెద్ద ప్యాసింజర్‌ విమానం వెనుక కథ ఇదీ

Airbus A380 : ఎయిర్‌బస్‌ ఏ380 ప్రపంచ విమానయాన చరిత్రలో ఒక మైలురాయి. రెండు అంతస్తులు, నాలుగు ఇంజిన్లు, 800 మందికి పైగా ప్రయాణికులను ఒకేసారి తీసుకెళ్లగల సామర్థ్యం.. ఇవన్నీ ఏ 380ని అతిపెద్ద ప్యాసింజర్‌ విమానంగా నిలబెట్టాయి. మొదటి విమానం ఆకాశంలోకి ఎగిరినప్పుడు చాలామంది ఆశ్చర్యపోయారు. ఇంత భారీ యంత్రం గాలిలో ఎలా స్థిరంగా ఉంటుందని. ఇది కేవలం పరిమాణం మాత్రమే కాదు.. మనిషి కలగన్న అత్యాధునిక ఇంజినీరింగ్‌ సామర్థ్యానికి ప్రతీక. భారీ పరిమాణం, ప్రత్యేక […]

Airbus A380 : ఎయిర్‌బస్‌ ఏ380 ప్రపంచ విమానయాన చరిత్రలో ఒక మైలురాయి. రెండు అంతస్తులు, నాలుగు ఇంజిన్లు, 800 మందికి పైగా ప్రయాణికులను ఒకేసారి తీసుకెళ్లగల సామర్థ్యం.. ఇవన్నీ ఏ 380ని అతిపెద్ద ప్యాసింజర్‌ విమానంగా నిలబెట్టాయి. మొదటి విమానం ఆకాశంలోకి ఎగిరినప్పుడు చాలామంది ఆశ్చర్యపోయారు. ఇంత భారీ యంత్రం గాలిలో ఎలా స్థిరంగా ఉంటుందని. ఇది కేవలం పరిమాణం మాత్రమే కాదు.. మనిషి కలగన్న అత్యాధునిక ఇంజినీరింగ్‌ సామర్థ్యానికి ప్రతీక.

భారీ పరిమాణం, ప్రత్యేక సామర్థ్యం..
ఏ380 సుమారు 73 మీటర్ల పొడవు, రెక్కలతో కలిపి దాదాపు 80 మీటర్ల వెడల్పు కలిగి ఉంటుంది. ఇంధనం నింపిన తర్వాత దీని బరువు 560 టన్నులు. అంటే సుమారు వంద ఆఫ్రికన్‌ ఏనుగుల బరువుతో సమానం. రెండు డెక్కులు ఉన్న క్యాబిన్‌లో గరిష్టంగా 800 మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చు. ఈ రికార్డును ఇప్పటివరకు ఏ ఇతర వాణిజ్య విమానం బ్రేక్‌ చేయలేదు. బోయింగ్‌ 737 లేదా ఏ320ని ఎయిర్‌ బస్‌ ఏ 380 పక్కన నిలబెడితే అవి చిన్న బొమ్మల్లా కనిపిస్తాయి. అయినా ఇంత పెద్ద బరువు ఉన్నా ఈ విమానం నిశ్శబ్దంగా, స్థిరంగా ఎగురుతుంది. ఫ్లెక్సిబుల్‌ వింగ్స్‌ గాలి ఒత్తిడిని సమర్థవంతంగా నిర్వహించి విమానాన్ని స్టేబుల్‌గా ఉంచుతాయి. ప్రయాణికులకు కంఫర్ట్‌ అందిస్తాయి.

ప్రపంచ సహకారంతో నిర్మాణం..
ఏ380ను ఒకే కంపెనీ లేదా ఒకే దేశం తయారు చేయలేదు. 30 దేశాలకు చెందిన 1500 కంపెనీలు కలిసి పనిచేశాయి. ఒక చోట వింగ్స్, మరో చోట ల్యాండింగ్‌ గియర్, ఇంకో చోట ఇంజిన్లు, ఎలక్ట్రికల్‌ సిస్టమ్స్‌ ఇలా విభజించారు. ఒక విమానంలో సుమారు 40 లక్షల వేర్వేరు పార్టులు ఉన్నాయి. వాటిలోని కేబుల్స్‌ మొత్తం పొడవు 531 కిలోమీటర్లు. ప్రతీ పార్టును అత్యంత కచ్చితమైన కొలతలతో తయారు చేశారు.

తరలించడం మరో సవాల్‌..
పార్టులు తయారు చేయడం ఒక సవాల్‌ అయితే, వాటిని ఫ్రాన్స్‌లోని అసెంబ్లీ ప్లాంట్‌కు తీసుకురావడం మరో పెద్ద సవాల్‌ు. కొన్ని భాగాలు సాధారణ ట్రక్కులకు సరిపోవు. అందుకే ప్రత్యేక ట్రక్కులు, షిప్పులు వాడారు. రాత్రివేళల్లో తరలింపు జరిగింది. రోడ్లు, జంక్షన్లు కూడా మార్చాల్సి వచ్చింది. ఇంత కష్టపడి తయారు చేసినా, 560 టన్నుల బరువు గల విమానం ఎలా ఎగురుతుందనే ప్రశ్న మిగిలే ఉండేది. అయినా ఇది విజయవంతంగా ఎగిరి, నిశ్శబ్ద ప్రయాణానికి కూడా రికార్డు సృష్టించింది.

ఎయిర్‌పోర్టులు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మార్పు..
ఏ380 వచ్చిన తర్వాత ప్రపంచంలోని పెద్ద ఎయిర్‌పోర్టులు కూడా మారాల్సి వచ్చింది. రన్‌వేలు, ట్యాక్సీవేలు, గేట్లు అన్నీ దీనికి అనుగుణంగా మార్చారు. టేకాఫ్‌ సమయంలో గాలి ప్రభావం వల్ల చిన్న వాహనాలు ఎగిరిపోయే ప్రమాదం ఉండేది. దుబాయ్, లండన్, లాస్‌ ఏంజిల్స్‌ లాంటి ప్రధాన ఎయిర్‌పోర్టులు ప్రత్యేక మార్పులు చేశాయి. ఏ 380 మొత్తం ఎయిర్‌పోర్ట్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను మార్చిన విమానం.

ఉత్పత్తి నిలిపివేత..
సాంకేతికంగా విజయవంతమైనా, 2019లో ఎయిర్‌బస్‌ అధికారికంగా ఏ380 ఉత్పత్తిని నిలిపివేసింది. కారణం సాంకేతిక సమస్య కాదు. ఎయిర్‌లైన్స్‌ అవసరాలు మారిపోయాయి. బోయింగ్‌ 787 లాంటి చిన్న, ఇంధన సామర్థ్యం ఎక్కువగా ఉన్న విమానాలు మార్కెట్‌ను ఆక్రమించాయి. 500 నుంచి 600 మంది ప్రయాణికులతో నడిచే విమానాలతో పోలిస్తే 300 మందితో నడిచే విమానాల ఇంధన ఖర్చు తక్కువ. ఎక్కువ రూట్లు కవర్‌ చేయగలవు. పెద్ద మోడల్‌ నుంచి చిన్న విమానాల ప్రయాణాలకు మార్కెట్‌ మారింది. ఏ380 ఈ మార్పుకు అనుగుణంగా మారలేకపోయింది. ఫలితంగా ఉత్పత్తి ఆగిపోయింది. కొత్తగా ఇలాంటి పెద్ద విమానాలు తయారు చేయాలని ఏ కంపెనీ ముందుకు రావడం లేదు.

కరోనా తర్వాత పునరుజ్జీవనం
2019లో ఉత్పత్తి ఆగిన తర్వాత చాలా ఏ380లు నిలిపివేయబడ్డాయి. కానీ 2020 తర్వాత పరిస్థితి మారింది. కరోనా కారణంగా అంతర్జాతీయ ప్రయాణాలు ఆగిపోయి, తర్వాత డిమాండ్‌ భారీగా పెరిగింది. అప్పుడు నిలిపివేసిన ఏ380లను మళ్లీ రన్‌వేలపైకి తెచ్చారు. నెలల తరబడి పరీక్షలు చేసి ప్రయాణికులతో సర్వీస్‌ మొదలుపెట్టారు. ఎమిరేట్స్‌ వంటి కంపెనీలు ఇప్పటికీ వాటిని విస్తృతంగా ఉపయోగిస్తున్నాయి. ప్రపంచం మర్చిపోయిన విమానం మళ్లీ స్టార్‌గా మారింది.

చివరి పెద్ద విమానంగా ఏ380 ?
ప్రస్తుతం ఉన్న ఏ380లు మంచి కండిషన్‌లో ఉన్నందున, వాటి లైఫ్‌టైం పూర్తయ్యే వరకు నడుపనున్నాయి ఎయిర్‌లైన్‌ సంస్థలు. కానీ సర్వీస్‌ పూర్తయిన తర్వాత కొత్తగా ఏ380లను కొనే అవకాశం లేదు. చిన్న, సమర్థవంతమైన విమానాలే ప్రాధాన్యత పొందుతాయి. అందువల్ల భవిష్యత్తులో ఇంత పెద్ద విమానాలు రాకపోవచ్చు. ఇప్పుడు ఉన్న ఏ380లే ప్రపంచంలోని అతిపెద్ద ప్యాసింజర్‌ విమానాలుగా మిగులుతాయి. అవి రిటైర్‌ అయిన తర్వాత ఇలాంటి విమానం మళ్లీ ఆకాశంలో కనిపించకపోవచ్చు.

ఏ380 కేవలం ఒక విమానం కాదు. ఇది టెక్నాలజీ, గ్లోబల్‌ సప్లై చైన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, మార్కెట్‌ అవసరాల మధ్య సమన్వయానికి ఉదాహరణ. ఇది ఎంత గొప్ప ఇంజినీరింగ్‌ అద్భుతమో, అంతే గొప్పగా మార్కెట్‌ రియాలిటీలను కూడా చూపించింది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Oktelugu Epaper