Taatiparthi Chandrasekhar: రాజకీయ నాయకులకు విషయ పరిజ్ఞానం ఎంతో కొంత ఉండాలి. ముఖ్యంగా మినిమం టాపిక్స్ మీద కాస్త అవగాహన ఉండాలి. అలాంటి అవగాహన లేకపోతే.. విషయ పరిజ్ఞానం కొంత కూడా లేకపోతే జనాల ముందు అభాసుపాలు కావలసి వస్తుంది. ఇప్పుడు ఈ వైసీపీ ఎమ్మెల్యే పరిస్థితి కూడా అలానే మారిపోయింది .
గత ఎన్నికల్లో వైసిపి 11 స్థానాలలో విజయం సాధించింది. అందులో ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో గెలిచిన తాటిపర్తి చంద్రశేఖర్ ఒకరు. గతంలో ఈయన గురించి మీడియాలో అంతగా చర్చ సాగేది కాదు. కానీ ఇటీవల కాలంలో ఒక్కసారిగా ఈయన వార్తలలో వ్యక్తిగా మారిపోయారు. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్నారు. దీనంతటికీ ప్రధాన కారణం చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలే.
తాటిపర్తి చంద్రశేఖర్ ఇటీవల మీడియా ముందుకు వచ్చారు. అమరావతి గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. కూటమి ఆధ్వర్యంలో జరుగుతున్న పనులలో భూతద్దం పెట్టి చూసే క్రమంలో.. ఆయన లైన్ తప్పారు. ఏం మాట్లాడుతున్నారో కనీసం సోయి కూడా లేక ఇష్టానుసారంగా మాట్లాడేశారు. ఫలితంగా సోషల్ మీడియాలో టిడిపి నేతల చేతిలో విపరీతంగా ట్రోల్ అవుతున్నారు. కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న అమరావతిని దేశంలోనే ఫ్రీ పోల్ సిటీగా తీర్చి దిద్దుతోంది.. ఒకవేళ ఈ విషయం మీద అవగాహన ఉండి ఉంటే తాటిపర్తి చంద్రశేఖర్ మరో విధంగా మాట్లాడి ఉంటే బాగుండేది. అలాకాకుండా కరెంటు పోల్స్ అండర్ గ్రౌండ్ లో పెడితే.. జనాలకు కరెంట్ షాక్ కొట్టదా.. దీనిని పూర్తిగా ఖండిస్తున్నాను అంటూ ఆయన పేర్కొన్నారు.
వాస్తవానికి అండర్ గ్రౌండ్ లో కరెంట్ పోల్స్ ఉంటాయి.. దానికి ఒక వ్యవస్థ ఉంటుంది. విద్యుత్ ప్రసారం విషయంలో పకడ్బందీ పద్ధతులు పాటిస్తుంటారు. పెద్ద పెద్ద దేశాలలో ఇదేవిధంగా విద్యుత్ సరఫరా సాగుతూ ఉంటుంది. ఈ విషయం తెలియక.. కనీసం అధ్యయనం చేసే స్థాయి లేక.. వైసీపీ ఎమ్మెల్యే ఇలా అభాసు పాలయ్యారు. ఎప్పుడైతే చంద్రశేఖర్ ఈ వ్యాఖ్యలు చేశారో.. అప్పటినుంచి టిడిపి నేతలు వేసుకోవడం మొదలుపెట్టారు. ఇది వైసిపి నేతల విజ్ఞాన ప్రదర్శన అంటూ ట్రోల్ చేయడం ప్రారంభించారు. పాపం వైసిపి ఎమ్మెల్యే.. విషయం గురించి తెలియక.. కనీసం అలా ఎందుకు చేస్తున్నారో అర్థం కాక.. ఏదేదో మాట్టాడేశారు. చివరికి ఇలా అభాసుపాలయ్యారు. తన పరవు తానే పోగొట్టుకున్నారు.