spot_img
Homeఎంటర్టైన్మెంట్Pushpa Movie: "పుష్ప" సినిమా నుంచి మరో అప్డేట్ ను ప్రకటించిన చిత్ర బృందం...

Pushpa Movie: “పుష్ప” సినిమా నుంచి మరో అప్డేట్ ను ప్రకటించిన చిత్ర బృందం…

Pushpa Movie: డైరెక్ట‌ర్ సుకుమార్, ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్ ల కాంబినేష‌న్లో తెరకెక్కుతున్న చిత్రం ” పుష్ప”. ఈ చిత్రంలో రష్మిక మండన్నా హీరోయిన్ గా నటిస్తుండగా… మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్ గా నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో పాన్‌ ఇండియా లెవెల్లో ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. ఆర్య, ఆర్య 2 తర్వాత  వీరిద్దరు కలిసి ఈ మూవీ తెరకెక్కిస్తుండడంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. కాగా తాజాగా ఈ సినిమా నుంచి అభిమానులకు ఓ అప్డేట్ ను మూవీ యూనిట్ ప్రకటించారు.

anasuya poster release update from pushpa movie team

పుష్ప చిత్రంలో అనసూయ ద్రాక్షాయని పాత్రలో నటిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ ను రేపు ఉదయం 10:08 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ పోస్టర్ కోసం అనసూయ అభిమానుల్లో సందడి వాతావరణం మొదలైంది. రంగస్థలం లో తన నటనతో అందరినీ మెప్పించిన అనసూయ ఈ సినిమాతో ఎలా మ్యాజిక్ చేస్తారో అని ఎదురు చూస్తున్నారు.  ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ‘దాక్కో దాక్కో మేక’, ‘శ్రీవల్లి’, ‘సామి సామి’, పాటలు అభిమానులకు విపరీతంగా నచ్చేశాయి. కన్నడ నటుడు ధనుంజయ,  అజయ్, సునీల్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. ఈ సినిమా తొలి భాగం క్రిస్మస్ కానుకగా డిసెంబర్‌ 17 వ తేదీన విడుదల కాబోతుంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

 

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

Sidiri Appalaraju Arrest

Sidiri Appalaraju Arrest: అరెస్టు చేసే దాకా తెచ్చుకున్న ఆ మాజీ మంత్రి!

Sidiri Appalaraju Arrest: ఎట్టకేలకు మాజీమంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సీదిరి అప్పలరాజు అరెస్టయ్యారు. అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మ నడిపిన బైక్ ఢీకొని దానయ్య అనే గొర్రెల కాపరి...
Healthy Dinner

Healthy Dinner: రాత్రి సమయంలో ఈ ఆహారం తింటున్నారా…

Healthy Dinner: ప్రస్తుత కాలంలో చాలామంది నిద్ర సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే కొందరు ఉద్యోగాలు ఇతర కారణాలతో ఒత్తిడిని ఎదుర్కొని సరైన నిద్ర పోవడం లేదు. మరికొందరు రాత్రి సమయంలో జీర్ణం...
RRB JE Recruitment 2026

RRB JE Recruitment 2026: రైల్వేలో యువతకు బంపర్‌ ఆఫర్.. ఈ ఛాన్స్‌ మిస్‌ చేసుకోకండి!

RRB JE Recruitment 2026: భారతీయ రైల్వేలు దేశంలోని అతిపెద్ద పబ్లిక్‌ సెక్టార్‌ సంస్థల్లో ఒకటి. ఇప్పుడు ఆ సంస్థలోని ముఖ్యమైన టెక్నికల్‌ పోస్టులను భర్తీ చేయడానికి రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డులు (ఆర్‌ఆర్‌బీ)...
Cockroach Facts

Cockroach Facts: తల లేకపోయినా ఈ జీవి బతుకుతుంది.. సృష్టికే సవాల్ విసిరే దీని కథేంటో తెలుసా

Cockroach Facts: ఒక నిమిషం గాలి పీల్చుకోకుండా మనం ఉండగలుగుతామా.. అక్కడి దాకా ఎందుకు తల లేకుండా బతకగలుగుతామా.. ఇది సాధ్యమవుతుందా.. కానీ ఆ జీవి విషయంలో సాధ్యమవుతుంది. ఎందుకంటే అది సృష్టికే...
JP Nadda

JP Nadda: నడ్డా చెప్పింది నిజమే.. పేపర్ లీక్ ల గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ కు లేదు..

JP Nadda: ఈ దేశంలో పేపర్ లీక్ ల గురించి మాట్లాడే అర్హత ఏ పార్టీకి కూడా లేదు. ఈ మాట నూటికి నూరు శాతం కాదు కోటి శాతం నిజం....
Oktelugu Epaper