Irumudi Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో గొప్ప విజయాలను సాధించిన స్టార్ హీరోలు చాలామంది ఉన్నప్పటికి రవితేజకి ఉన్న గుర్తింపు నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. చిరంజీవి తర్వాత రవితేజ సోలోగా ఇండస్ట్రీకి వచ్చి ఎవ్వరి సపోర్టు లేకుండా ఎదిగాడు. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలన్నీ అతనికి మంచి గుర్తింపును తీసుకొచ్చే విధంగానే ఉన్నాయి. రీసెంట్గా రిలీజ్ అయిన ఇరుముడి సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించిన ఆయన మరోసారి తన సత్తా ఏంటో చూపించాడు. ఇక ఇదిలా ఉంటే శివ నిర్వాణ ‘ఇరుముడి’ సినిమాని సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన ‘రంగస్థలం’ సినిమాను ఇన్స్పిరేషన్ గా తీసుకొని రాసుకున్నాడట.
రామ్ చరణ్ లాంటి ఒక స్టార్ హీరో చెవిటి వాడి పాత్రలో అలాగే క్యారెక్టర్ కి ప్రాధాన్యం ఉన్న పాత్రలో నటించడం వల్ల సినిమా అద్భుతంగా వచ్చిందని సూపర్ హిట్ అయింది. దానివల్లే అలాంటి క్యారెక్టర్ ను డిజైన్ చేసుకొని మనం కూడా రాసుకుంటే బాగుంటుందనే ఉద్దేశ్యంతోనే శివ నిర్వాణ రవితేజ కోసం ఒక ప్రత్యేకమైన పాత్ర ను క్రియేట్ చేసి చేసి ఇరుముడి సినిమా చేశాడు.
ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా ప్రేక్షకులందరిని విశేషంగా అలరించింది. కాబట్టి శివ నిర్వాణ ఈ మూవీతో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. మొత్తానికైతే సుకుమార్ ఇన్స్పిరేషన్ తో ఇరుముడి సినిమా కథని రాసుకొని దానికి రవితేజని ఒప్పించి సినిమా చేయడం అనేది మామూలు విషయం కాదు. మొత్తానికైతే ఆయన చేసిన ప్రయోగం సక్సెస్ అవ్వడంతో మరి కొంతమంది స్టార్ డైరెక్టర్లు సైతం ఇలాంటి సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది…
తదుపరి సినిమాని స్టార్ హీరోలతో చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఇంతకీ ఆ స్టార్ హీరోలు ఎవరు అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఇక రవితేజ చాలా రోజుల నుంచి రొటీన్ సినిమాలు చేస్తున్నాడు అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. కానీ ఈ సినిమాతో ఆయన నెక్స్ట్ లెవెల్ సక్సెస్ ను సాధించి ట్రోలర్స్ నోర్లు మూయించాడనే చెప్పాలి…