Social Media Influencer: నేటి కాలంలో ప్రేమలు ఇన్ స్టంట్ వ్యవహారాల లాగా మారిపోతున్నాయి. మనుషులు కలవడం.. తనవులు కలవడం.. ఆ తర్వాత విడిపోవడం ఇవన్నీ క్షణాల కాలంలోనే జరిగిపోతున్నాయి. అందువల్లే ప్రేమకు విలువ లేకుండా పోతోంది. చివరికి ప్రేమ వివాహాలు చేసుకున్న వారు కూడా తమ ప్రేమను నిలుపుకోలేకపోతున్నారు.
నేటి కాలంలో ప్రేమ వివాహాలు ఎలా విచ్ఛిన్నమైపోతున్నాయో నిరూపించడానికి ఎన్నో సంఘటనలు జరిగాయి. ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఇటువంటి కేసులలో కొత్త కొత్త వ్యవహారాలు వెలుగులోకి వస్తున్నాయి. అవన్నీ కూడా నేటి కాలంలో సభ్య సమాజం మారిన తీరుకు బలమైన నిదర్శనంగా నిలుస్తున్నాయి. విచ్చలవిడితనం పెరిగిపోవడం.. సోషల్ మీడియాలో కొత్త కొత్త స్నేహాలు పరిచయం కావడం.. ఇలా రకరకాల కారణాల వల్ల ప్రేమ వివాహ బంధాలు స్వల్పకాలంలో నే ముగిసిపోతున్నాయి. అప్పటిదాకా సాగించిన ప్రేమ.. చెప్పుకున్న మాటలు.. పంచుకున్న ఊసులు ఇవన్నీ కూడా వ్యామోహం ముందు ఓడిపోతున్నాయి.
తాజాగా కేరళ రాష్ట్రంలో ఓ వివాహిత తన ప్రియుడితో పారిపోయింది. వాస్తవానికి ఈమెకు జరిగింది ప్రేమ వివాహం. ఈమె పేరు మేఘా నాయర్. మలయాళ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అఖిల్ ఎనర్ డి ని మేఘా ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2024 లో ఈమె అఖిల్ ని వివాహం చేసుకుంది. వీరిద్దరూ కూడా యూట్యూబ్, ఇన్ స్టా గ్రామ్ లో లైఫ్ స్టైల్ వ్లాగ్స్, కామెడీ వీడియోలు చూసేవారు.. వీరికి లక్షలలో ఫాలోవర్స్ ఉన్నారు. మేఘా ఇటీవల ఉన్నట్టుండి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. దీంతో ఆమె గురించి అఖిల్ ఆరా తీయడం మొదలుపెట్టాడు. సిసిటీవీ ఫుటేజ్ పరిశీలించగా.. ఆమె ఒక కండక్టర్ తో పారిపోయినట్టు గుర్తించాడు.. దీనిపై అఖిల్ తన అభిప్రాయం చెప్పేశాడు. “జరిగింది ఏదో జరిగిపోయింది. ఇప్పుడు ఆమె గురించి ఎవరూ మాట్లాడొద్దు. ఆమె ప్రేవసికి విలువ ఇవ్వాలి.. ఆమె తనకు నచ్చిన నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో తప్పుపట్టాల్సిన అవసరం లేదని” అఖిల్ పేర్కొన్నారు.
మేఘా నాయర్ తీసుకున్న నిర్ణయం పట్ట చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకుని..చివరికి ఇలా చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇలా చేసిన తర్వాత ఇక ఆ ప్రేమకు ఏ విలువ ఉంటుందని వ్యాఖ్యనిస్తున్నారు. మరికొందరమే ఆమె నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. నిజమైన ప్రేమ కోసం ఆమె అడుగులు వేసిందని అంటున్నారు.
భర్తను వదిలేసి బస్సు కండక్టర్‌తో పారిపోయిన మలయాళ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అఖిల్ NRD భార్య మేఘా
తన భార్య కనిపించలేదని, సీసీటీవీ ఫుటేజ్‌లో చెక్ చేస్తే వేరే వ్యక్తితో వెళ్లిపోయినట్లు తెలిపిన అఖిల్
రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న అఖిల్, మేఘా జంట
తన భార్య మేఘా స్థానిక… pic.twitter.com/vnH1AG9K95
— Telugu Scribe (@TeluguScribe) August 11, 2026