Bigg Boss 10 Telugu: ‘బిగ్ బాస్’ రియాలిటీ షోలో వచ్చే ట్విస్టులు ఎవ్వరూ ఊహించలేరు. స్క్రిప్ట్ ప్రకారం నడిచే షో కాదు కాబట్టి, మేకర్స్ అప్పటికప్పుడు స్పాట్ లో కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. గతం లో అలా స్పాట్ లో నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఎంతో మంది కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. ఉదాహరణకు గత సీజన్ ని తీసుకోండి. ఆ సీజన్ లో శ్రీజ అనే కంటెస్టెంట్ ఆడియన్స్ ఓటింగ్ ద్వారా ఎలిమినేట్ అవ్వలేదు. ఒక గేమ్ ప్రక్రియ లో భాగంగా ఎలిమినేట్ అయ్యింది. దీనిపై అప్పట్లో సోషల్ మీడియా లో తీవ్రమైన ట్రోల్స్ నడిచాయి. అయితే సెప్టెంబర్ 6 నుండి మొదలు కాబోతున్న ‘బిగ్ బాస్ 10’ లో కూడా ఎవ్వరి ఊహలకు అందని ఒక ట్విస్ట్ ని ప్లాన్ చేశారట మేకర్స్. ఆ ట్విస్ట్ ని చూసిన తర్వాత ఆడియన్స్ ‘బిగ్ బాస్’ టీం పై మండిపడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే ‘గ్రాండ్ లాంచ్’ ఎపిసోడ్ రోజే, ఒక ఎలిమినేషన్ ని ప్లాన్ చేశారట మేకర్స్. ఆ ఎలిమినేషన్ సెలబ్రిటీస్ లో ఉంటుందా?, లేదంటే ‘అగ్ని పరీక్ష 2’ ద్వారా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన సామాన్యుల్లో ఉంటుందా? అనేది తెలియాల్సి ఉంది. అయితే ఇది నిజమైన ఎలిమినేషనా?, లేదంటే ఫేక్ ఎలిమినేషనా? అనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే ‘బిగ్ బాస్ 8’ గ్రాండ్ లాంచ్ రోజున కూడా ఇలాగే ఒక ఎలిమినేషన్ డ్రామా వేశారు. ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి , కంటెస్టెంట్స్ ఓటింగ్ ద్వారా ఎవరు ఈ హౌస్ లో ఉండకూడదని మెజారిటీ వస్తుందో, వాళ్ళు ఎలిమినేట్ అవుతారని ఒక ట్విస్ట్ ఇస్తాడు. అందరూ మణికంఠ పేరు చెప్తారు. అప్పుడు మణికంఠ తాను నిజంగానే ఎలిమినేట్ అవుతానేమో అని భయపడి బాగా ఎమోషనల్ అయిపోతాడు.
‘బిగ్ బాస్ 10’ లో కూడా సరిగ్గా ఇలా ఫేక్ ఎలిమినేషన్ డ్రామా ఆడే అవకాశాలు ఉండొచ్చని అంటున్నారు. ఇలా చేయడం వల్ల, మొదటి రోజే కంటెస్టెంట్స్ మధ్య గొడవలు ఏర్పడుతాయి, బోలెడన్ని నామినేషన్ పాయింట్స్ దొరుకుతాయి , అందుకే బిగ్ బాస్ టీం ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇకపోతే ఈ సీజన్ లోకి అడుగుపెట్టబోతున్న కంటెస్టెంట్స్ లిస్ట్ ఇన్ని ఇది వరకే మనమంతా చూసాము. మరో ముగ్గురు సెలబ్రిటీ కంటెస్టెంట్స్ ఫైనల్ చేయాలట. ఇప్పటికే ఈ లిస్ట్ లో అధిక శాతం అబ్బాయిలు ఉండడంతో , ఇప్పుడు అమ్మాయిల కోసం చూస్తున్నారట మేకర్స్. మరోవైపు అగ్ని పరీక్ష 2 నుండి ఝాన్సీ ‘బిగ్ బాస్ 10’ కి క్వాలిఫై అయిపోయింది. ఇక ఓటింగ్ ప్రకారం చూస్తే రోహిత్ , అమన్ కచ్చితంగా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.