Anasuya Bharadwaj: ‘పుష్ప 2’ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత డైరెక్టర్ సుకుమార్ రామ్ చరణ్ తో ఒక సినిమా చేయబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతోంది. ఈ ఏడాది లోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ‘పెద్ది’ మూవీ షూటింగ్ సమయం లో రామ్ చరణ్ మణికట్టుకి జరిగిన గాయానికి రీసెంట్ గానే కోయింబత్తూరు లో చికిత్స చేయించుకున్నారు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న రామ్ చరణ్, కోలుకోగానే ఈ మూవీ కోసం మేకోవర్ అవ్వనున్నారు. ఇకపోతే ఈ చిత్రం లో ప్రముఖ యాంకర్ అనసూయ కూడా ఒక కీలక పాత్ర పోషించబోతుందట. ఈమధ్య కాలం లో సుకుమార్ తన ప్రతీ సినిమాలోనూ అనసూయ ని ఒక ముఖ్యమైన పాత్ర కోసం ఎంపిక చేసుకుంటున్న సంగతి తెలిసిందే.
వీళ్లిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన మొదటి చిత్రం ‘రంగస్థలం’. ఈ చిత్రం లో రంగమ్మత్త క్యారెక్టర్ లో అనసూయ ఎంత అద్భుతంగా నటించిందో అందరికీ తెలిసిందే. అప్పటి వరకు ఆమె చేసిన సినిమాలు ఒక ఎత్తు, ఈ సినిమా మరో ఎత్తు. ఈ చిత్రం ద్వారా అనసూయ కి వచ్చిన క్రేజ్ వేరే లెవెల్. ఆమెలో ఇంతటి అద్భుతమైన నటన ఉందని ఎవ్వరూ ఊహించలేకపోయారు. ఈ చిత్రం తర్వాత సుకుమార్ తెరకెక్కించిన ‘పుష్ప’ సిరీస్ లో కూడా అనసూయ నటించింది. ఇందులో ఆమె విలన్ క్యారెక్టర్ లో కనిపించిన సంగతి అందరికీ తెలిసిందే. రామ్ చరణ్ , సుకుమార్ సినిమాలో కూడా ఆమె పూర్తి స్థాయి విలన్ క్యారెక్టర్ లో కనిపించబోతుందట. ‘పుష్ప’ సిరీస్ లో ఆమె విలన్ క్యారెక్టర్ చేసినప్పటికీ, అది మెయిన్ విలన్ క్యారెక్టర్ కాదు, కానీ రామ్ చరణ్ మూవీ లో మెయిన్ విలన్ క్యారెక్టర్ చేయబోతుంది అట.
అంత పెద్ద పాన్ ఇండియన్ సినిమాలో అనసూయ మెయిన్ విలన్ అంటే , కాస్త రిస్క్ అనే చెప్పాలి. అయితే ఈమె ఒక్కటే మెయిన్ విలన్ గా నటించబోతుందా ?, లేదా మేల్ మెయిన్ విలన్ క్యారెక్టర్ కూడా ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రానున్నాయి. ఇకపోతే ఈ చిత్రం లో మరో పవర్ ఫుల్ లేడీ క్యారెక్టర్ కోసం నయనతార ని సంప్రదించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో పాన్ ఇండియా లెవెల్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న నటీనటులు కూడా ఈ సినిమాలో భాగం కాబోతున్నారు అట.