Homeఎంటర్టైన్మెంట్Anchor Anasuya: 'భర్త చనిపోతే' అంటూ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యాంకర్ అనసూయ.. వీడియో...

Anchor Anasuya: ‘భర్త చనిపోతే’ అంటూ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యాంకర్ అనసూయ.. వీడియో వైరల్..

Anchor Anasuya: వివాదాల చుట్టూ అనసూయ తిరుగుతుందో, లేదా వివాదాలే ఆమె చుట్టూ తిరుగుతాయో అర్థం కాదు. ఎల్లప్పుడూ సోషల్ మీడియా లో ఎదో ఒక అంశంపై తన అభిప్రాయాన్ని చాలా బోల్డ్ గా వ్యక్తం చేస్తూ ఉంటుంది అనసూయ. వాటికి అత్యధిక శాతం నెటిజెన్స్ ఏకీభవించరు, దీంతో ఆమెపై తీవ్రమైన ట్రోల్స్ వస్తుంటాయి. ఈమధ్యనే ‘జై శ్రీరామ్’ నినాదం అంశంపై బోల్డ్ గా కొన్ని వ్యాఖ్యలు చేసి తీవ్రమైన వ్యతిరేకత ని ఎదురుకుంది అనసూయ. ఇప్పుడు […]

Anchor Anasuya: వివాదాల చుట్టూ అనసూయ తిరుగుతుందో, లేదా వివాదాలే ఆమె చుట్టూ తిరుగుతాయో అర్థం కాదు. ఎల్లప్పుడూ సోషల్ మీడియా లో ఎదో ఒక అంశంపై తన అభిప్రాయాన్ని చాలా బోల్డ్ గా వ్యక్తం చేస్తూ ఉంటుంది అనసూయ. వాటికి అత్యధిక శాతం నెటిజెన్స్ ఏకీభవించరు, దీంతో ఆమెపై తీవ్రమైన ట్రోల్స్ వస్తుంటాయి. ఈమధ్యనే ‘జై శ్రీరామ్’ నినాదం అంశంపై బోల్డ్ గా కొన్ని వ్యాఖ్యలు చేసి తీవ్రమైన వ్యతిరేకత ని ఎదురుకుంది అనసూయ. ఇప్పుడు లేటెస్ట్ అనాదిగా వస్తున్న హిందూ సంప్రదాయం గురించి ప్రశ్నిస్తూ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఇన్ స్టాగ్రామ్ లో ఆమె అప్లోడ్ చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఈ వ్యాఖ్యలపై నెటిజెన్స్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇంతకీ ఆమె ఏమి మాట్లాడిందో ఒకసారి చూద్దాం.

ఆమె మాట్లాడుతూ ‘మూడేళ్ళ క్రితం మా నాన్నగారు చనిపోయారు. ఈ విషయం మీ అందరికీ తెలిసే ఉంటుంది. మా అమ్మ చాలా అందంగా ఉంటుంది. మంచి బొట్టు , కాటుక , రంగురంగుల గాజులు , గజ్జలు వంటివి వేసుకొని మహాలక్ష్మి లాగా కనిపించేది. మా నాన్న గారు చనిపోయినప్పటి నుండి ఆమె ఇవేమి వేసుకోవడం లేదు. పెళ్ళికి ఇవన్నీ ఎందుకు ముడిపెడుతూ వస్తున్నారు?, ఇవన్నీ పుట్టుక తో వచ్చినవి కదా?, పెళ్లయ్యాక భర్త చనిపోయిన తర్వాత ఇవన్నీ ఎందుకు వేసుకోకూడదు? , ఇదెక్కడి న్యాయం’ అన్నట్టుగా ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో సంచలనం రేపుతోంది. అనసూయ చేసిన ఈ కామెంట్స్ కి కొందరు సపోర్టుగా నిలిస్తే , మరికొందరు హిందూ సంప్రదాయాలను నిలదీసేందుకు నీకు ఎంత ధైర్యం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.

ఇక అనసూయ కెరీర్ విషయానికి వస్తే , ఒకప్పుడు బుల్లితెర పై యాంకర్ గా ఈమె ఎంత బిజీ గా ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. జబర్దస్త్ ద్వారా పాపులారిటీ ని సంపాదించుకొని అతి తక్కువ సమయం లోనే స్టార్ యాంకర్ రేంజ్ కి ఎదిగింది అనసూయ. అలా ఆమెకు మంచి పేరు రావడంతో సినిమాల్లో కూడా అవకాశాలు క్యూలు కట్టాయి. విలన్ గా , క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటిస్తూ వచ్చిన అనసూయ, ఈమధ్య కాలం లో పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు, యాంకర్ గా కూడా ఆమె ప్రెజెన్స్ పూర్తిగా తగ్గిపోయింది.

 

View this post on Instagram

 

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)

 

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper