Samantha: స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న సమంత సడన్ గా నాగ చైతన్య తో విడాకులు తీసుకుని టాక్ అఫ్ ది టాలీవుడ్ గా మారింది. చైతన్య తో భార్య గా కాకుండా ఒక స్నేహితురాలిగా ఉంటానని తన ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ లో వెల్లడించింది. టాలీవుడ్ లో నే బ్యూటిఫుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్న ఈ జంట ఒక్కసారిగా విడిపోవడంతో యావత్ సినీ లోకమే నివ్వెర పోయింది. ఈ విషయాన్ని సమంత – చైతన్య అభిమానులు అయితే ఇప్పటికి జీరించుకోలేకపోతున్నారు.
ఎవరేమనుకున్నా, వాళ్ళ దాంపత్య బంధం లో ఏం జరిగినా … అది మాత్రం బయటకి రాకుండా నాగ చైతన్య – సమంత మాత్రం వాళ్ళ దారులు చూసుకుని ఒంటరి జీవితం లోకి అడుగు పెట్టారు. అక్టోబర్ 2 న మధ్యాహ్నం సమంతా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా నుండి నాగ చైతన్యతో విడిపోతున్నట్టు వివరించింది. అదే సమయానికి నాగ చైతన్య కూడా తన ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్ ఖాతా నుండి సమంత తో విడిపోతున్నట్టు తెలిపాడు.
ఈ నేపథ్యం లో సమంత తన ఇన్ స్టాగ్రామ్ లో ఏం పోస్ట్ పెట్టిన సరే ఇట్టే వైరల్ అయ్యి ట్రేండింగ్ లో నిలుస్తుంది. అయితే తాజా గా సమంత బిజినెస్ విమెన్ గా కూడా రాణిస్తుంది. సాకి అనే బట్టల బ్రాండ్, ఏకం లెర్నింగ్ స్కూల్ ఒకటి నడిపిస్తుంది. అయితే సమంత సాకి బట్టల బ్రాండ్ ఇన్ స్టాగ్రామ్ ఇద్దరినీ మాత్రం ఫాలో అవుతుంది. ఒకరు సమంత అయితే మరొకరు సమంత మాజీ భర్త నాగ చైతన్య అక్కినేని.
ఇప్పటికే సమంత తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా నుండి చైతన్య ఫోటోలను తొలగించిన సంగతి తెల్సిందే. మరి సమంత బట్టల బ్రాండ్ లో చైతన్య ని ఎందుకు ఫాలో అవుతుంది అనే విషయం పైన క్లారిటీ లేదు. మరి చైతన్య ని అన్ ఫాలో చేస్తుందో లేదో అని తెలుసుకోవాలంటే మరి కొన్నిరోజులు ఎదురు చూడాల్సిందే.