Homeఅంతర్జాతీయంSundar Pichai : ‘నువ్వు ఒక మాన్ స్టర్’.. సుందర్ పిచాయ్ ముఖం మీదే అనేసిన...

Sundar Pichai : ‘నువ్వు ఒక మాన్ స్టర్’.. సుందర్ పిచాయ్ ముఖం మీదే అనేసిన ట్రంప్.. తర్వాత ఏమైందంటే?

Sundar Pichai : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మధ్య వైట్ హౌస్ ఆవరణలో జరిగిన సరదా సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సాధారణంగా వైట్ హౌస్ వద్ద జరిగే మీడియా సమావేశాలు, అధికారిక కార్యక్రమాలు చాలా గంభీరంగా, సీరియస్‌గా సాగుతుంటాయి. కానీ, ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆల్ఫాబెట్ (గూగుల్) సీఈఓ సుందర్ పిచాయ్ పాల్గొన్న ఒక కార్యక్రమంలో మాత్రం అనుకోని రీతిలో కామెడీ వాతావరణం […]

Sundar Pichai : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మధ్య వైట్ హౌస్ ఆవరణలో జరిగిన సరదా సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సాధారణంగా వైట్ హౌస్ వద్ద జరిగే మీడియా సమావేశాలు, అధికారిక కార్యక్రమాలు చాలా గంభీరంగా, సీరియస్‌గా సాగుతుంటాయి. కానీ, ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆల్ఫాబెట్ (గూగుల్) సీఈఓ సుందర్ పిచాయ్ పాల్గొన్న ఒక కార్యక్రమంలో మాత్రం అనుకోని రీతిలో కామెడీ వాతావరణం నెలకొంది.

ట్రంప్ తనదైన శైలి హ్యూమర్‌తో సుందర్ పిచాయ్‌ను సరదాగా ఆటపట్టించగా దానికి పిచాయ్ ఇచ్చిన స్పాంటేనియస్ రీకౌంటర్ అక్కడున్న వారందరినీ పొట్టచెక్కలయ్యేలా నవ్వించింది.

అసలు ఏం జరిగింది?

వైట్ హౌస్ వెలుపల ప్రెస్ మీట్ సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ పక్కనే నిలబడిన సుందర్ పిచాయ్‌ను చూపిస్తూ.. “సుందర్, నువ్వు కూడా ఏమైనా మాట్లాడాలనుకుంటున్నావా?” అని మైక్ వైపు ఆహ్వానించారు.

దానికి సుందర్ పిచాయ్ నవ్వుతూ ముందుకొచ్చి, “ముందుగా అందరికీ ధన్యవాదాలు…” అని చెప్పడం ప్రారంభించారు.వెంటనే మధ్యలోనే జోక్యం చేసుకున్న డొనాల్డ్ ట్రంప్, తనదైన టైమింగ్‌తో “ఈ వ్యక్తి ఒక పెద్ద రాక్షసుడు (MONSTER)! కానీ బయట ప్రపంచంలో ఈయన గురించి ఎవరికీ తెలీదు. ఎంత అద్భుతమైన జీవితం కదా! ఇంత పెద్ద రాక్షసుడిలా ఉంటూ కూడా నా ప్రతి రోజూ ఎదుర్కొనే మీడియా డ్రామా, ప్రెజర్ పడాల్సిన అవసరం లేకపోవడం గొప్ప విషయం. మీ అందరికీ తెలసిందల్లా ఒక్కటే ‘సుందర్ర్ర్!’ సుందర్ అనేది ఇతని పేరు!” అని వ్యాఖ్యానించారు. టెక్ ప్రపంచాన్ని శాసిస్తున్న అతిపెద్ద దిగ్గజ సంస్థకు నాయకత్వం వహిస్తున్న పిచాయ్ ప్రభావ తీవ్రతను ఉద్దేశించి, తన మార్క్ శైలిలో ట్రంప్ “మాన్స్టర్” అనే పదాన్ని సరదాగా వాడారు.

సుందర్ పిచాయ్ స్పాంటేనియస్ కౌంటర్!

ట్రంప్ చేసిన కామెంట్‌కు అస్సలు తగ్గకుండా సుందర్ పిచాయ్ అంతే వేగంగా సమయస్ఫూర్తితో స్పందించారు. నవ్వుతూ మైక్ అందుకుని
“నేనొక రాక్షసుడిని (I’m a Monster) అని అనుకోవడానికంటే.. డోనాల్డ్ ట్రంప్ చెప్పిన ‘సుందర్ర్ర్!’ అనేది మరింత మంచి టాగ్ లైన్ అవుతుందని భావిస్తున్నాను” అని రీకౌంటర్ ఇచ్చారు. పిచాయ్ ఇచ్చిన ఈ స్పాంటేనియస్ ఆన్సర్‌కి ట్రంప్‌తో పాటు అక్కడ ఉన్న ప్రెస్, అధికారులు అంతా ఒక్కసారిగా గట్టిగా నవ్వేశారు.

సోషల్ మీడియాలో నెటిజన్ల ఫిదా!

వైట్ హౌస్ ఆవరణలో చోటుచేసుకున్న ఈ “కామేడీ గోల్డ్” వీడియో ఇప్పుడు నెట్‌లో విపరీతంగా హల్‌చల్ చేస్తోంది. సీరియస్ పొలిటికల్ అట్మాస్ఫియర్‌లో కూడా ట్రంప్ కి ఉన్న హ్యూమర్ సెన్స్, సుందర్ పిచాయ్ ప్రశాంతమైన ప్రవర్తన, టైమింగ్ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

“ట్రంప్ ఏ విషయాన్నైనా ఎంటర్‌టైనింగ్‌గా మార్చగలరు” అని కొందరు కామెంట్స్ చేస్తుంటే, మరికొందరు “టెక్ బిలియనీర్‌ను ట్రంప్ పిలిచిన తీరు చాలా ఫన్నీగా ఉంది” అని స్పందిస్తున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Oktelugu Epaper