Kiran Abbavaram: ఈమధ్య కాలంలో యంగ్ హీరోలు కేవలం నటించడమే కాదు , నిర్మాతలుగా కూడా వ్యవహరిస్తూ భారీ లాభాలను మూటగట్టుకుంటున్నారు. వారిలో నేచురల్ స్టార్ నాని నిర్మాతగా ఎలాంటి సూపర్ హిట్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పుడు ఆయన బాటలోనే కిరణ్ అబ్బవరం కూడా నడుస్తున్నాడు. ‘Ka ప్రొడక్షన్స్’ అనే నిర్మాణ సంస్థ ని ప్రారంభించిన ఆయన , తన అసిస్టెంట్ కెమెరా మెన్ ని హీరో గా పెట్టి రీసెంట్ గానే ‘తిమ్మరాజుపల్లి టీవీ’ అనే చిత్రాన్ని నిర్మించాడు. ఈ సినిమా కమర్షియల్ గా థియేట్రికల్ సక్సెస్ అవ్వలేదు కానీ , విడుదలకు ముందే ఓటీటీ లో మంచి రేటుకి అమ్ముడుపోయింది. కిరణ్ సబ్బవరం పెట్టిన డబ్బులు మొత్తం ఓటీటీ రైట్స్ తోనే రీకవర్ అయిపోయాయి.
అయితే ఇప్పుడు తన ‘KA ప్రొడక్షన్స్’ లో మరో సినిమాని నిర్మించడానికి సిద్దమయ్యాడు. ఈ చిత్రం లో ప్రధాన పాత్ర పోషించబోతున్నది మరెవరో కాదు, ‘బిగ్ బాస్ 9’ రన్నర్ తనూజ. ఈ ప్రాజెక్ట్ ని నిన్న గ్రాండ్ గా ప్రకటించారు. ఈ చిత్రానికి కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్ సోదరుడు అనుష్ గోరఖ్ దర్శకత్వం వహిస్తున్నాడు. నిన్న విడుదల చేసిన కాన్సెప్ట్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ పోస్టర్ ని చూస్తుంటే హారర్ జానర్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్న అనే విషయం అర్థం అవుతోంది. ఇప్పటి వరకు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇలాంటి కాన్సెప్ట్ రాలేదని , ఎప్పటికీ మర్చిపోలేని థియేట్రికల్ అనుభూతిని ఈ సినిమా కలిగించబోతుంది అంటూ తనూజ నిన్న తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో చెప్పుకొచ్చింది.
ఇకపోతే తనూజ కి ఇది చాలా మంచి అవకాశం అనే చెప్పాలి. ‘బిగ్ బాస్’ నుండి బయటకు వచ్చిన తర్వాత, కంటెస్టెంట్స్ తమకు ఇండస్ట్రీ లో చాలా పెద్ద అవకాశాలు వస్తాయని ఎన్నో కలలు కంటారు. కానీ అలాంటివేమీ పెద్దగా జరగలేదు. ఈ ‘బిగ్ బాస్’ షో కేవలం శివాజీ కి మాత్రమే ఉపయోగపడింది. ఇప్పుడు ఆ జాబితాలోకి ‘తనూజ’ కూడా చేరబోతోంది అనుకోవచ్చు. కిరణ్ అబ్బవరం అంటే ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఆ బ్రాండ్ ఇమేజ్ తో తెరకెక్కే సినిమా కాబట్టి, మార్కెట్ ఈ చిత్రం పై మంచి బజ్ ఉంటుంది. ఆ బజ్ కి తగ్గట్టుగా సినిమా ఉంటే కలెక్షన్ల వర్షం కురుస్తుంది. చూడాలి మరి ఈ సినిమా తనూజ కి ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది.