Yash : ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో విపరీతమైన క్రేజ్ తో కొనసాగుతున్న రష్మిక మందాన, వెండితెర కి పరిచయం అయ్యింది ఒక కన్నడ సినిమా ద్వారానే అనే సంగతి మన అందరికీ తెలిసిందే. ‘కిరిక్ పార్టీ’ అనే చిత్రం తో ఆమె మొదటి సినిమాతోనే భారీ హిట్ ని అందుకుంది. ఈ చిత్రానికి కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టి దర్శకత్వం వహించగా, రక్షిత్ శెట్టి హీరో గా నటించాడు. ఈ మూవీ షూటింగ్ సమయం లోనే రక్షిత్ శెట్టి తో ప్రేమలో పడిన రష్మిక , అప్పట్లో నిశ్చితార్థం కూడా గ్రాండ్ గా చేసుకుంది. కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ , ఈ నిశ్చితార్థం క్యాన్సిల్ అయ్యింది. అప్పటి నుండి రష్మిక కి కన్నడ సినీ ఇండస్ట్రీ తో కూడా సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. అయితే పలు సందర్భాల్లో ఆమె కన్నడ హీరోలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.
ఒక ఇంటర్వ్యూ లో హీరో యాష్ ని ఉద్దేశించి ఆమె చేసిన కామెంట్స్ బాగా వైరల్ అయ్యాయి. 2017 వ సంవత్సరం లో జరిగిన ఈ ఇంటర్వ్యూ లో , యాంకర్ అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం గా ‘యాష్’ కి ‘మిస్టర్ షో ఆఫ్’ అనే ట్యాగ్ ఇచ్చింది. అప్పట్లో యాష్ ఫాన్స్ ఈ అంశం పై రష్మిక ని ఒక రేంజ్ ట్రోల్ కూడా చేశారు. దీనిపై రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో యాష్ తనదైన శైలి లో కౌంటర్ ఇచ్చాడు. ఆయన మాట్లాడుతూ ‘అప్పటికి రష్మిక సినీ ఇండస్ట్రీ కి కొత్త. టీవీ షోస్ లలో యాంకర్లు ఇచ్చిన ఆప్షన్స్ లో నాకు ఇది సరిపోతుందని ఆమె ఎంచుకొని ఉండొచ్చు. ఆమె ఏ ఉద్దేశ్యం తో అనిందో నాకు తెలియదు. ఎవరి అభిప్రాయాలూ వాళ్ళది. నేను పెద్దగా ఇలాంటివి పట్టించుకోను ‘ అంటూ చెప్పుకొచ్చాడు యాష్.
ఆయన మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఇకపోతే యాష్ హీరో గా నటించిన ‘టాక్సిక్’ చిత్రం ఈ నెల 26 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ఆయన క్షణం కూడా తీరిక లేకుండా ప్రొమోషన్స్ లో చాలా బిజీ గా గడుపుతున్నాడు. తెలుగు లో కూడా త్వరలోనే ఆయన ప్రత్యేకంగా పలు ఈవెంట్స్ ని ఏర్పాటు చేయబోతున్నాడు. రీసెంట్ గానే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల అవ్వగా, దానికి ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో మనమంతా చూసాము. మరి సినిమాకు కూడా అదే రేంజ్ రెస్పాన్స్ వస్తుందో లేదో చూడాలి.