Homeఎంటర్టైన్మెంట్Epic Movie: ఆనంద్ దేవరకొండ 'ఎపిక్' మూవీ రివ్యూ.. హిట్టా? ఫట్టా?

Epic Movie: ఆనంద్ దేవరకొండ ‘ఎపిక్’ మూవీ రివ్యూ.. హిట్టా? ఫట్టా?

Epic Movie: బేబీ వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లు గా కలిసి నటించిన రెండవ చిత్రం ‘ఎపిక్’. ఈటీవీ విన్ యాప్ లో సూపర్ హిట్ గా నిల్చిన ’90s -మిడిల్ క్లాస్ బయోపిక్’ అనే వెబ్ సిరీస్ కి కొనసాగింపుగా ఈ చిత్రం తెరకెక్కింది. అందుకే ఈ సినిమాపై మొదటి నుండి ఆడియన్స్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. దానికి తోడు ప్రమోషనల్ కంటెంట్ […]

Epic Movie: బేబీ వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లు గా కలిసి నటించిన రెండవ చిత్రం ‘ఎపిక్’. ఈటీవీ విన్ యాప్ లో సూపర్ హిట్ గా నిల్చిన ’90s -మిడిల్ క్లాస్ బయోపిక్’ అనే వెబ్ సిరీస్ కి కొనసాగింపుగా ఈ చిత్రం తెరకెక్కింది. అందుకే ఈ సినిమాపై మొదటి నుండి ఆడియన్స్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. దానికి తోడు ప్రమోషనల్ కంటెంట్ కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడం తో, కచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందనే నమ్మకం ట్రేడ్ లో కూడా కలిగింది. అలా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి ఆడియన్స్ నుండి వచ్చిన రెస్పాన్స్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. నిన్న రాత్రి ఈ చిత్రానికి సంబంధించిన ప్రీమియర్ షోస్ ని కొన్ని ప్రాంతాల్లో ప్రదర్శించారు. ఆ షోస్ నుండి వచ్చిన రెస్పాన్స్ ఇప్పుడు సోషల్ మీడియా ని షేక్ చేస్తోంది.

కథ :

కథ విషయం లోకి వెళ్తే , ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి పై చదువుల కోసం లండన్ కి వెళ్తాడు. ఆర్థోడక్స్ ఫ్యామిలీ నేపథ్యం లో పెరిగిన ఆ అబ్బాయి కి, మోడరన్ బోల్డ్ ఆలోచనలు ఉన్న అమ్మాయి పరిచయం అవుతుంది. అలా పరిచయమైన వీళ్లిద్దరి మధ్య ఏర్పడిన ప్రేమ ఎలాంటి పరిణామాలకు దారి తీసింది, ఆ కారణంగా జెనెరేట్ అయ్యే ఫన్, ఎమోషన్స్ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు డైరెక్టర్. ఒక్క మాటలో చెప్పాలంటే ఇదొక స్క్రీన్ ప్లే ఆధారిత సినిమా అనొచ్చు.

విశ్లేషణ:

తెర మీద ఈ సినిమాని చూస్తున్నప్పుడు ప్రతీ ఒక్కరికి అనిపించేది ఒక్కటే, చాలా సింపుల్ కథ , కేవలం 30 నిమిషాల షార్ట్ ఫిల్మ్ లాగ తీయొచ్చు. అలాంటి కథ రెండు గంటలకు పైగా సాగదీయడమే కాకుండా , చివర్లో పార్ట్ 2 కూడా ఉంటుంది అని చెప్పడం థియేటర్స్ లో కూర్చున్న ఆడియన్స్ కి ఫ్యూజులు ఎగిరిపోయేలా చేసిందని అంటున్నారు విశ్లేషకులు. ఇక సోషల్ మీడియా లో అయితే ప్రీమియర్స్ చూసిన ప్రతీ ఒక్కరు ఇదొక డిజాస్టర్ సినిమా అని అంటున్నారు. డైరెక్టర్ ఈ సినిమాని ఒక సింపుల్ జెన్ జీ లవ్ స్టోరీ గా, కాస్త ఎమోషనల్ టచ్ తో ఫారిన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించాడు. ఈమధ్య కాలం లో ఇలాంటి సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది, అందులో ఎలాంటి సందేహం లేదు.

కానీ సింపుల్ స్టోరీ అయినప్పటికీ , న్యారేట్ చేసే విధానం కొత్తగా ఉంటే ఆడియన్స్ నెత్తిన పెట్టుకొని ఆదరిస్తారు. ఈ సినిమాలో లోపించింది అదే. చాలా అవుట్ డేటెడ్ టేకింగ్ తో డైరెక్టర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. స్క్రీన్ ప్లే ఇలాంటి సినిమాలకు చాలా గ్రిప్పింగ్ గా ఉండడం అవసరం. ఆడియన్స్ ఊహించలేని విధంగా సన్నివేశాలు రాసుకోవాలి. కానీ ఈ సినిమాలో తర్వాత ఏమి జరగబోతుందో అనేది చిన్న పిల్లలు కూడా చెప్పేయగలరు. అంతటి వీక్ స్క్రీన్ ప్లే అన్నమాట. కొన్ని ఎమోషనల్ సీన్స్ బాగానే రాసుకున్నాడు కానీ , వెండితెర మీద వాటిని పర్ఫెక్ట్ గా ఆవిష్కరించడం లో డైరెక్టర్ విఫలం అయ్యాడు.

ఇక టెక్నికల్ పరంగా చూస్తే, విజువల్స్ చాలా రిచ్ గా , క్వాలిటీ తో ఉన్నాయి. మ్యూజిక్ కూడా పర్వాలేదు అనిపించే రేంజ్ లో ఉంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కాస్త బెటర్ గా ఉంటే బాగుండేది అని అనిపించింది. ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ కొన్ని ఫన్ ఎలిమెంట్స్ వర్కౌట్ అయ్యాయి , జెన్ జీ ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. కానీ సెకండ్ హాఫ్ మాత్రం చాలా నీరసంగా ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ ఉండదు. ఓవరాల్ గా బిలో యావరేజ్ రేంజ్ సినిమా అని చెప్పొచ్చు. ఇక ఆనంద్ దేవరకొండ విషయానికి వస్తే , సినిమా సినిమాకు ఇతను నటన లో చాలా పరిణీతి చూపిస్తున్నాడు. ఎదో ఒక రోజు ఈయన నటన లో తన అన్నయ్య విజయ్ దేవరకొండ ని దాటేస్తాడని అనిపిస్తోంది. ఇక వైష్ణవి చైతన్య ఎప్పటి లాగానే చాలా సహజం గా నటించింది. ఈ సినిమాలోని అతి పెద్ద ప్లస్ పాయింట్ ఏదైనా ఉందా అంటే , ఆనంద్ దేవరకొండ , వైష్ణవి చైతన్య మధ్య ఉన్న కెమిస్ట్రీ నే. ఆన్ స్క్రీన్ లో వీళ్ళ జంట చూడముచ్చటగా అనిపించింది. రాబోయే రోజుల్లో వీళ్ళు మరిన్ని సినిమాల్లో కలిసి నటించొచ్చు, అంతటి పర్ఫెక్ట్ పెయిర్ అన్నమాట.

ఓవరాల్ గా ఒక్కమాటలో చెప్పాలంటే , వీకెండ్ లో ఎదో ఒక సినిమా చూద్దాం , కాసేపు టైం పాస్ అవ్వుద్ది అనుకుంటే ఈ సినిమాని వెళ్లి చూడండి. అలా కాకుండా కొత్త దానం కోరుకొని వెళ్తే మాత్రం చాలా నిరాశకు గురి అవుతారు. ఈ చిత్రానికి మేము ఇస్తున్న రేటింగ్ 2.5 మాత్రమే. మీరు ఈ సినిమాని ఇప్పటికే చూసి ఉంటే , మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపం లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper