Johnny Master: ఈమధ్య కాలంలో డ్యాన్సర్స్ అసోసియేషన్ లో జానీ మాస్టర్ , శేఖర్ మాస్టర్ గ్రూపుల మధ్య జరిగిన గొడవ ఎంతటి దుమారం రేపిందో మనమంతా చూశాము. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అవ్వడం తో , స్వయంగా మెగాస్టార్ చిరంజీవి కలగచేసుకొని జానీ మాస్టర్ , శేఖర్ మాస్టర్ లకు సర్దిచెప్పే ప్రయత్నం చేసాడు. అనంతరం జానీ మాస్టర్ ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేయడం , ఆ ప్రెస్ మీట్ లో ఆయన అసోసియేషన్ లో జరుగుతున్న అవకతవకలపై ఆవేదన వ్యక్తం చేస్తూ మాట్లాడడం, ఆ తర్వాత ఫిలిం ఫెడరేషన్ వివరణ ఇవ్వకపోతే జానీ మాస్టర్ ని బహిష్కరిస్తాము అంటూ వార్నింగ్ ఇవ్వడం , ఆ తర్వాత వెంటనే జానీ మాస్టర్ వివరణ ఇవ్వడం తో ఆయనపై వేటు ఎత్తేయడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి.
అయితే రీసెంట్ గా జరిగిన ఒక ఈవెంట్ లో జానీ మాస్టర్ ఫెడరేషన్ కి మరోసారి క్షమాపణలు చెప్పడం ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఆయన మాట్లాడుతూ ‘తెలిసో తెలియక కొన్ని తప్పులు జరిగాయి. ఫిలిం ఫెడరేషన్ తండ్రి స్థానం లో ఉంది కాబట్టి, చిన్న పిల్లలు లాగా తప్పు చేసిన మమ్మల్ని క్షమించాలని కోరుకుంటున్నాము. ఇకపై ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకునే బాధ్యత మాది. డ్యాన్సర్స్ అసోసియేషన్ లో గ్రూపులు కట్టకూడదు. అందరం కలిసికట్టుగా ఉందాం, కలిసి పని చేద్దాం. ఐక్యంగా ముందుకు వెళదాం. ఇక ఈ వివాదాలకు ముగింపు పలుకుదాం. మీరందరు కూడా క్షమాపణ కోరుతూ ఫెడరేషన్ కి లేఖలు రాయండి’ అంటూ జానీ మాస్టర్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. దీనిపై సోషల్ మీడియా లో ఇప్పుడు పెద్ద చర్చ నే నడుస్తోంది.
అకస్మాత్తుగా జానీ మాస్టర్ ఇలా మాట్లాడుతున్నాడేంటి, ఇంత మార్పు ఎలా వచ్చింది?, పైన నుండి సినీ పెద్దల ఒత్తిడి ఆయన పైన ఏమైనా ఉందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్. ఇకపోతే జానీ మాస్టర్ జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత రీ ఎంట్రీ లో దుమ్ము లేపుతున్న సంగతి అందరికీ తెలిసిందే. రీ ఎంట్రీ లో ఆయన ‘పెద్ది’ చిత్రం లో కంపోజ్ చేసిన ప్రతీ పాట పెద్ద హిట్ అయ్యింది. ఇప్పుడు వరుసగా పాన్ ఇండియన్ సినిమాలు చేస్తూ , ఫుల్ బిజీ గా గడుపుతున్నాడు జానీ మాస్టర్.
డాన్సర్స్ అసోసియేషన్ వివాదంపై జానీ మాస్టర్ సంచలనం
తెలిసో.. తెలియకో తప్పులు జరిగాయి-జానీ మాస్టర్
పెద్ద మనసు చేసుకుని మమ్మల్ని క్షమించాలి-జానీ మాస్టర్
ఇకపై ఎలాంటి తప్పులు జరగకుండా చూసుకుందాం-జానీ మాస్టర్
డాన్సర్స్ అసోసియేషన్లో గ్రూపులు కట్టొద్దు-జానీ మాస్టర్
అందరం కలిసి… pic.twitter.com/rfdO4ibrJs
— RTV (@RTVnewsnetwork) August 11, 2026