Anand Devarakonda: ఈ ఏడాది విడుదలైన చిత్రాల్లో కమర్షియల్ గా బయ్యర్స్ కి లాభాల వర్షం కురిపించిన చిత్రాల లిస్ట్ ని తీస్తే, అందులో ‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్రం కచ్చితంగా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. బయ్యర్స్ కి , నిర్మాతకు పెట్టిన ప్రతీ పైసాకు రెండింతల లాభం వచ్చింది. హీరో హీరోయిన్లు గా నటించిన కిరణ్ అబ్బవరం , శ్రీ గౌరీ ప్రియలకు కూడా మంచి పేరొచ్చింది. అయితే కమర్షియల్ గా ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చిన ఈ చిత్రాన్ని ముందుగా కిరణ్ అబ్బవరం తో చెయ్యాలని అనుకోలేదట. రెండేళ్ల క్రితం ‘బేబీ’ చిత్రం విడుదలై సూపర్ హిట్ అయ్యాక, మళ్లీ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కాంబినేషన్ లో ఒక సినిమాని ప్రకటించాడు సాయి రాజేష్. ఆ సినిమానే ఈ ‘చెన్నై లవ్ స్టోరీ’. కానీ ఆ తర్వాత ఈ సినిమా కిరణ్ అబ్బవరం చేతుల్లోకి వెళ్ళింది.
దీనిపై రీసెంట్ గా ఆనంద్ దేవరకొండ ఒక ఇంటర్వ్యూ లో స్పందించాడు. ఆయన మాట్లాడుతూ ‘చెన్నై లవ్ స్టోరీ చిత్రాన్ని ముందుగా నేను, వైష్ణవి చైతన్య కలిసి చేయాల్సి ఉంది. అప్పట్లో ఈ ప్రాజెక్ట్ ని ప్రకటించాము కూడా. కానీ నేను వేరే సినిమాకు కమిట్ అవ్వడం వల్ల, షెడ్యూల్స్ కుదరట్లేదు. అప్పుడు నిర్మాతలు మేము వేరే హీరో ని చూసుకోవాలని అనుకుంటున్నామని చెప్పారు. హీరో మారాడు కాబట్టి, హీరోయిన్ ని కూడా మార్చేశారు’ అంటూ చెప్పుకొచ్చాడు ఆనంద్ దేవరకొండ. అయితే ఈ సినిమాని ఆనంద్ , వైష్ణవి చేసుంటే ఇంకా పెద్ద హిట్ అయ్యేదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఎందుకంటే ‘బేబీ’ సినిమాలో వీళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరింది. ఇద్దరూ కూడా ఒకరి తో ఒకరు పోటీ పడి మరీ నటించారు.
మళ్లీ ఆ కాంబినేషన్ రిపీట్ అయ్యుంటే సినిమా ఔట్పుట్ ఇంకా బాగా వచ్చేదని, 100 కోట్ల గ్రాస్ ని అవలీలగా అందుకునేదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇకపోతే వీళ్లిద్దరు కలిసి రీసెంట్ గా ‘ఎపిక్’ అనే చిత్రం చేశారు. షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా, సెప్టెంబర్ 11 న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ప్రొమోషన్స్ లో భాగంగా ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఈ విషయాలను వెల్లడించారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదలై ఆడియన్స్ లో మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. మరి సినిమాకు కూడా అదే రేంజ్ రెస్పాన్స్ వస్తుందో లేదో చూడాలి.