Homeఎంటర్టైన్మెంట్Kiran Abbavaram: 'పెద్ది' మూవీ లో జరిగిన పెద్ద తప్పు అదే అంటూ కిరణ్...

Kiran Abbavaram: ‘పెద్ది’ మూవీ లో జరిగిన పెద్ద తప్పు అదే అంటూ కిరణ్ అబ్బవరం హాట్ కామెంట్స్..

Kiran Abbavaram: ఈ ఏడాది టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రం ‘పెద్ది’. బుచ్చి బాబు దర్శకత్వం లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఈ సినిమా , భారీ అంచనాల నడుమ విడుదలై సంచలన విజయం సాధించింది. వరుస ఫ్లాప్స్ లో ఉన్న రామ్ చరణ్ ని సక్సెస్ ట్రాక్ ఎక్కేలా చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 350 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సెన్సేషన్ సృష్టించింది. […]

Kiran Abbavaram: ఈ ఏడాది టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రం ‘పెద్ది’. బుచ్చి బాబు దర్శకత్వం లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఈ సినిమా , భారీ అంచనాల నడుమ విడుదలై సంచలన విజయం సాధించింది. వరుస ఫ్లాప్స్ లో ఉన్న రామ్ చరణ్ ని సక్సెస్ ట్రాక్ ఎక్కేలా చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 350 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సెన్సేషన్ సృష్టించింది. హిందీ వెర్షన్ , నార్త్ అమెరికా + రెస్ట్ ఆఫ్ వరల్డ్ లో ఈ చిత్రానికి ఆశించిన స్థాయి వసూళ్లు రాలేదు , లేదంటే 400 కోట్ల గ్రాస్ మార్కుని అవలీలగా అందుకొని ఉండేది. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రం పై ప్రముఖ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

ఆయన పాల్గొన్న ఒక ఇంటర్వ్యూ లో యాంకర్ ఒక ప్రశ్న అడుగుతూ ‘పెద్ది సినిమాలో ఇప్పుడు ఒక విమర్శ అయితే వచ్చింది. ఎందుకంటే పాటల ప్లేస్ మెంట్ సరిగా లేదు , అదొక్కటి సెట్ అయ్యుంటే సినిమా ఇంకా బాగుండేది అని కొంతమంది అన్నారు, మీకు కూడా ఆ సినిమా చూస్తున్నప్పుడు అలాంటి ఫీలింగ్ ఏమైనా కలిగిందా ?’ అని అడగ్గా, దానికి కిరణ్ అబ్బవరం సమాధానం చెప్తూ ‘నాకు పెద్ది చూసేంతసేపు , నాకు చరణ్ అన్న కష్టమే కనిపిస్తూ వచ్చింది. చరణ్ అన్న ఇంత కష్టపడ్డాడు , కనీసం చరణ్ అన్న కోసమైనా ఆడాలి అని ఒక నటుడిగా చాలా కోరుకున్నాను. ఆయన ఒక నటుడిగా ఇంత కష్టపడ్డాడు , నేను ఆ రేంజ్ లో కష్టపడగలనా అనే మైండ్ సెట్ తోనే చూసాను ఆ చిత్రాన్ని’.

‘చూసి బాగా ఎంజాయ్ చేశాను. బయటకి వచ్చిన తర్వాత కూడా మంచి ఫీలింగ్ అనిపించింది. బయట కూడా చరణ్ అన్న కోసమైనా ఆడాలి రా ఈ సినిమా అని నా సహచరులకు చెప్పేవాడిని’ అంటూ చెప్పుకొచ్చాడు. యాంకర్ మరో ప్రశ్న అడుగుతూ ‘అంటే కంటెంట్ పరంగా మీకు కూడా ఆ సినిమా పై కంప్లైంట్స్ ఉన్నాయి అన్నమాట’ అని అంటాడు. అప్పుడు కిరణ్ అబ్బవరం ‘ఎమోషనల్ కంటెంట్ కంటే ఎక్కువగా , కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండడం వల్ల , కొంతమంది జనాలకు ఈ సినిమా నచ్చలేదు’ అంటూ చెప్పుకొచ్చారు కిరణ్ అబ్బవరం . ఆయన మాట్లాడిన మాటలను మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper